26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘సింగరేణి’పై కేంద్రం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది… ఆరోపించిన టీఆర్ఎస్!

హైదరాబాద్: రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్స్‌ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) బుధవారం ఆరోపించింది. ఎస్‌సిసిఎల్‌ను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కేంద్రం చెబుతూనే..  సింగరేణి పరిధిలోని 4 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నాం’ అని బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం లోక్‌సభలో ప్రకటించడంపై టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు.  సింగరేణికి బొగ్గు బ్లాకులను కేటాయించకుండా ఆ కంపెనీని నష్టాల్లోకి నెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని  ఎంపీలు ఆరోపించారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన సందర్భంగా… సింగరేణిని ప్రైవేటీకరించబోమని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరినప్పటికీ…  కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించడం లేదని టీఆర్‌ఎస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రధాని ఇచ్చిన హామీకి భిన్నంగా నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు నిన్న లోక్‌సభలో కేంద్రప్రభుత్వం అంగీకరించిందని ఆయన వాపోయారు.

బుధవారం ఢిల్లీలో మిగతా టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడిన నామా నాగేశ్వరరావు..  తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి సింగరేణి సంస్థకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త బొగ్గు గనులు కేటాయించకుండా సింగరేణి ఎలా బతుకుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను, అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతోందని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎస్‌సిసిఎల్‌లో కేంద్రం తన 49 శాతం వాటాను విక్రయించడానికి ఆసక్తిగా ఉంటే, తెలంగాణ ప్రభుత్వం దానిని కొనుగోలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రం పట్ల వివక్ష, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, నిధులపై కోత, పెండింగ్‌ నిధుల విడుదలలో జాప్యం వంటి ప్రజాసమస్యలను టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌లో లేవనెత్తుతుందని తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles