24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

యుఎస్ ‘క్యాపిటల్ హిల్’ అల్లర్లపై విచారణ.. ‘న్యాయాన్ని అపహాస్యం’ చేశారన్న ట్రంప్!

వాషింగ్ట‌న్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది 2021, జ‌న‌వ‌రి ఆరో తేదీన క్యాపిట‌ల్ హిల్‌పై  తన మద్దతుదారులు చేసిన అల్లర్లపై కాంగ్రెస్ విచారణను “న్యాయాన్ని అపహాస్యం” చేశారని దుయ్యబట్టారు. బైడెన్‌ ప్రభుత్వం దేశంలోని పెద్ద సమస్యలపై దృష్టి సారించడానికి బదులుగా… డెమొక్రాటిక్ నేతృత్వంలోని ప్యానెల్ “అమెరికన్ ప్రజలు అనుభవిస్తున్న బాధల నుండి దృష్టి మరల్చడానికే తనను దోషిగా ప్రకటించారని పేర్కొన్నారు. దీనిపై 12 పేజీల ప్రకటన విడుదల చేశారు. తనను దోషిగా నిర్ధారించిన అమెరికా ప్ర‌జాప్ర‌తినిధుల ప్యానెల్‌ను “కంగారూ కోర్ట్” అని ట్రంప్ విమర్శించారు.

ఈ సందర్భంగా మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 2020 అధ్యక్ష ఎన్నికల పెద్ద బూటకమని పునరుద్ఘాటించారు, అంతకు ముందు రోజు అమెరికన్‌ కాంగ్రెస్ విచారణలో ట్రంప్‌ తన మద్దతుదారులను అల్లర్లు చేయడానికి ప్రేరేపించారని వాదించింది. 2020 ఎన్నికలలో భారీగా రిగ్గింగ్‌ జరిగింది. దొంగ ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఈ నిజాలను కప్పిపుచ్చడానికి డెమొక్రాట్లు జనవరి 6 కథనాన్ని సృష్టించారు” అని నేడు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 76 ఏళ్ల ట్రంప్ ప్రకటనలో తెలిపారు. అమెరికా ప్ర‌జాప్ర‌తినిధుల ప్యానెల్ విచారణ అంతా ఏకపక్షంగా ఉందని ట్రంప్ మండిపడ్డారు, ప్యానెల్ “న్యాయాన్ని అపహాస్యం చేసిందన్నారు.

సోమవారం నాటి టెలివిజన్ విచారణలో భాగంగా, కాంగ్రెస్ ప్యానెల్ –– ఏడుగురు డెమొక్రాట్లు ఇద్దరు రిపబ్లికన్‌లతో కూడిన వీడియోలను చూపించింది, దీనిలో ట్రంప్ మాజీ సహాయకులు అధ్యక్ష ఎన్నికల్లో విస్తృతంగా మోసం జరిగిందనే వాదనలు అబద్ధమని అప్పటి అధ్యక్షుడి ట్రంప్‌కు పదేపదే చెప్పారని వాంగ్మూలం ఇచ్చారు.

కాగా ఎన్నికల్లో కుట్ర జరిగిందని ట్రంప్‌ చేసిన ఆరోపణలను అమెరికా మాజీ అటార్ని జనరల్‌ బిల్‌ బ్రార్‌ తోసిపుచ్చారు. దీన్ని ట్రంప్‌ కుమార్తె ఇవాంక కూడా అంగీకరించారని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

జనవరి 6, 2021న ట్రంప్ మద్దతుదారుల వీడియోతో కమిటీ తన విచారణను సోమవారం ముగించింది, అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందన్న ట్రంప్‌ వ్యాఖ్యలతో అతని మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌పై దాడికి దిగారని అమెరికా ప్ర‌జాప్ర‌తినిధుల ప్యానెల్ తన విచారణలో తేల్చింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  దాదాపు 75 మిలియన్ల మంది సిట్టింగ్ ప్రెసిడెంట్‌కు  అనుకూలంగా ఓటు వేసారని ట్రంప్ అన్నారు. శాంతిభద్రతల విజేతగా తనను తాను సమర్థించుకున్న ట్రంప్, జనవరి 6న కాపిటల్ అల్లర్లకు దారితీసిన తన చర్యలకు క్షమాపణలు చెప్పలేదు.

ఇదిలా ఉండగా.. 2020 అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓడిన ఆనాటి అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ .. క్యాపిట‌ల్ హిల్‌పై దాడికి ప‌న్నాగం వేసిన‌ట్లు అమెరికా ప్ర‌జాప్ర‌తినిధుల ప్యానెల్ త‌న విచార‌ణ‌లో తెలిపింది. 2021, జ‌న‌వ‌రి ఆరో తేదీన క్యాపిట‌ల్ హిల్‌పై నిర‌స‌న‌కారులు దాడి చేసి విధ్వంసానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. క్యాపిట‌ల్ హిల్ వ‌ద్ద‌కు వేల సంఖ్య‌లో జ‌నాన్ని స‌మీకరించింది ట్రంపే అన్న అభిప్రాయాన్ని ప్యాన‌ల్ త‌న‌ విచార‌ణ‌లో వ్య‌క్తం చేసింది. ఇక క్యాపిట‌ల్‌ హిల్‌పై దాడికి విద్వేష ప్ర‌సంగంతో అభిమానుల్ని ఉసిగొల్పిన‌ట్లు కూడా ప్యాన‌ల్ విచార‌ణ‌లో వెల్ల‌డైంది. క్యాపిట‌ల్ హిల్ దాడికి ఆజ్యం పోసింది ట్రంపే అని క‌మిటీ వైస్ చైర్మెన్ రిప‌బ్లిక‌న్ నేత లిజ్ చెనాయ్ అన్నారు. క్యాపిట‌ల్ హిల్ అల్ల‌ర్లు అమెరికా ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌మాదంలో ప‌డేసిన‌ట్లు డెమోక్రాట్ బెన్నీ థాంప్స‌న్ తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles