24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

అదానీ కంపెనీలపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించే దమ్ము ఉందా?… కేటీఆర్ సవాల్!

హైదరాబాద్: అదానీ ఎంటర్‌ప్రైజ్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తే దమ్ము… ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఆదాయపు పన్ను శాఖ (ఐటి), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఉందా అని ఐటీ మంత్రి కేటీఆర్  సవాల్ విసిరారు.

అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబసభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్టాక్‌ మానిప్యులేషన్‌, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడ్డట్టు ప్రముఖ ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రిసెర్చ్‌ సంస్థ ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ బుధవారం సంచలన వార్తను ప్రచురించింది. ఈ నివేదిక ఇప్పుడు దుమారం రేపుతోంది.

ఈ పరిశోధనాత్మక పత్రం వెలువడిన కొన్ని గంటలకే మంత్రి కేటీఆర్ కేంద్రానికి సవాల్ విసిరారు. అదానీ కంపెనీల అక్రమాలపై దర్యాప్తు చేసే దమ్ము ఈడీ, సీబీఐ, ఐటీ, సెబీకి ఉందా? ఈ వార్తను ఏ జాతీయ మీడియా కూడా ప్రసారం చేయదని కచ్చితంగా చెప్పగలను. చర్చా కార్యక్రమాలనూ ప్రధాన స్రవంతి మీడియా నిర్వహించదు. సోషల్‌మీడియా వేదికల నుంచి ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ నివేదికను తొలగించేలా ఎన్‌పీఏ గవర్నమెంట్‌ ఒత్తిళ్లు కూడా తీసుకురావచ్చని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. హై దమ్ ప్రోబ్ కర్నే కా అని నిలదీశారు. హిండెన్‌బర్గ్ ట్వీట్ ను ఆయన రీట్వీట్ చేశారు.

ప్రముఖ ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రిసెర్చ్‌ సంస్థ ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ ‘అదానీ గ్రూప్: హౌ ది వరల్డ్స్ 3వ రిచెస్ట్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ది లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పోరేట్ హిస్టరీ’ అనే శీర్షికతో ఒక పరిశోధనాత్మక పత్రాన్ని ప్రచురించింది. నివేదిక ప్రకారం.. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్‌ అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 120 బిలియన్‌ డాలర్లు (రూ. 9.7 లక్షల కోట్లు). మూడేండ్ల కిందట ఇది 20 బిలియన్‌ డాలర్లే (రూ. 1.6 లక్షల కోట్లు). గత మూడేండ్లలో తన గ్రూప్‌నకు చెందిన 7 ప్రధాన లిస్టెడ్‌ కంపెనీల ముఖ విలువను ఎక్కువ చేసి, షేర్ల విలువను కృత్రిమంగా పెంచి ఆయన మోసానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయా కంపెనీల షేర్‌ విలువ సగటున 819 శాతం పెరిగింది. దీంతో మూడేండ్లలోనే ఆయన సంపద 100 బిలియన్‌ డాలర్లకు పైగా (రూ. 8.1 లక్షల కోట్లు) పెరిగింది.

అప్పుల కోసం అదానీ గ్రూప్‌ ఏయే మోసాలకు పాల్పడింది.. షేర్ల ధరలను కృత్రిమంగా ఎలా పెంచింది.. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ మోసాల కోసం ఏయే అడ్డదారులు తొక్కిందో రెండేండ్లపాటు సమగ్ర దర్యాప్తు జరిపి ఈ నివేదికను రుజువులతో సహా ప్రచురించింది. కార్పొరేట్‌ ప్రపంచ చరిత్రలో దీన్నో అతిపెద్ద కుట్రగా అభివర్ణించింది. ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ నివేదికను రాయిటర్స్‌, బ్లూమ్‌బర్గ్‌, ఫోర్బ్స్‌, క్వార్ట్‌ వంటి అంతర్జాతీయ న్యూస్‌ వెబ్‌సైట్లు ప్రధానంగా ప్రచురించాయి.

అదానీ గ్రూప్‌ స్టాక్‌ అవకతవకలకు పాల్పడిందన్న వార్తల మధ్య బుధవారం అటు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌, ఇటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 773.69 పాయింట్లు లేదా 1.27 శాతం పతనమై 60,205.06 వద్ద ముగిసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీల షేర్లన్నీ కూడా నష్టాలకే పరిమితం అయ్యాయి.

ఏడు అదానీ గ్రూప్ ఈక్విటీల మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం 46,086 కోట్లు పడిపోయింది. బుధవారం అదానీ టోటల్ గ్యాస్ రూ.12,366 కోట్లు నష్టపోగా, అదానీ పోర్ట్స్ రూ.8,342 కోట్లు, అదానీ ట్రాన్స్ మిషన్ రూ.8,039 కోట్లు నష్టపోయాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles