24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్​కు నగర మేయర్ శంకుస్థాపన!

హైదరాబాద్: బంజారాహిల్స్ ఎన్.బీ.టీ నగర్‌లో రూ.6 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ‘ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్’కు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు అంతస్థుల్లో నిర్మిస్తున్న కాంప్లెక్స్ పూర్తయ్యేలా స్థానికులు సహకరించాలని కోరారు. గ్రౌండ్​ఫ్లోర్​లో ఓపెన్​ పార్కింగ్​తో పాటు కమర్షియల్​గా ఉపయోగపడేలా షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. షాపుల నుంచి వచ్చే అద్దెను కాంప్లెక్స్​నిర్వహణకు ఖర్చు చేస్తామని, మొత్తం 8 ఆటలకు ఉపయోగపడేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. పూర్తయ్యాక సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు.

నగర మేయర్‌ ఇంకా మాట్లాడుతూ.. లక్ష చదరపు అడుగుల ప్రభుత్వ భూమిని ఆదా చేసి ప్రజలకు వినియోగించడమే కాకుండా ఎంతో మంది యువ క్రీడాకారుల కలను ఈ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నెరవేరుస్తుందన్నారు. బంజారాహిల్స్‌లో దాదాపు 18,000 మంది మురికివాడల్లో నివసిస్తున్నారు, ఈ ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల, సుమారు తొమ్మిది ప్రైవేట్ పాఠశాలల్లో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆమె చెప్పారు.

ఈ కాంప్లెక్స్ ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇందులో క్రికెట్ బాక్స్, కబడ్డీ కోర్ట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్ట్‌లు, జిమ్‌లు, యోగా కోసం ప్రత్యేక స్థలంతో పాటు లాబీలు, లిఫ్టులు,  చిన్నగది, కూర్చునే ప్రదేశాలు, దుస్తులు మార్చుకునేందుకు పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా  గదులు ఉన్నాయి. ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తులో పార్కింగ్ సౌకర్యం మరియు దుకాణాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీతో పాటు ఈఈ  విజయకుమార్, ఏఎంహెచ్ఓ భార్గవ్ నారాయణ పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles