Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ నియంత…డోనాల్డ్ ట్రంప్!

వాషింగ్టన్/కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపకుండా అధ్యక్ష పదవిలో ‌కొనసాగుతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను ట్రంప్ తప్పు బట్టారు. కాస్త భూమితో పోయేదానిని యుద్ధం వరకు తెచ్చారని ఉక్రెయిన్‌పై మండిపడ్డారు. ఇప్పుడు ఉక్రెయిన్ ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని మంగళవారం ఫ్లోరిడాలో విలేకరుల సమావేశంలో ట్రంప్ విమర్శించారు. యుద్ధానికి ఉక్రెయినే […]
Read more

షామీర్‌పేటలో దళితుల కాలనీలో ప్రవేశానికి అడ్డుగా ఉన్న గోడను కూల్చేసిన హైడ్రా!

హైదరాబాద్: దేవరాయంజల్‌లోని దళితులు తమ ఇళ్లకు చేరుకోవడానికి వీలుగా రోడ్డు కోసం నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి హైడ్రా ముగింపు పలికింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ బృందం 1985లో ఒక రియల్టర్ నిర్మించిన సరిహద్దును కూల్చివేసింది, ఆ సరిహద్దు వారి కాలనీకి చేరుకోవడానికి ఉన్న అన్ని ఎగ్జిట్ పాయింట్లను మూసివేసింది. ఫిబ్రవరి 19 బుధవారం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా షామీర్‌పేట మండలంలోని తుంకుంట మునిసిపాలిటీలోని దేవరాయంజల్ గ్రామంలో ఈ ఆపరేషన్ జరిగింది, […]
Read more

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా… సీఎం పదవిని చేపట్టిన 4వ మహిళ!

న్యూఢిల్లీ: ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది, ఎంపిక ప్రక్రియకు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధంకర్‌లను పరిశీలకులుగా నియమించారు. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ శాసనసభ్యులు తమ నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమయ్యారు, ఆమె ఢిల్లీ సీఎంగా ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం నేడు రాంలీలా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి […]
Read more

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్‌…60 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్!

కరాచీ: బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఆతిథ్య పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. కివీ బ్యాటర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలు చేశారు. యంగ్ 113 బంతుల్లో 107 పరుగులు చేయగా, లాథమ్ 104 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచి బ్లాక్ క్యాప్స్‌ను ఐదు వికెట్లకు 320 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో న్యూజిలాండ్ ఇబ్బందులు ఎదుర్కొన్నా… గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో […]
Read more

తెలంగాణ కుల గణనలో పెరిగిన ముస్లిం OBC నిష్పత్తి…రిజర్వేషన్ల పెంపుపై ఆశలు!

హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్లుగా రికార్డు సమయంలో కుల గణనను పూర్తిచేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో దాని ప్రధానాంశాలను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తెలంగాణ జనాభాలో ముస్లింలు 12.56% మంది ఉన్నారని, వీరిలో 10.08% మంది ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గానికి చెందినవారని కుల గణన నివేదిక వెల్లడించింది. ముస్లిం జనాభాలో 2.48% మాత్రమే OBC వర్గీకరణ వెలుపల ఉన్నందున, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4% రిజర్వేషన్ల పెరుగుదల కోసం ఈ […]
Read more

పిల్లలపై నిఘా నిమిత్తం డిటెక్టివ్‌లను నియమించుకుంటున్న పేరెంట్స్!

బెంగళూరు: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో టీనేజ్ పిల్లలు చెడు వైపు త్వరగా ఆకర్షితులవుతున్నారు. చిన్న విషయాలకే తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తున్నారు. పేరెంట్స్‌ తమ బిడ్డకు మంచి పెంపకం ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ, అందరు పిల్లలు బాధ్యతాయుతమైన టీనేజర్లుగా ఎదగరు. తోటివారి ఒత్తిడి, గృహ సమస్యలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, హార్మోన్ల మార్పుల కారణంగా టీనేజర్లు కొన్నిసార్లు తప్పుదారి పడుతున్నారు.. అలాంటి టీనేజర్లు… తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఉపాధ్యాయులతో కూడా కమ్యూనికేషన్ ఉండదు. వారు తరచుగా చదువులను నిర్లక్ష్యం చేస్తారు. హింసాత్మకంగా మారుతున్నారు. […]
Read more

ఒరిస్సాలోని కళింగ వర్సిటీలో నేపాల్ అమ్మాయి ఆత్మహత్య…నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు!

భువనేశ్వర్ : ఒరిస్సాలోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌ గదిలో శవమై కనిపించడంతో అటు నేపాల్, ఇటు క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఒరిస్సా ప్రభుత్వం నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ… విద్యార్థి మరణానికి గల కారణాలను తెలుసుకోనుంది. అంతేకాదు నిరసన చేస్తున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీ చేయాల్సినంతగా పరిస్థితులు దిగజారాయా అని తెలుసుకోనుంది. కళింగ యూనివర్సిటీలో నేపాల్ […]
Read more

భారత్, ఖతార్ మధ్య వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్న వాణిజ్యం!

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన ఖతార్‌ అమీర్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య రానున్న ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కనీసం 28 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కుదుర్చుకునేందుకు గల అవకాశాలను ఇరు వర్గాలు అన్వేషించాయని తెలిపింది. ప్రస్తుతమున్న ద్వైపాక్షిక సంబంధాల […]
Read more

బీహార్‌లోని ఓ మసీదు సమీపంలో రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఏబీవీపీ…చెలరేగిన హింస!

జముయ్ : బీహార్‌లోని జముయ్ జిల్లాలోని ఓ మసీదు సమీపంలో ABVP సభ్యులు రెచ్చగొట్టే నినాదాలు చేయడంతో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి, దీనితో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఝఝా ప్రాంతంలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఈ సంఘటన జరిగింది. రాళ్ల దాడి కారణంగా కొంతమందికి గాయాలు అయ్యాయి. జముయ్ జిల్లా మేజిస్ట్రేట్ అభిలాష శర్మ ప్రకారం, ఈ హింసలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, […]
Read more

తాగునీటి వాడకంపై ఆంక్షలు విధించిన బెంగళూరు జలమండలి!

బెంగళూరు: ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడం వంటి కారణాల వల్ల అనవసర కార్యకలాపాలకు తాగునీటిని వినియోగించడంపై బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల చట్టం 1964లోని సెక్షన్లు 33 మరియు 34 ప్రకారం, వాహనాలను శుభ్రం చేయడానికి, తోటపని […]
Read more
1 190 191 192 193 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.