30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

స్టార్టప్​లను ప్రోత్సహించడంలో తెలంగాణ టాప్… కేంద్రమంత్రి పియూష్ గోయల్!

న్యూఢిల్లీ: దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్‌ పెర్ఫార్మర్స్‌ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ సోమవారం స్టార్టప్‌ స్టేట్‌ ర్యాంకులు విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు జనాభా) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా వాటిని స్టార్టప్‌ మెగాస్టార్స్‌ (బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌), సూపర్‌స్టార్స్‌ (టాప్‌ పెర్ఫార్మర్స్‌), స్టార్స్‌ (ది లీడర్స్‌), రైజింగ్‌ స్టార్స్‌ (యాస్పైరింగ్‌ లీడర్స్‌), సన్‌రైజర్స్‌ (ఎమర్జింగ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్స్‌) పేరుతో అయిదు విభాగాలుగా విభజించారు. ‘‘స్టార్టప్‌ తెలంగాణ పోర్టల్‌ రాష్ట్రంలోని స్టార్టప్స్‌ ఏర్పాటుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తోంది. స్టార్టప్స్‌ వ్యవస్థాపకుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి వారి ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తూ మార్గనిర్దేశం చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం సైన్స్, పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ హైదరాబాద్ (రిచ్) ఇంక్యుబేటర్‌ను ప్రారంభించడంతోపాటు పలు ప్రశంసనీయమైన కార్యక్రమాలను చేపట్టిందని పీయూష్ గోయల్ చెప్పారు.

మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి V-హబ్‌ పేరుతో ప్రత్యేక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. స్టార్టప్స్‌కు నిధులు సమకూర్చడానికి టి-ఫండ్‌ పేరుతో ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయడం, స్టార్టప్స్‌తో పెట్టుబడిదారులను అనుసంధానం చేయడానికి 15కిపైగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టి-ఫండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లకుపైగా కేటాయించింది. ఇప్పటి వరకు 50కి పైగా స్టార్టప్‌లు రూ.కోటి నిధులను దీని ద్వారా అందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమంలో 800 స్టార్టప్స్‌, 150 మందికిపైగా భాగస్వాములయ్యారు.

స్టార్టప్ వ్యవస్థకు  దన్నుగా నిబంధనల వాతావరణాన్ని సులభతరం చేసే బాటలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్‌ విడుదల చేస్తోంది. ఈ ఏడాది 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లో రాష్ట్రాలవారీగా  ర్యాంకులను ప్రకటించింది.  అంతక్రి తం 2020 సెప్టెంబర్‌లో ర్యాంకులను ప్రకటించింది. గుజరాత్‌ టాప్‌ ర్యాంకులో నిలిచింది. ఇప్పుడు కూడా అదే స్థానం నిలబెట్టుకుంది.

వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌.. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు అండగా నిలిచిన రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ర్యాంకులను విడుదల చేశారు.  పోటీ, సహకార సమాఖ్య విధానాల ద్వారా దేశీ విజన్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ర్యాంకింగ్‌ను చేపట్టింది. స్టార్టప్‌ల వృద్ధికి అనుగుణంగా సరళతర నియంత్రణల అమలుతోపాటు వ్యవస్థ పటిష్టతకు మద్దతుగా నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తొలుత 2018లో ర్యాంకింగ్‌ విధానాన్ని ప్రారంభించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles