31 C
Hyderabad
Tuesday, October 1, 2024

అవయవ మార్పిడికి ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధం… మంత్రి హరీష్ రావు!

హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ దానాల మార్పిడిని మరింతగా ఎక్కువగా చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పలు చర్యలను ప్రారంభించింది, దీనివల్ల పేద రోగుల నిరీక్షణ సమయాన్ని తగ్గించవచ్చు.  ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పిడి శస్త్రచికిత్సల వాటా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి.

ఆదేసమయంలో  గాంధీ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) వంటి ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో మరిన్ని అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి రెండు ప్రధాన అడ్డంకులున్నాయి. అవి మౌలిక సదుపాయాల లోపాలు, ట్రామాకేర్ పేషంట్ల బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో జరపక పోవడం.

రోజువారీ ప్రాతిపదికన, తెలంగాణలోని జిల్లా, బోధనాసుపత్రులు పెద్ద సంఖ్యలో ట్రామా కేసులను స్వీకరిస్తాయి, వీటిలో ఎక్కువ మంది కోలుకోలేక మరణిస్తున్నారు. బోధనాసుపత్రులు అటువంటి రోగులను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించనందున, మరణించినవారి  అవయవాలు ప్రాణ దానానికి అవకాశం లేకుండా పోతున్నాయి.

ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు అక్టోబర్‌లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించాలని ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్‌పై అవసరమైన మార్గదర్శకాలు,  ప్రోటోకాల్‌లను రూపొందించడానికి సీనియర్ ఆరోగ్య అధికారులతో కూడిన కమిటీని కూడా మంత్రి ఏర్పాటు చేశారు.

మౌలిక సదుపాయాల కొరతను పరిష్కరించడానికి, గాంధీ ఆసుపత్రిలో దాదాపు ఎనిమిది అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లతో కూడిన కేంద్రీకృత రాష్ట్ర అవయవ మార్పిడి కేంద్రం రాబోయే కొద్ది నెలల్లో రూ. 30 కోట్లతో రాబోతోంది.

అవయవ మార్పిడిపై తన ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)పై కూడా దృష్టి సారించింది. ఫలితంగా, అక్టోబర్ నెలలో, నిమ్స్ మార్పిడి సర్జన్లు గుండె, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన మూడు సంక్లిష్ట అవయవ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు.

ఉస్మానియ జనరల్ ఆస్పత్రి బ్రెయిన్-డెడ్ కాడవర్ అవయవ మార్పిడిని చేపట్టనప్పటికీ, గత దశాబ్ద కాలంగా మూత్రపిండ మార్పిడిని నిర్వహించడంలో ముందంజలో ఉంది. మొత్తంమీద ఉస్మానియా 700 జీవన సంబంధిత మూత్రపిండ మార్పిడిలను నిర్వహించింది. వీటిలో గత దశాబ్దంలో 300 మరియు 400 కిడ్నీ మార్పిడిలు జరిగాయి.

“ప్రభుత్వ ఆసుపత్రులలో జీవన సంబంధిత మూత్రపిండ మార్పిడిని నిర్వహించడంలో ఉస్మానియ జనరల్ ఆస్పత్రి అగ్రగామిగా ఉంది. ఇప్పటివరకు దాదాపు 700 జీవన సంబంధిత మూత్రపిండ మార్పిడిని నిర్వహించింది. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్‌ను చేపట్టేందుకు ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.  ఈ ప్రకియ పూర్తయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో  అవయవ మార్పిడికి పెద్దపీట వేస్తుందని” ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ నెఫ్రాలజీ డాక్టర్ మనీషా సహాయ్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles