31 C
Hyderabad
Tuesday, October 1, 2024

గాంధీ ఆస్పత్రిలో రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో వైద్య మౌలిక సదుపాయాలను, ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి సంబంధించిన 100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హ‌రీశ్‌రావు ఆదివారం నాడు రూ. 13 కోట్ల విలువైన ఎంఆర్‌ఐ,  హృద్రోగులకు అత్యవసర యాంజియోప్లాస్టీ,  యాంజియోగ్రామ్ నిర్వహించడానికి 9 కోట్ల రూపాయల క్యాథ్ ల్యాబ్‌ను నిన్న ప్రారంభించారు.

గత నవంబర్‌లో ప్రారంభించిన రూ.2.14 కోట్ల విలువైన సీటీ స్కాన్ మిషన్ గాంధీ ఆస్పత్రిలో రోగులకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. రూ.55 కోట్లతో నిర్మిస్తున్న మాతా శిశు ఆరోగ్యం (ఎంసీహెచ్) కోసం 100 పడకల సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడిని పెద్ద ఎత్తున చేపట్టేందుకు, రూ. 30 కోట్లతో దాదాపు ఎనిమిది మాడ్యులర్ హై-ఎండ్ ఆపరేషన్ థియేటర్‌లను కలిగి ఉన్న స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ కూడా మరికొద్ది నెలల్లో గాంధీ ఆస్పత్రిలో సిద్ధం కానుంది.

“మాతా శిశు ఆరోగ్య కేంద్రం, స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌తో పాటు,  నిరుపేద జంటల కోసం గాంధీ ఆసుపత్రిలో రూ. 2.50 కోట్లతో సంతానోత్పత్తి క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. తద్వారా  పేదలు కష్టపడి సంపాదించిన డబ్బును ప్రైవేట్ ఐవిఎఫ్ సౌకర్యాలలో ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రికే వస్తారని మంత్రి అన్నారు. ఇలా ఒక సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

రోగుల అటెండర్ల  కోసం  గాంధీ ఆసుపత్రిలో కోటి రూపాయలతో షెల్టర్ నిర్మాణం చేపట్టాం. గడిచిన ఆరు నెలల్లో గాంధీ, ఓజీహెచ్‌లోని సర్జన్లు కూడా రూ. 2 కోట్ల విలువైన అత్యాధునిక కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం గత నాలుగు నెలల్లో 48 కీళ్లు, మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించగా, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సర్జన్లు గత ఆరు నెలల్లో 50కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి అత్యాధునిక కీళ్లు, మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హ‌రీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles