24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2022-23

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2022-23 ముఖ్యాంశాలు:

వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు (11-03-2022)

 

వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కురసాల కన్నబాబు
మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు
సహకార శాఖకు రూ.248.45 కోట్లు
ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు
ఉద్యానశాఖకు రూ.554 కోట్లు
పట్టు పరిశ్రమకు రూ. 98.99 కోట్లు
ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు
వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు
వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.122.50 కోట్లు
పశు సంవర్ధక శాఖకు రూ.1027.82 కోట్లు
ఏపీ వ్యవసాయ బడ్జెట్‌
మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ.337.23 కోట్లు
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు
వైఎస్సార్ జలకళకు రూ. 50 కోట్లు
నీటి పారుదల రంగానికి రూ. 11450.94కోట్లు

వివిధ రంగాలకు కేటాయింపులు…

@ వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
@ వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం రూ. 18 వేల కోట్లు
@ ఎస్సీ సబ్ ప్లాన్  రూ. 18,518 కోట్లు
@ ఎస్టీ సబ్ ప్లాన్  రూ. 6,145 కోట్లు
@ బీసీ సబ్ ప్లాన్  రూ. 29,143 కోట్లు
@ బీసీ సంక్షేమం రూ. 20,962 కోట్లు
@ మైనార్టీ యాక్షన్ ప్లాన్  రూ. 3,532 కోట్లు
@ ఈబీసీల సంక్షేమం రూ 6,639 కోట్లు
@ సోషల్ వెల్ఫేర్  12,728 కోట్లు
@ఈడబ్ల్యూఎస్  రూ. 10,201 కోట్లు

@ వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.

@ వైద్య శాఖ 15,384 కోట్లు

@ పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.

@ బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు

@ రోడ్లు, భవనాల శాఖ రూ. 8,581 కోట్లు

@ పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.

@ ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.

@ విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.

@ సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.

@ ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.

@ సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.

@ ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు

@ జీఏడీ: రూ. 998.55 కోట్లు.

@ సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు

@ మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు

@ క్రీడల శాఖ రూ. 290 కోట్లు

@ పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు

@ హోంశాఖ 7,586 కోట్లు

@ 2022-23 వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు
@ రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు,
@ మూల ధన వ్యయం రూ. 47, 996 కోట్లు,
@ రెవెన్యూ లోటు రూ. 17, 036 కోట్లు,
@ ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లు,
@ జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతం

అమరావతి: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు చేయడం.. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. కరోనాలాంటి మహమ్మారిని ఎదుర్కొంటూ.. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిందని మంత్రి బుగ్గన గుర్తు చేశారు.

అమరావతి: 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరికాసేపట్లో అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తరువాత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రవేశపెట్టనున్నారు. తరువాత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పుల రాజు ప్రవేశపెడతారు.

ఇందులో వ్యవసాయం, వైద్యారోగ్య, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో నియోజకవర్గ నిధి రూపంలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించనున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles