హైదరాబాద్: బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ (BIRED) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ యువకుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థ స్వయం ఉపాధి కోసం సాంకేతిక కోర్సులలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను అందిస్తుంది. 37 రోజుల ఉచిత వృత్తి శిక్షణా కార్యక్రమాన్ని బైర్డ్ (BIRED) నిర్వహిస్తోంది. ఈ కోర్సులను నవంబర్ 21 నుంచి డిసెంబర్ 27 వరకు అందించనున్నారు. రాజేంద్ర నగర్లోని ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో అందించే ఈ శిక్షణకు 19-30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
శిక్షణా కోర్సులలో మొబైల్ సర్వీసింగ్ (SSC అంతకంటే ఎక్కువ), రిఫ్రిజిరేటర్ & AC రిపేర్ (ఇంటర్,అంతకంటే ఎక్కువ) ఎలక్ట్రీషియన్, పంప్-సెట్-రిపేరింగ్ (SSC ఫెయిల్ , అంతకంటే ఎక్కువ) ఉన్నాయి. శిక్షణ సమయంలో బోర్డింగ్, ప్రయోగశాలతో సహా అన్ని సౌకర్యాలు ఉచితంగా అందిస్తారు.
దరఖాస్తులను అక్టోబర్ 26 నుండి నవంబర్ 18 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www.bired.org వెబ్సైట్ను సందర్శించండి.