24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈమేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) కీలక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది, ఇందులో కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అక్టోబర్ 17వ తేదీన ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధిష్ఠానం సిద్ధమవుతోంది.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 24వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. సెప్టెంబర్ 30 వరకూ ఇది కొనసాగుతుంది. దాదాపు అరగంట పాటు సమావేశమైన సీనియర్ నేతలు..ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరి కంటే ఇద్దరు ఈ పోటీలో ఉంటే…అక్టోబర్ 17వ తేదీన ఓటింగ్ కౌంటింగ్ మొదలు పెడతారు. అక్టోబర్ 19న ఫలితాలు విడుదల చేస్తారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జీ23 నేత ఆనంద్ శర్మ, కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, పీ చిదంబరం, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, సీడబ్ల్యూసీ సభ్యులు హరీశ్‌ రావత్‌లు ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసి రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండి పార్టీని ఏకం చేయాలని పునరుద్ఘాటించారు. “షెడ్యూల్ ప్రకటించినందుకు చాలా సంతోషిస్తున్నాను. రాహుల్ గాంధీ మా తదుపరి పార్టీ అధ్యక్షుడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని హరీష్ రావత్ మీడియాతో అన్నారు.

“కాంగ్రెస్ కార్యకర్తలందరితో పాటు, రాహుల్ గాంధీ నాయకత్వం వహించి కాంగ్రెస్ అధ్యక్షుడవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన కాంగ్రెస్ పార్టీని ఏకం చేసి బలోపేతం చేయగలరు’ అని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

సమావేశం అనంతరం ఈ సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఉన్న నాయకుల్లో రాజస్థఆన్ సీఎం అశోక్ గెహ్లాట్ పదవికి సమర్థుడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన మాత్రం రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు. దాంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.

అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీనే ఎన్నుకోవాలని చాలా మంది కార్యకర్తలు నినదించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీడియా విభాగం పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ, “మనలో ప్రతి ఒక్కరికి మన భావాలను వ్యక్తీకరించే హక్కు ఉంది. అలాగే కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉంది అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, దీనికి కారణం “సానుభూతి కాదు”, ఈ క్రింద పేర్కొన్న  కారణాల వల్ల రాహుల్‌ను తాము అధ్యక్షునిగా ఎంచుకుంటున్నామని తెలిపారు.

-సోషల్‌ మీడియాలో రాహుల్ గాంధీకి 12 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. . ‘‘2019లో రాహుల్‌గాంధీ పేరుతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు.. మరే ఇతర ప్రతిపక్ష నేతకు కూడా అన్ని ఓట్లు రాలేదు. కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఓటు బ్యాంకును కాపాడుకోవాలి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్నారు.

మరోవంక వచ్చే నెలలో రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమై…కశ్మీర్‌లో ముగియనుంది. ఈ ఏడాది మేలోఉదయ్‌పూర్‌లోని చింతన్ శివిర్ వద్ద “భారత్ జోడో యాత్ర”కు  సంబంధించిన ప్రకటన చేశారు అధినేత సోనియా గాంధీ. 5 నెలల పాటు సాగనున్న ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో జరగనుంది. మొత్తం 3,500 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ..ఈ పాదయాత్రలు, ర్యాలీలు సహా పబ్లిక్ మీటింగ్స్‌లోనూ పాల్గొననున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles