24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

తెలంగాణలో ‘మెటా4’ విద్యుత్‌ వాహనాల పరిశ్రమ… 250 కోట్ల పెట్టుబడి… 2500మందికి ఉపాధి!

హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ తన సత్తాను చాటుకుంటోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా-4, స్మార్ట్ గ్రీన్ మొబిలిటీ చొరవతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలో పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఇప్పటికే ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జహీరాబాద్‌లోని జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్‌లో 15 ఎకరాల రాయితీ భూమిని సైతం సంస్థకు అప్పగించింది. 2022-23 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని మేటా-4 యాజమాన్యం తెలిపింది. మెటా-4 ఈ పెట్టుబడులను వాల్ట్రీ ఎనర్జీ ద్వారా పెట్టింది. ద్విచక్ర విద్యుత్ వాహనాల తయారీ కర్మాగార విభాగం నెలకొల్పడానికి మెటా-4 రూ.250 కోట్ల పెట్టుబడి పెడుతుంది.

ఈ ఏడాది చివర్లో ప్రారంభం..
జహీరాబాద్‌లో అత్యాధునిక వోల్ట్‌లీ ఎనర్జీ సాంకేతిక పరిజ్ఞానంతో ద్విచక్ర విద్యుత్‌ వాహనాల పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు మెటా4 గ్రూప్‌ చైర్మన్‌ ముజిమిల్‌ రియాజ్‌ సోమవారం మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. సెమీ రోబోటిక్స్‌, భారీ ఆటోమేషన్‌తో పనిచేసే ఈ పరిశ్రమను ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామన్నారు. మొదటి దశలో ఏటా 40 వేల వాహనాల తయారీ సామర్థ్యంతో ప్రారంభించి, మూడేళ్లలో లక్ష వాహనాల తయారీకి విస్తరిస్తామన్నారు. మెటా4 నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ పరిశ్రమకు జహీరాబాద్‌లో 15 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు.

2500 మందికి ఉపాధి
ఈ కర్మాగారము రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధిని, 2000 మందికి పరోక్ష ఉపాధిని కల్పించడానికి సహాయపడుతుందని మెటా-4 గ్రూప్ సీఈఓ ముజమ్మిల్ రియాజ్ పేర్కొన్నారు. వాల్ట్రీ ఎనర్జీ భారత్‌లో తయారీ ఉత్పత్తుల తదుపరి శ్రేణిని విస్తరించాలని కూడా లక్ష్యంగా చేసుకుందని వాల్ట్రీ ఎనర్జీ డైరెక్టర్ ఆదిత్య రెడ్డి తెలిపారు. తాము తయారు చేయబోయే ఉత్పత్తుల్లో బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఉంటాయన్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles