Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సెప్టెంబర్ 1న ముగియనున్న ‘ఓటరు అధికార్ యాత్ర’…పాట్నాలో భారీ ఊరేగింపు!

పాట్నా: బీహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటరు అధికార్ యాత్ర’ సెప్టెంబర్ 1న రాష్ట్ర రాజధానిలో “భారీ ఊరేగింపు”తో ముగుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా వెల్లడించారు. పార్టీ మీడియా, ప్రచార విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఖేరా తూర్పు చంపారన్ జిల్లాలోని ఢాకాలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. “ఈ యాత్ర అన్ని మతాల ప్రజలు పాల్గొనే మతపరమైన యాత్ర లాంటిది. సెప్టెంబర్ 1న, మా నాయకులు పాట్నాలోని గాంధీ మైదాన్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు […]
Read more

దేశ విభజనను గుర్తుచేస్తూ ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసిన NCERT…ఖండించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్!

న్యూఢిల్లీ: భారతదేశ విభజనను గుర్తుచేస్తూ… ఆగస్ట్‌ 14న’విభజన గాయాల స్మారక దినం’ సందర్భంగా NCERT ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. విభజనకు మహ్మద్ అలీ జిన్నాతో పాటు కాంగ్రెస్‌పార్టీని బాధ్యులుగా పేర్కొంది. కాగా, ఈ వాదనను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (IHC) తీవ్రంగా ఖండించింది. ఇది మతపరమైన ఉద్దేశ్యంతో కూడిన అబద్ధాలు” అని పేర్కొంది. ఈ పాఠ్యాంశాలను “వక్రీకరించారని ఆగస్టు 25 నాటి తీర్మానంలో IHC పేర్కొంది, దీనిని “పాఠశాలకు వెళ్లే లేత మనస్సులోకి జొప్పిస్తున్నారని విమర్శించింది. […]
Read more

గాజాలో నాలుగువేలకుపైగా పిండాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌!

న్యూఢిల్లీ: పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ పాశవిక దాడులకు గాజా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వీరిలో మహిళలు, పిల్లలే కాదు ఏకంగా ఇంకా జీవం పోసుకోని పిండాలు కూడా ఉండటమే నేటి విషాదం. ఇక్కడి అల్-బాస్మా IVF కేంద్రంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినప్పుడు 4,000 కంటే ఎక్కువ ఘనీభవించిన పిండాలు, 1,000 స్పెర్మ్ నమూనాలు, ఇంకా ఫలదీకరణం చెందని అండాలనుయనాశనం చేసిందని పాలస్తీనియన్ మానవ హక్కుల కేంద్రం (PCHR) విడుదల చేసిన నివేదిక తెలిపింది. “ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణ […]
Read more

ధర్మస్థల ఫైల్స్‌..కొత్తగా ‘సిట్’కు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి!

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉన్న పుణ్య క్షేత్రం ధర్మస్థల. కాగా ఈ పట్ణంలోని 13 ప్రదేశాలలో వందలాది మంది మహిళలు, బాలికల మృతదేహాలను తాను ఖననం చేశానని గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు పేర్కొన్న తర్వాత ఇది దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, దశాబ్దం క్రితం తన కూతురి సౌజన్యని అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆ […]
Read more

తెలంగాణలో వరదలు…1,444 మందిని రక్షించిన రెస్క్యూ టీం!

హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. వివిధ జిల్లాలు తీవ్ర వరదల బారిన పడ్డాయి. గురువారం సాయంత్రం 6:30 గంటల నాటికి విపత్తు ప్రతిస్పందన దళాలు మొత్తం 1,444 మందిని రక్షించాయి. కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టారు. గందరగోళం, విధ్వంసం మధ్య, ఆరుగురు వ్యక్తులు కనిపించకుండా పోయినట్లు సమాచారం. జగిత్యాల నుండి ఒకరు, మెదక్ నుండి ఇద్దరు, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, […]
Read more

అస్సాంలో మతాంతర భూ బదిలీకి కొత్త విధానం!

డిస్పూర్: అస్సాంలో మతాంతర భూ బదిలీకి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP)ని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయం గురించి వివరిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ…అలాంటి బదిలీలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. “అస్సాం వంటి సున్నితమైన రాష్ట్రంలో, భూ బదిలీని జాగ్రత్తగా అప్పగించాలి. అలాంటి బదిలీలన్నీ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనుంది. కొనుగోలు చేస్తున్న వ్యక్తికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మేము తనిఖీ చేస్తాం. అంతేకాదు ఆ భూమి అమ్మకం ఆ […]
Read more

వాణిజ్యం ఇప్పుడు ఆయుధంగా మారింది…ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్!

న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు తీవ్ర బాధాకరమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రఘురామ్ రాజన్ అన్నారు. అయితే భారత్ కు ఇదో పెద్ద మేల్కొలుపు అని అభివర్ణించారు. తమ వాణిజ్యాన్ని మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. భారత వస్తువులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు నిన్నటినుండి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రఘురామ్ రాజన్ మాట్లాడుతూ… నేటి ప్రపంచ క్రమంలో వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థికం […]
Read more

ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలు… 50 మందికి పైగా దౌత్యవేత్తలు హాజరు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలకు దాదాపు రెండు డజన్ల రాయబార కార్యాలయాలు, హై కమిషన్ల నుండి 50 మందికి పైగా దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెండవ రోజు హాజరైన ప్రముఖులలో అమెరికా మొదటి కార్యదర్శి గ్యారీ యాపిల్‌గార్త్, అమెరికా మంత్రి-కౌన్సెలర్ రాజకీయ వ్యవహారాల ఆరోన్ కోప్, చైనా మంత్రి-కౌన్సెలర్ జౌ గువోహుయ్, రష్యా మొదటి కార్యదర్శి మిఖాయిల్ జైట్సేవ్, శ్రీలంక హై కమిషనర్ ప్రదీప్ మొహ్సిని, మలేషియా […]
Read more

పోచారం ప్రాజెక్టుకు ముప్పు…తీవ్రస్థాయిలో వరద!

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. గంటగంటకు పెరుగుతున్న వరదతో.. పోచారం ప్రాజెక్టుపైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్‌ ఓవర్‌హెడ్‌ ప్రాంతంలో భారీ గండిపడినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లవచ్చని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముందు జాగ్రత్తగా దిగువన ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు. నివేదికల ప్రకారం, రిజర్వాయర్ […]
Read more

తెలంగాణలో యూరియా కొరత…తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు!

హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరతతో తెలంగాణ సతమతమవుతోంది. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల (PACS) వెలుపల రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి తమకు తగినంత యూరియా అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై చాలా మంది ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేశారు. ఎరువులు పొందడానికి నిన్నంతా రైతులు గంటల తరబడి క్యూలో ఓపికగా నిలబడి ఉన్నట్లు చూపే దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఒక వీడియోలో, సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్‌పేట్ […]
Read more
1 117 118 119 120 121 195

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.