23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో ‘బోలో ఇంగ్లీషు’ యాప్… ట్రెస్మా!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ బోలో ఇంగ్లీష్’ యాప్ ట్రయల్ రన్‌ విజయవంతమైంది. దీంతో ‘ప్రాజెక్ట్ బోలో ఇంగ్లీష్‘ సభ్యులతో కలిసి తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TRSMA) ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠ్యాంశాల్లో స్పోకెన్ ఇంగ్లీషును ఒక సబ్జెక్ట్‌గా చేర్చాలని యోచిస్తోంది.

ప్రాజెక్ట్ బోలో ఇంగ్లీష్ అనేది విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీషు నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఉచిత అభ్యాస యాప్. ఈ అప్లికేషన్ సహాయంతో విద్యార్థులు వారి పదజాలం, ఉచ్చారణ, వ్యాకరణాన్ని సులువుగా మెరుగుపరచుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3 – 10వ తరగతి విద్యార్థులకు ఈ ‘యాప్‘ను పరిచయం చేయాలని విద్యాశాఖతో పాటు టీఆర్‌ఎస్‌ఎంఏ యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పరిమితం. దీంతో వారికి సాయం చేయడానికి టీచర్లతో కలిసి తమ వంతు కృషి చేస్తారు. పిల్లలకు సహాయం చేయడానికి తల్లిదండ్రులు కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల, 2020లో  ‘బోలో ఇంగ్లీష్ యాప్‘ను పైలట్ ప్రాజెక్ట్‌గా, వర్చువల్ పద్ధతిలో కొన్ని బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రారంభించామని ” ట్రెస్మా (TRSMA) అధ్యక్షుడు వై శేఖర్ రావు అన్నారు.

స్పోకెన్ ఇంగ్లిష్‌పై తక్కువ ఫోకస్ కారణంగా వ్యాకరణం, పిక్టోరియల్ డిక్షనరీ వంటి దాదాపు 100 ఆంగ్ల పాఠాలు ఒక ప్రొఫెషనల్ టీచర్‌చే రూపొందించారు. ఈ చిన్న వీడియో క్లిప్పింగ్‌లను చూడటం ద్వారా కొత్త పదాలు నేర్చుకోవడానికి, వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో విద్యార్థులకు సహాయపడతాయి. ఇప్పటివరకు, ఈ ప్రాజెక్ట్ 11 రాష్ట్రాలలో చిన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2 లక్షల మంది విద్యార్థులకు 10,000 మంది ఉపాధ్యాయులలో ఆంగ్ల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా, పిల్లలు స్పోకెన్ ఇంగ్లీషు పాఠ్యాంశాలను ఉచితంగా పొందుతారు.

పాఠశాలల్లో పిల్లలకు సరైన స్పోకెన్ ఇంగ్లీషు నేర్పడానికి తక్కువ వనరులు అందుబాటులో ఉన్నందున, 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లల్లో స్పోకెన్ ఇంగ్లీషును మెరుగుపరచడానికి ‘ప్రాజెక్ట్ బోలో ఇంగ్లీషు’ యాప్ ప్రవేశపెట్టారని,  ఈ ప్రాజెక్టుకు  మంచి స్పందన కూడా లభించిందని” ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్  శివరామకృష్ణ తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles