28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘ఉచితాల’ విషయంలో బీజేపీ ద్వంద్వ నీతి… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మరియు కాషాయ పార్టీ ‘ఉచితాల’ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో ఉచిత ఇళ్లు, విద్య, ఆరోగ్యంపై ప్రజాసంగ్రామ యాత్రలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వాగ్దానాలను కేటీఆర్‌ ప్రస్తావిస్తూ.. గతంలో ఉచితాలు వద్దంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ బండి సంజయ్‌ని, బీజేపీ విధానాలపై తీవ్రమైన కామెంట్లు చేశారు. విశ్వగురు ఉచితాలు వద్దని చెబుతుండగా.. ఆయన శిష్యుడేమో ఫ్రిగా ఇస్తానంటున్నారంటూ బండి సంజయ్‌పై సెటైర్లు వేశారు కేటీఆర్.  దేశం మొత్తానికి ఉచిత గృహాలు, విద్య, ఆరోగ్యంపై పార్లమెంటులో శాసనం చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన  పేపర్ కటింగ్‌ను కేటీఆర్ షేర్ చేశారు.

కేటీఆర్ ట్వీట్ లో ఏముందంటే..

”తెలంగాణా బీజేపీ మూర్ఖత్వం విచిత్రం.. విశ్వ గురు ఉచితాలు వద్దని అంటుంగా.. ఈ జోకర్ ఎంపీ ఉచిత విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు!

ఈ దేశాన్ని పాలిస్తున్నది బీజేపీ కాదా?.. దేశం మొత్తానికి ఉచిత ఇళ్లు, ఎడ్యుకేషన్, వైద్యం పార్లమెంటులో చట్టం చేయకుండా  మిమ్మలని ఎవరు అడ్డుకుంటున్నారు?” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

”తెలంగాణ బీజేపీ ఇస్తున్న వాగ్దానాలకు అనుగుణంగా పార్లమెంట్‌లో చట్టాలు తీసుకురావాలని నేను ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వడం కోసం పార్లమెంటులో మీరు బిల్లు పెట్టండి మేము ఓటు వేస్తాము.” అని కేటీఆర్ తన మరో ట్వీట్ లో చెప్పారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ పై నెటిజన్ల నుంచి పెద్ద స్పందన వస్తోంది. బీజేపీ తీరుపై కొందరు తీవ్రంగా విరుచుకపడ్డారు.  ప్రధాని నరేంద్ర మోడీపై, బండి సంజయ్ కి కౌంటర్లు వేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles