24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

వచ్చే ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి… సింగరేణి ఛైర్మన్ ఎన్. శ్రీధర్!

హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

సింగరేణి భవన్‌లో గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ..  సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం రూ.26 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో  రూ.34,000 కోట్లు టర్నోవర్ సాధించే దిశగా పయనిస్తోందన్నారు.

ఆత్మనిర్బార్ భారత్‌లో భాగంగా రానున్న మూడేళ్లలో విదేశీ బొగ్గు దిగుమతులను నిలిపివేయాలని కేంద్రం యోచిస్తోందని, కోల్ ఇండియా, సింగరేణి వంటి ప్రభుత్వరంగ సంస్థలకు 1200 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. దేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్ల బొగ్గు డిమాండ్‌ను తీర్చేందుకు సింగరేణి వచ్చే ఐదేళ్లలో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనుందని సింగరేణి ఛైర్మన్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles