24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘నోబెల్ శాంతి బహుమతి’ రేసులో ‘ఆల్ట్‌న్యూస్‌’ ఫౌండర్స్’… జుబేర్‌‌, ప్రతీక్‌ సిన్హా!

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ‘ఆల్ట్‌న్యూస్‌’ వ్యవస్థాపకులు మహ్మద్‌ జుబేర్‌‌, ప్రతీక్‌ సిన్హా నోబెల్‌ శాంతి బహుమతి రేసులో నిలిచారు. మానవాళికి ప్రయోజనం కోసం పనిచేసేవారికి ఈ శాంతి బహుమతిని ఇస్తారు. నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఈ ఇద్దరు జర్నలిస్టులు ఫేవరెట్ గా ఉన్నట్లు టైమ్ మ్యాగజీన్ కథనం ప్రచురించడం గమనార్హం. అల్ట్ న్యూస్ సైట్ తరఫున ఫ్యాక్ట్స్ చెకర్స్‌గా వీరు పని చేస్తున్నారు.

ప్రజాభిప్రాయం ప్రకారం.. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, బుక్కర్ల నుండి వచ్చిన అంచనాలు, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో (PRIO) ద్వారా ఆధారంగా రేసులో సిన్హా, జుబేర్ ప్రముఖంగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు శాంతి బహుమతి కమిటీ ఫేవరెట్ గానూ ఈ ఇద్దరూ ఉన్నట్లు టైమ్ కథనంలో పేర్కొంది. నోబెల్ కమిటీ అధికారికంగా ఈ వివరాలు వెల్లడించనప్పటికీ, రాయటర్స్ నిర్వహించిన సర్వేలో ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకులతో పాటు పలువురు నోబెల్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ముస్లింలపై వివక్ష ఆరోపణల నేపథ్యంలో  ఇద్దరూ “భారతదేశంలో తప్పుడు సమాచారం కట్టడికి కనికరం లేకుండా పోరాడుతున్నారు”. అంతేకాదు “సోషల్ మీడియాలో వైరల్‌గా మారే పుకార్లు, నకిలీ వార్తలను, ద్వేషపూరిత ప్రసంగాలను నిలిపేసారు” అని ప్రచురణ పేర్కొంది. భారత్‌లో ఫేక్‌న్యూస్‌ కట్టడికి ఆల్ట్‌ న్యూస్‌ పనిచేస్తోంది. సోషల్‌మీడియాలో ప్రచారంలో ఉన్న నకిలీ సమాచారాన్ని విశ్లేషించి వాస్తవాలను తన వెబ్‌సైట్‌లో ఉంచుతుంది.

ఇదిలా ఉంటే.. జూన్ నెలలో 2018కి సంబంధించిన ట్వీట్ విషయంలో అరెస్టైన జుబేర్.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఉండడం గమనార్హం. నెల తర్వాత అతను జైలు నుంచి సుప్రీం కోర్టు బెయిల్ ద్వారా విడుదల అయ్యాడు. ఇక.. జుబేర్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. “భారతదేశంలో పత్రికా స్వేచ్చ అధ్వాన్నంగా ఉంది, జర్నలిస్ట్లకు ఇక్కడి ప్రభుత్వం ప్రతికూల, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది” అంటూ అమెరికాలోని జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం.

నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం.. 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు. ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకుగానీ అసలు తెలియజేయదు. అయితే.. కొన్ని మీడియా సంస్థలు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి.

భారత్‌కు చెందిన ‘ఆల్ట్‌న్యూస్‌’ వ్యవస్థాపకులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్ విమర్శకుడు అలె ననెల్నీ, బెలారస్ ప్రతిపక్ష నేత స్వీయాత్తానా, ప్రముఖ బాడ్ కాస్టర్ డేవిడ్ అటనోరఫ్ తదితరులు ఉండొచ్చని అంచనా చేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 7వ తేదీన ప్రకటిస్తారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles