26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘సాగు’ పథకాల అధ్యయనం…. హైదరాబాద్‌కు 25 రాష్ట్రాల రైతులు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం గతంలో నష్టాల ఊబిలో కూరుకుపోయింది. అయితే కొత్త రాష్ట్రం సాధించుకున్నాక  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో   తక్కువ కాలంలోనే వ్యవసాయ రంగం లాభదాయకమైన వృత్తిగా అవతరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ  అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.

75 ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణ ప్రణాళికను అమలులోకి తెచ్చిన తెలంగాణ వైపు యావత్ రైతాంగ సమాజం దృష్టి పడింది. తెలంగాణ అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రెండు పంటలకు సమృద్ధిగా సాగునీటి సరఫరా, రైతు బంధు, రైతు కుటుంబాలకు భరోసా కల్పించే రైతు భీమా వంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై భారతీయ రైతు సంఘం ఆసక్తి చూపుతోంది.

రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయం, నీటిపారుదల రంగాల పురోగతిని అధ్యయనం చేసేందుకు, పరిశీలించేందుకు 25 రాష్ర్టాల నుంచి రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్‌ వచ్చారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, కర్ణాటక తదితర 25 రాష్ట్రాల నుంచి 100 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, నీటిపారుదల రంగ అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనను ప్రారంభించారు.

రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధు వంటి  కార్యక్రమాలను విశ్లేషించేందుకే తెలంగాణకు వచ్చామని, తమ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని, ఈ పథకాలను దత్తత తీసుకోవాలని డిమాండ్‌ చేస్తామన్నారు. ఇలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయాభివృద్ధి విధానాలు తమ రాష్ట్రానికి కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు ఉండాలని వారు ఆకాక్షించారు. తెలంగాణ రైతులు లాభసాటి వృత్తిగా వ్యవసాయాన్ని కొనసాగిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు తెలిపారు.

సీఎం కేసీఆర్..  రైతుబంధు సాయంతో ఎకరాకు రూ.10వేలు, రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం పెద్ద విప్లవమని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతు నాయకుడు హిమాన్ష్ అన్నారు. రైతు పోరాటంలో ప్రాణాలు అర్పించి అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినందుకు సీఎంను అభినందించారు. తెలంగాణకే కాదు యావత్ దేశానికే కేసీఆర్ బెస్ట్ ఫ్రెండ్ అని అసోసియేషన్ నేతలు కొనియాడారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles