24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డులు!

హైదరాబాద్:  తెలంగాణ చేనేత కార్మికులు రాసిన లక్షలాది పోస్ట్‌కార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం పోస్ట్ ద్వారా పంపించారు. చేనేత ఉత్పత్తులు, వాటి ముడిసరుకులపై విధించిన ఐదు శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని  పోస్ట్‌కార్డుల ద్వారా ప్రధానిని కోరాయి. చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  నిజాం కాలేజ్ గ్రౌండ్ నుంచి అబిడ్స్ పోస్టాఫీస్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు.

నిజాం కళాశాల మైదానంలో జరిగిన   చేనేత కార్మికులు, చేనేత మద్దతుదారులు ర్యాలీలో  ఎల్. రమణ మాట్లాడుతూ జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్,మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన సహా నేత కార్మికుల కోసం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనేక చర్యలు తీసుకున్నారన్నారు. నేతన్నకు బీమా, చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేత కార్మికుల రుణమాఫీ వంటివి ఇందులో ఉన్నాయి.

అక్టోబరు 22న జీఎస్టీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించిన రామారావు ఇచ్చిన పిలుపు మేరకు నేత కార్మికులు పోస్ట్‌కార్డులు రాశారు. ఈ ప్రచారానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల నుంచి విశేష స్పందన లభించింది.

కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు ఎల్‌.రమణ, తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌, తెలంగాణ పవర్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, రాజ్యసభ మాజీ ఎంపీ ఆనంద భాస్కర్‌ రాపోలు, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి పాల్గొన్నారు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles