24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

యూఎస్‌లో భారత ఐటీ నిపుణులపై మాంద్యం పిడుగు… మనోళ్ల విదేశీ విద్యపై నీలి నీడలు!

హైదరాబాద్: అమెరికాలో భారత ఐటీ నిపుణులపై మాంద్యం పిడుగు పడింది. దీంతో మన విద్యార్థుల విదేశీ విద్యపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. యుఎస్‌లోని అనేక కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులను ఆశ్రయిస్తున్నాయని, త్వరలో యూకేలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు అనే భయాలు ముసురుకుంటున్నాయి. మరోవంక జనవరి 28న… రేపు హైదరాబాద్‌లో జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో 45కి పైగా అంతర్జాతీయ యూనివర్శిటీలు పాల్గొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో  గ్లోబల్ ఎడ్యుకేషన్, అడ్మిషన్ ఫెయిర్లకు హాజరవ్వాలా లేదా అని  తల్లిదండ్రులు, విద్యార్థులు మదనపడుతున్నారు.

రేపు జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో విద్యార్థులు.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో  విదేశీ విద్య  కోసం వెళ్లే విద్యార్థులకు ఇక్కడి  ఏజెన్సీలు స్కాలర్‌షిప్‌ల గురించి సమాచారాన్ని అందిస్తాయి. ప్రాసెసింగ్ ఫీజులను మినహాయించడంలో విద్యార్థులకు GECF సహాయం చేస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉచిత ఆన్‌లైన్ IELTS కోచింగ్; SOP ఎడిటింగ్ ఛార్జీల మినహాయింపు; ELQ స్కాలర్‌షిప్ (తెలంగాణలోని GECF సభ్య సంస్థ నుండి గ్రాడ్యుయేషన్‌కు లోబడి); బ్యాంకు రుణాలను ప్రాసెస్ చేయడానికి ఉచిత మద్దతు సేవ; ఉచిత స్టూడెంట్ వీసా సపోర్ట్ సర్వీసెస్ వంటి విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పులకిత్ గోయల్ మాట్లాడుతూ, “ప్రస్తుతం, UKలో తొలగింపులు పూర్తి స్థాయిలో జరగటం లేదు.. కానీ త్వరలో తొలగింపులు ఉంటాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానన్నారు. ఆర్థిక మాంద్యం ఇక్కడి వ్యాపారాలపై ప్రభావం చూపుటం ఖాయమని అన్నారు. ” వేరే ఉద్యోగాన్ని చూసుకోవడం లేదా ఇతర రంగాలకు మారడం తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయాలు కనిపించడం లేదు,” అని అతను చెప్పాడు.

యూఎస్ఏలో ఐటీ ఉద్యోగాన్ని కోల్సోయిన సింధూరి మాట్లాడుతూ… తనకు H1B వంటి వీసాలో ఉందని, అయితే ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినందున 60 రోజుల్లో కొత్త ఉద్యోగం దొరక్కపోతే  దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ఆమె వాపోయారు.

మరో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ సోనమ్ కపూర్ మాట్లాడుతూ…  ఉద్యోగాల తొలగింపుల కారణంగా భారతీయులు ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఈ పరిణామాలు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి,  పని చేయడానికి  వెళ్లే విద్యార్థుల్లో భయాన్ని కలిగిస్తున్నాయని కంప్యూటర్ సైన్స్‌లో బిఎస్సీ పూర్తి చేసి, యూఎస్ వెళ్లాలనుకుంటున్న  హైదరాబాద్‌కు చెందిన నందితా రెడ్డి చెప్పారు. సాధారణ పరిస్థితుల్లో యూఎస్ఏలో మాస్టర్స్‌ను చదివేందుకు స్కాలర్‌షిప్‌తో వెళ్లవచ్చని ఆమె చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ ప్రతిపాదనగా కష్టంగా కనిపిస్తోంది. అక్కడి క్యాంపస్‌లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వాల నుండి స్కాలర్‌షిప్ నిధులు తగ్గుతున్నాయని ఆమె విచారణలో వెల్లడైంది.

గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్స్ ఫోరమ్ (GECF) కార్యదర్శి లక్ష్మీ నారాయణన్ మాట్లాడుతూ… “ఈ ఉద్యోగ తొలగింపు సంబంధిత భయాలు చాలావరకు CSE, IT నుండి వచ్చిన వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి” అని మిగతా రంగాల వారికి ఎలాంటి ఇబ్బందిలేదు అని ఆయన విద్యార్థులన  భయాలను పోగొట్టేందుకు ప్రయత్నించారు.  సైబర్ సెక్యూరిటీ రంగంలో మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ కాలేదని ఆయన అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles