28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది… ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: మన దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకముందు సైనికదళాధిపతుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు. మన త్రివర్ణ పతాకం దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ప్రతి చోట రెపరెపలాడుతోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త సంకల్పంతో కొత్త దిశలో అడుగులు వేయాలని ప్రధాని అన్నారు.

వారి ముందు తలవంచండి – మోదీ
‘‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. 75 ఏళ్ల ప్రయాణంలో భారత్‌కు అమూల్యమైన సామర్థ్యం ఉందని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని భారత్ నిరూపించుకుంది. ఇన్నేళ్లలో దు:ఖాలతో పాటు విజయాలు కూడా ఉన్నాయని, ప్రకృతి వైపరిత్యాలు, యుద్ధాలు, ఇతర సమస్యలను ఎదుర్కొన్నామని, అయితే భిన్నత్వంలో ఏకత్వం మన మార్గదర్శక శక్తిగా మారిందని అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారైనా, దేశాన్ని నిర్మించిన వారైన – డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ జీ, సర్దార్ పటేల్, ఎస్పీ ముఖర్జీ, ఎల్బీ శాస్త్రి, దీనదయాళ్ ఉపాధ్యాయ, జేపీ నారాయణ్, ఆర్‌ఎం లోహియా, వినోబా భావే, నానాజీ దేశ్‌ముఖ్, సుబ్రమణ్య భారతి – అటువంటి గొప్ప వ్యక్తుల ముందు తలవంచండి’’ అని ప్రధాని అన్నారు.

రాణి లక్ష్మిభాయ్, బేగం హజ్రత్‌ మహాల్‌తో సహా మహిళా యోధులకు నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఐదు ప్రతిజ్ఞలు చేశారు. ‘ రాబోయే సంవత్సరాల్లో మనం ‘పంచప్రాణ్’పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

  • మొదటిది : అభివృద్ధి..భారత్‌ పెద్ద సంకల్పాలు, సంకల్పాలతో ముందుకు సాగడం
  • రెండవది : దాస్యం యొక్క అన్ని జాడలను తుడివేయడం
  • మూడవది : మన వారసత్వం గురించి గర్వపడటం
  • నాల్గవది : ఐక్యత బలం చాటాలన్నారు.
  • ఐదవది : ప్రధాని, ముఖ్యమంత్రులతో కూడిన పౌరుల విధులు నిర్వర్తిచడం

వచ్చే 25 ఏళ్లు దేశాభివృద్ధికి అంకితమివ్వాలని యువతకు పిలుపునిచ్చారు. మొత్తం మానవాళి అభివృద్ధికి కృషిచేస్తామని, అదే భారత్‌ బలమన్నారు. ఐక్యత సాధించేందుకు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని సూచించారు. మహిళల పట్ల గౌరవం భారత వృద్ధికి మూల స్థంబం అని పేర్కొన్నారు. నారీ శక్తి గురించి కొనియాడిన ఆయన.. స్త్రీ ద్వేషాన్ని తుడిచివేస్తామని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. 75 ఏళ్ల తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మేడ్‌ ఇన్‌ ఇండియా క్రింద తయారు చేసిన గన్‌ సెల్యూట్‌ చేశామని అన్నారు.

భద్రత కట్టుదిట్టం..
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. వేడుకలకు హాజరయ్యే ఏడువేల మంది కోసం బహుళ అంచెల భద్రత ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ కవళికలను గుర్తించే కెమెరాలు, వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ‘నో కైట్‌ ఫ్లై జోన్‌’గా ప్రకటించారు. వేడుకలు జరిగే వేదిక వద్దకు ఎలాంటి గాలిపటాలు, బుడగలు, చైనా లాంతర్లు వంటివి రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్‌ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles