Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

టీపీసీసీకి కొత్త కార్యవర్గం…27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు!

హైదరాబాద్: కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈమేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) కొత్త ఉపాధ్యక్షులుగా 27 మంది, ప్రధాన కార్యదర్శులుగా 69 మంది పేర్లను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఆమోదించింది. ఈ నియామాకాలకు సంబంధించి నిన్న AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ లేఖ ద్వారా ఈ ప్రకటన వెలువడింది. యువ నాయకులు, కొంతమంది సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, MPలు, MLCల కలయికతో ఈ నియామకాలు […]
Read more

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఏరివేత ఆపరేషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాసిన వామపక్ష పార్టీలు!

కోల్‌కతా: ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో జరుగుతున్న ‘ఆపరేషన్ కాగర్’లో మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్ హత్యలను వ్యతిరేకిస్తూ ఐదు వామపక్ష పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంయుక్త లేఖ రాశాయి. ఆపరేషన్ కాగర్ పేరుతో ఛత్తీస్‌గఢ్ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్న “న్యాయేతర” హత్యలను వెంటనే నిలిపివేయాలని ఐదు వామపక్ష పార్టీలు ప్రధానమంత్రికి సంయుక్త లేఖ రాశాయి. “చాలా మంది సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రస్తుతం భద్రతా దళాల అదుపులో ఉన్నారని అనేక నివేదికలు ఉన్నాయి. వారందరినీ కోర్టులో హాజరుపరచాలని, చట్టం […]
Read more

అట్టుడుకుతోన్న లాస్‌ఏంజిల్స్‌…అదనపు దళాల మొహరింపుకు ట్రంప్ ఆదేశం!

లాస్ ఏంజిల్స్: అక్రమ వలసదారుల నిర్బంధంతో లాస్‌ఏంజిల్స్‌లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసింది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న నిరనసలు అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. లాస్‌ఏంజిల్స్‌కు దాదాపు 700 మంది మెరైన్‌లను తాత్కాలికంగా మోహరించాలని ఆదేశించారు. నిన్నంతా నగరంలో నిరసనలు జరిగాయి. ఇక్కడ వలసదారులను పట్టుకున్న ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వెలుపల వందలాది మంది ప్రదర్శనకారులు గుమిగూడారు. లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో వీధులను నిరసనకారులు దిగ్బంధించడంతో పోలీసులు నిరసనకారులపై మెరుపు దాడి […]
Read more

తెలంగాణలో విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీలు పెరిగాయ్‌!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను సవరించింది. ఇది నిన్నటినుండి అమల్లోకి వచ్చాయి. దాదాపు 20శాతం మేర ఛార్జీలను పెంచారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల మేర ఛార్జీలను పెంచామని ఆర్టీసీ చెబుతోంది. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్‌ రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్​ పాస్‌ ధరను రూ.1,600కు పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రీన్‌ మెట్రో […]
Read more

లాస్ ఏంజెల్స్‌లో నిరసనలు తీవ్రం…నేషనల్ గార్డ్స్‌ మొహరింపు!

లాస్ ఏంజెల్స్: వలసదారుల నిర్బంధానికి వ్యతిరేకంగా లాస్‌ఏంజిల్స్‌లో నిరసనలు తీవ్రమయ్యాయి. వేలాది మంది ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొంటూ, భద్రతా బలగాలతో తలపడుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్‌ను మోహరించినందుకు ప్రతిస్పందనగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. జనాన్ని నియంత్రించడానికి స్థానిక పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, ఫ్లాష్ బ్యాంగ్‌లను ప్రయోగించారు. దీంతో పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. కొంతమంది పోలీసులు గుర్రంపై వీధుల్లో గస్తీ తిరుగుతుండగా, మరికొందరు ఇటీవలి రోజుల్లో కొంతమంది […]
Read more

రాహుల్‌ గాంధీ X ఎన్నికల సంఘం…తీవ్రరూపం దాల్చిన వివాదం!

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ఎన్నికల రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ చేసిన వాదనలు వివాదానికి దారితీశాయి. ఈ అంశంపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని ఎన్నికలసంఘం కోరింది. అవకతవకలు జరిగినట్లు భావిస్తే హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. అంతేకాదు మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారంటూ రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించాయి. కాంగ్రెస్ అభ్యర్థులు స్వయంగా నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను రాహుల్ అనుమానిస్తున్నారని ఆక్షేపించాయి. అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు నివృత్తి చేయడానికి గత నెల […]
Read more

మైతీ నేత అరెస్టు…మణిపూర్‌లోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ!

ఇంఫాల్‌ : మణిపూర్‌ మళ్లీ మండుతోంది. మైతీ – కుకీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలతో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలపై మైతీ తెగకు చెందిన స్వచ్ఛంద సంస్థ అరంబై తెంగోల్‌ (ఎటి) నేత కనన్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయనతోపాటు మరో నలుగురిని విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేసారు. మైతీలకు చెందిన రాడికల్ సంస్థ ‘అరంబై […]
Read more

ఈద్ రెండో రోజే గాజాపై ఇజ్రాయెల్ దాడులు…72 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు!

గాజా: బక్రీద్‌ రెండో రోజు తెల్లవారుజామున గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఫలితంగా గాజా స్ట్రిప్‌లో కనీసం 72 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఈద్ అల్-అజ్‌హా రెండవ రోజున, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజా నగరంలోని సబ్రా పరిసరాల్లో రెండు క్షిపణులతో ఒక నివాస గృహంపై దాడి చేయడంలో ఆరుగురు పిల్లలతో సహా కనీసం 15 మంది పాలస్తీనియన్లు మరణించారని, 50 మందికి పైగా గాయపడ్డారని […]
Read more

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ…మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్, లక్ష్మణ్, శ్రీహరి!

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా ముగ్గురు మంత్రులకు స్థానం కల్పించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ విస్తరణలో, జి. వివేక్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని చేర్చుకున్నారు. ఈ విస్తరణలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ, ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణ […]
Read more

నలభై కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరనున్న తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్: కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చడంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర OBC జాబితా నుండి తొలగించిన 26 కులాలకు సంబంధించిన బహిరంగ విచారణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించింది. కాగా, ఈ సమావేశం జూన్ 9, 10, 11 తేదీల్లో జరగనుంది. దీనిపై కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, కుల సర్వే నుండి సమాచారం, ఈ తొలగించిన కులాల జనాభా, […]
Read more
1 191 192 193 194 195 236

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.