Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

చికెన్స్ నెక్ కారిడార్ సమీపంలోని నదీ సంరక్షణ ప్రాజెక్టులో పాల్గొనాల్సిందిగా చైనాను ఆహ్వానించిన బంగ్లాదేశ్!

న్యూఢిల్లీ: భారతదేశ ఏడు ఈశాన్య రాష్ట్రాల మధ్య అనుసంధానం అయిన ‘చికెన్స్ నెక్’ కారిడార్ సమీపంలోని నదీ సంరక్షణ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టమని బంగ్లాదేశ్ చైనాను ఆహ్వానించింది. ఈమేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ శుక్రవారం బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశారు. భారతదేశం నుండి బంగ్లాదేశ్‌కు ప్రవహించే టీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టులో పాల్గొనమని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను యూనస్ ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం, న్యూఢిల్లీ ఈ […]
Read more

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం…150మంది మృతి!

నైపేయి: భారీ భూకంపం మయన్మార్‌ను కుదిపేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో నమోదైన ప్రకంపనాల ధాటికి ఆ దేశం విలవిల్లాడింది. ఫలితంగా పలు భవనాలు కుప్పకూలిపోయాయి. భూకంపం ధాటికి 144 మంది మరణించారని, 732 మంది గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వం తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు. దీంతో మయన్మార్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సాగింగ్‌ నగర వాయువ్యంలో 16 కి.మీ దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్‌ […]
Read more

బీజేపీయేతర పార్టీలను ‘అంటరానివారు’గా చూస్తున్నారు…బీజేపీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌!

పాట్నా : కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటన తర్వాత బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఒక ఆలయాన్ని కడుగుతున్నట్లు ఉన్న వీడియో వివాదానికి దారితీసింది, బిజెపియేతర పార్టీల మద్దతుదారులను “అస్పృశ్యులుగా పరిగణిస్తారా” అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం… బీహార్‌లో నిరుద్యోగాన్ని ఎత్తిచూపడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రారంభించిన ‘వలసలను ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి’ యాత్రలో భాగంగా కన్హయ్యకుమార్‌ బొంగావ్ గ్రామంలోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగింది. కన్హయ్య కుమార్ ఆలయ ప్రాంగణం […]
Read more

అస్సాం ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్న బ్యాంకు కుంభకోణాన్ని వెలికితీసిన జర్నలిస్ట్ మళ్ళీ అరెస్టు!

ఇంఫాల్: ది క్రాస్‌కరెంట్ రిపోర్టర్, గౌహతి ప్రెస్ క్లబ్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయిన జర్నలిస్ట్ దిల్వార్ హుస్సేన్ మొజుందర్‌ను నిన్న సాయంత్రం పాత కేసులో బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే గౌహతి పోలీసులు తిరిగి అరెస్టు చేశారు. అస్సాం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ దంబారు సైకియా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు మొజుందర్‌ను తిరిగి అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో మోజుందార్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి […]
Read more

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం!

హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ ప్రక్రియలో పారదర్శకతను కొనసాగించాలని, ఏవైనా మార్పులను ఖరారు చేసే ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని అసెంబ్లీ తీవ్రంగా ఖండిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. […]
Read more

తీవ్ర వాదోపవాదాల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం…నిరవధిక వాయిదా!

హైదరాబాద్: బడ్జెట్‌ సమావేశాల చివరిరోజున తెలంగాణ శాసనసభ నిన్న అప్రాప్రియేషన్ బిల్లు (ద్రవ్య వినిమయ బిల్లు)ను ఆమోదించింది. స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆదేశించారు, ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ తరువాత, 11 రోజుల పాటు సమావేశమైన సభ నిరవధికంగా వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల చర్చలో ఎక్కువ భాగం రాష్ట్ర రుణం చుట్టూనే తిరిగింది. కేటీఆర్, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం, […]
Read more

ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతృత్వంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాట్నాలో భారీ నిరసన!

పాట్నా : ప్రతిపాదిత వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా పాట్నాలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో బోర్డుతో సంబంధం ఉన్న అన్ని మత, రాజకీయ సంస్థలు, సారూప్య రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. నిరసనకారులు బిల్లును ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం సమాజం మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత […]
Read more

తెలంగాణలో మిస్‌వరల్డ్‌ ఈవెంట్‌…రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కేటీఆర్‌!

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే… ఆ సమస్యను పరిష్కరించకుండా అందాల పోటీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ… రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నప్పుడు రాబోయే మిస్ వరల్డ్ పోటీలకు రూ. 55 కోట్లు ఖర్చు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేటిఆర్ విమర్శించారు. రాష్ట్రంలో సాగునీరు లేక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని, అదే […]
Read more

మణిపూర్‌లో 21 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు…ముగ్గురు అరెస్ట్‌!

ఇంఫాల్: మణిపూర్‌లో 21 నెలలుగా కొనసాగుతున్న జాతి సంక్షోభంతో అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లో అక్కడ రాష్ట్ర పోలీసులు జరిపిన దాడిలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 10.565 కిలోగ్రాముల నిషిద్ధ హెరాయిన్ పౌడర్‌ను సీజ్‌ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.21 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ జాతీయ రహదారి-2 (ఇంఫాల్-దిమాపూర్) మార్గంలో చేపట్టారు. దాడుల్లో ఒక జంటతో సహా ముగ్గురు మాదకద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల రవాణాకు […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను ఖండించిన ఈజిప్ట్, స్పెయిన్!

కైరో: గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్-ఫత్తా అల్-సిసి, స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్రంగా ఖండించారు. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో, వారు తక్షణ కాల్పుల విరమణ ఆవశ్యకతను వ్యక్తపరిచారు. అంతేకాదు గాజా స్ట్రిప్‌లోకి ఇజ్రాయెల్ భూ చొరబాటును ముగించాలని కోరారు. అలాగే మానవతా సహాయం తక్షణమే అందించాలని నొక్కిచెప్పారని జిన్హువా వార్తా సంస్థ ఈజిప్టు అధ్యక్ష కార్యాలయం నుండి జారీ అయిన ఒక ప్రకటనను […]
Read more
1 78 79 80 81 82 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.