24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఈ ఎండ కాలం… హైదరాబాద్‌లో భానుడి భగభగ!

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అప్పుడే వేసవి కాలం ప్రారంభమవుతుందన్న సంకేతాలు కనబడుతున్నాయి.  వచ్చే వారం పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు  అంచనా వేస్తున్నారు. ఈ వేసవి కాలంలో విపరీతమైన వడగాల్పులు, బలహీనమైన రుతుపవనాలతో కూడిన ఎల్ నినో వాతావరణ నమూనా ఏర్పడే అవకాశం ఉందని తాజా  వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.

“ఫిబ్రవరి 11 నుండి, నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి. తద్వారా వేసవి కాలం ప్రారంభమౌతుంది. అయితే ఈ నెల చివరి వారం వరకు రాత్రిపూట,  తెల్లవారుజాము చల్లగా ఉంటుంది” అని ట్విట్టర్‌లో తెలంగాణ వెదర్‌మ్యాన్ తరణి బాలాజీ చెప్పారు.

గత తొమ్మిదేళ్లలో, వార్షిక గరిష్ట ఉష్ణోగ్రతలు 2016లో అత్యధికంగా, 2021లో అత్యల్పంగా నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) నివేదిక ప్రకారం, ప్రస్తుత లా నినా పరిస్థితుల కారణంగా గత మూడేళ్లలో ఉష్ణోగ్రత పోకడలు కొద్దిగా తగ్గాయి.

ఎల్ నినో వాతావరణం, వాతావరణ నమూనాలపై ప్రభావం చూపుతుంది. ఇది భారతదేశంలో కరువు లేదా బలహీన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటుంది. మరోవైపు, లా నినా తీవ్రమైన రుతుపవనాలు, చల్లని శీతాకాలాలతో ముడిపడి ఉంది.

ఈ సంవత్సరం, ఎల్ నినో సంఘటన కారణంగా వేసవి తీవ్రంగా ఉంటుందని బాలాజీ అంచనా వేస్తున్నారు. “వేసవి తుఫానుల ట్రాక్ వేడి తరంగాలు, రుతుపవనాలకు ముందు ఉరుములతో కూడిన తుఫానుల తీవ్రతను నిర్ణయిస్తుంది, దానిని మనం ఇప్పుడు చెప్పలేము. ప్రస్తుతానికి గత కొన్ని సంవత్సరాల మాదిరిగా కాకుండా, కొద్దిగా ఉష్టోగ్రతలు పెరగొచ్చని ఆయన అన్నారు.

ఈవేసవిలో హైదరాబాద్‌లోని  ఉప్పల్, కాప్రా, కుతుబుల్లాపూర్, సెరిలింగంపల్లి, ఖైరతాబాద్, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, సైదాబాద్‌ ప్రాంతాల్లో  సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు  45 ° సెల్సియస్‌కి మించి నమోదవుతాయని ప్రాంతీయ వాతావరణ ఉపకేంద్రం అధికారులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles