23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు…వర్షాలు కురిసే అవకాశం!

అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోకి షెడ్యూల్ కంటే మూడు రోజుల ముందుగానే ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వీటి ప్రభావంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు.

నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనం.. వర్షపాతం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలకు ఎండ వేడి, ఉక్కపోతనుంచి ఉపశమనం కలిగించింది. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, భారీ వర్షాల సమయంలో ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles