24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గ్లోబల్ సీడ్ హబ్‌గా తెలంగాణ… వాషింగ్టన్ ‘ఇస్టా‘ భేటీలో గుర్తింపు!

హైదరాబాద్ : సీడ్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన తెలంగాణను ‘గ్లోబల్‌ సీడ్‌ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెస్టింగ్‌ అసోసియేషన్‌ (ISTA) అధ్యక్షుడు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్‌ కేశవులు తెలిపారు.

ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ISTA) 2023 సంవత్సరానికి గాను గవర్నింగ్ బోర్డు సమావేశం యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్‌డిఎ), వాషింగ్టన్ డిసిలో ఫిబ్రవరి 13 నుండి 18 వరకు జరిగింది.

ఇస్టా (ISTA) ప్రెసిడెంట్ హోదాలో డాక్టర్ కేశవులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ కేశవులు మాట్లాడుతూ…. భారతీయ విత్తన పరిశ్రమ స్థితిగతులు వివరించారు. తెలంగాణను గ్లోబల్ సీడ్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీడ్ బౌల్ కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు-స్నేహపూర్వక విధానాల కారణంగా ఆసియా ప్రాంతంలో తెలంగాణ విత్తన ఎగుమతి కేంద్రంగా ఎదుగుతోందని, ప్రాంతీయ సామరస్యంతో కూడిన విత్తన ప్రమాణాలు, ఫైటోశానిటరీ అవసరాలు, వాణిజ్య నిబంధనలు భారతదేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన అన్నారు. అలాగే భవిష్యత్తులో విత్తన ఎగుమతులను పెంచడానికి తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.

మయన్మార్, కంబోడియా, బంగ్లాదేశ్, లావోస్, వియత్నాంతో సహా మెకాంగ్ ప్రాంత దేశాలలో ఆహార ఉత్పత్తికి రైతులు మంచి నాణ్యమైన విత్తనాలను పొందడంలో ప్రధానంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మెకాంగ్ ప్రాంతంలో విత్తన రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సమావేశంలో నిపుణులు నొక్కి చెప్పారు. మెకాంగ్ ప్రాంత దేశాలకు విత్తనాలను ఎగుమతి చేయడంలో భారతదేశం… ముఖ్యంగా తెలంగాణ విత్తన పరిశ్రమ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ విషయంలో ప్రభుత్వాల సహకారం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది అంటే 2024లో ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెస్టింగ్‌ అసోసియేషన్‌ (ISTA)100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలను యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles