Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సంతకం చేసిన బ్రిక్స్‌ నేతలు!

రియోడిజనీరో: పహల్గామ్ ఊచకోతను ఖండిస్తూ బ్రిక్స్ దేశాలకు చెందిన 11 మంది నాయకులు ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఉగ్రవాదాన్ని “నేరపూరితమైనది, సమర్థించలేనిది”అని బ్రెజిల్‌ రాజధాని రియో డి జనీరో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో అభివర్ణించారు. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ […]
Read more

భారీ జనసందోహం మధ్య పూర్తయిన బీబీ కా ఆలం ఊరేగింపు!

హైదరాబాద్: ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల అయిన ముహర్రం 10వ రోజున ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో షియా ముస్లింలు అషురా ఊరేగింపును నిర్వహించింది. బీబీ కా అలం ఊరేగింపు డబీర్‌పురా నుంచి మొదలైంది. అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేశా, మీర్ ఆలం మండి, పత్తర్‌గట్టి, మదీనా, దారుల్‌షిఫా మీదుగా ఊరేగింపు సాగి చివరకు చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది. బీబీ కా ఆలం’ అనేది ఓ చెక్క […]
Read more

రాజ్-ఉద్ధవ్ ఠాక్రే పునఃకలయికపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ!

ముంబయి: శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే రెండు దశాబ్దాల తర్వాత ఏకమయ్యారు. మొదటిసారిగా ముంబైలోని వర్లిలో జరిగిన ‘మరాఠీ స్వరం’ విజయోత్సవ సభలో వారిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా తప్పనిసరి చేయాలన్న ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా అన్నదమ్ములు కలిసిపోయారు. కాగా, థాకరే సోదరుల కలయికపై బేజేపీ విరుచుకుపడింది. ఈ ర్యాలీని జీహాదీ, హిందూ వ్యతిరేక సమావేశం అంటూ […]
Read more

ఎస్పీ నేత ఆజం ఖాన్ పార్టీ నుంచి వైదొలగే అవకాశం, ఉత్తరప్రదేశ్‌లో కొత్త రాజకీయ పొత్తు!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజం ఖాన్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆజం ఖాన్, యూపీ రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్ర ముస్లిం ఓటర్లలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య, మాజీ ఎంపీ తజీన్ ఫాత్మా ఇటీవల చేసిన ప్రకటన ఈ ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది, ఎస్పీ నుండి వైదొలగడం, మరొక రాజకీయ పార్టీతో తిరిగి పొత్తు పెట్టుకోవడంపై ఆమె సంకేతాలు […]
Read more

తమిళనాడులో దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్ష…విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!

చెన్నై: విల్లుపురం జిల్లాలోని మెల్పతి గ్రామానికి చెందిన నలుగురు దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్షకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం విల్లుపురం ఎస్పీని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు సమర్పించిన పిటిషన్‌ను అనుసరించి డిప్యూటీ సెక్రటరీ (హోం శాఖ) నుండి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. తనతో పాటు తన ముగ్గురు సహచరులను మెల్పతి పంచాయతీ అధ్యక్షుడు, కొంతమంది హిందువులు పదేపదే దుర్భాషలాడారని ఒక కార్మికుడు ఆరోపించారు. “మమ్మల్ని అవమానించారు, బెదిరించారు, ఒట్టి చేతులతో […]
Read more

గాజాలోని నాజర్ హాస్పిటల్ ఓ ‘ట్రామా వార్డ్’…డబ్ల్యూహెచ్‌ఓ!

జెనీవా: గాజాలోని నాజర్ హాస్పిటల్ “ఒక భారీ ట్రామా వార్డ్”గా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులతో గాయపడిన రోగులను ఈ ఆస్పత్రికి తరలిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగల గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) మే నెలాఖరులో గాజాలో ఆహార పంపిణీ చేయడం ప్రారంభించింది. అయితే ఆ ప్రాంతంలో వైమానికి దాడుల కారణంగా మరణించిన లేదా గాయపడిన వ్యక్తులకు సంబంధించిన సంఘటనలు […]
Read more

ప్రధాని మోదీ 42 దేశాలు సందర్శించారు కానీ మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదు..మల్లికార్జున ఖర్గే!

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 42 దేశాలు సందర్శించారు, కానీ ఆయనకు మణిపూర్ సందర్శించడానికి సమయం లేదు, అక్కడ ప్రజలపై దాడులు జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మణిపూర్ సందర్శించకపోవడంపై… భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ చీఫ్ తీవ్రంగా విమర్శించారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)ను స్వాధీనం చేసుకోవడంలో ఆయన ఎందుకు విఫలమయ్యారని, పాకిస్తాన్ పై […]
Read more

ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై మండిపడ్డ ఎలోన్ మస్క్!

వాషింగ్టన్‌: డోనాల్డ్ ట్రంప్ కలల బిల్లుపై ఎలోన్ మస్క్ మండిపడ్డాడు. దీనిని ‘పిచ్చి’, ‘విధ్వంసకరం’ అని అభివర్ణించాడు. ఈ బిల్లు ‘ఉద్యోగాలను నాశనం చేస్తుంది’ మరియు ‘యునైటెడ్ స్టేట్స్ వ్యూహానికి హాని కలిగిస్తుంది’ అని మస్క్ పేర్కొన్నాడు. మస్క్, ట్రంప్ మధ్య జరిగిన బహిరంగ వివాదం తర్వాత బిల్లు ఆమోదం పొందటం గమనార్హం. మొత్తంగా టెక్ దిగ్గజం, అమెరికా అధ్యక్షుడి మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిశీలకులను అయోమయంలో పడేస్తోంది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం […]
Read more

దేశంలో ఎమర్జెన్సీ…RSS పాత్ర!

ఈ ఏడాది జూన్‌లో మనదేశం ఎమర్జెన్సీ 50వ వార్షికోత్సవం జరుపుకుంది. 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి గురించి చాలా రాశారు, ఈ కాలంలో అనేక ప్రజాస్వామ్య స్వేచ్ఛలు నిలిపివేశారు. వేలాది మంది జైలు పాలయ్యారు. మీడియాను సెన్సార్ చేశారు. గత దశాబ్దంలో ఇందిరా గాంధీ తీసుకున్న విప్లవాత్మక చర్యలు, బ్యాంకుల జాతీయీకరణ, ప్రైవేట్ పర్స్ రద్దు వంటివి గుర్తుచేసుకునే కొంతమంది దళిత నాయకులు ఈ కాలాన్ని చాలా భిన్నంగా చూస్తారు. దీని గురించి విశ్లేషించాల్సిన […]
Read more

ట్రంప్‌ కల సాకారం…బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు ఆమోదం!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు కలలుకన్న బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు ఆమోదం లభించింది. మొన్న సెనేట్‌ ఓకే చేసిన ఈ బిల్లుకు నేడు అమెరికా కాంగ్రెస్‌ కూడా ఎస్‌ అంది. గురువారం రోజు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 218-214 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ దీనిని ఆమోదించింది. ఇది ట్రంప్‌కు అతిపెద్ద విజయం. ఈ చరిత్రాత్మక బిల్లుకు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన నేడు ట్రంప్ సంతకం చేయనున్నారు. ట్రంప్ సంతకం తర్వాత ఈ బిల్లు […]
Read more
1 … 181 182 183 184 185 … 237

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.