Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజాలో గ్రౌండ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించిన ఇజ్రాయెల్‌!

డెయిర్‌ అల్‌ బలా: నిన్నటికి నిన్న భీకర వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ తాజాగా ఆ ప్రాంతంలో భూతల యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ చర్య గాజాలో ఇజ్రాయెల్ దాడిని మరింత తీవ్రతరం చేసినట్లు కనిపించింది. ఇది జనవరిలో ప్రారంభమైన హమాస్‌తో కాల్పుల విరమణను విచ్ఛిన్నం చేసింది. అంతేకాదు కాల్పుల విరమణలో భాగంగా, ఇజ్రాయెల్ సైనిక జోన్‌గా ఉపయోగించిన నెట్‌జారిమ్ కారిడార్‌ను ఇజ్రాయెల్ సైన్యం తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. దీంతో పాలస్తీనావాసుల కదలికలను నియంత్రించే వెసులుబాటు ఇజ్రాయెల్‌ […]
Read more

గాజాను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ప్రతిపాదనకు మద్దతుగా యూఏఈ రహస్య లాబీయింగ్!

కైరో : అరబ్ లీగ్ మద్దతుతో గాజా పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రతిపాదించిన ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చర్య అబుదాబి, కైరో మధ్య గాజా భవిష్యత్తు పాలనపై విభేదాలను సూచిస్తుంది. మార్చి ప్రారంభంలో, మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజా రాజకీయ పరివర్తన, పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం ఈజిప్ట్ కైరో డిక్లరేషన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రణాళికలో పాలస్తీనియన్ అథారిటీ (PA) పాలన, జోర్డాన్, ఈజిప్ట్ శిక్షణ […]
Read more

నాలుగు దశాబ్దాలుగా మసీదులో ఇఫ్తార్ విందు ఇస్తోన్న చెన్నైలోని సూఫీ ఆలయం!

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని సూఫీ ఆలయం 40 సంవత్సరాలకు పైగా రంజాన్ నెలలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇస్తోంది. తద్వారా సర్వమత సామరస్యానికి చిహ్నంగా నిలిచింది. 1947లో భారత విభజన తర్వాత సింధ్ నుండి చెన్నైకి తరలివచ్చిన వచ్చిన హిందూ శరణార్థి దాదా రతన్‌చంద్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. రంజాన్ నెలలో ప్రతి రాత్రి, సూఫీ ఆలయం నుండి వాలంటీర్లు ట్రిప్లికేన్‌లోని వల్లజా మసీదుకు వచ్చి ఇఫ్తార్‌ సమయంలో ఉపవాసీలకు శాఖాహార వంటకాలు అందిస్తారు. […]
Read more

బడ్జెట్‌లో మున్సిపల్‌-పట్టణాభివృద్ధి శాఖకు17,677 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు తెలంగాణ ప్రభుత్వం రూ.17,677 కోట్ల కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ట్రాఫిక్ రద్దీని సమర్ధవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం H-CITI ప్రణాళికను హైలైట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో రూ.7,032 కోట్ల అంచనా పెట్టుబడితో 31 ఫ్లైఓవర్లు, 17 […]
Read more

చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ!

హైదరాబాద్: నిన్న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) బిల్లు-2025ను తెలంగాణ శాసనసభ ఆమోదించింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ఆధారందశాబ్దాలుగా వెనుకబడిన ఎస్సీ వర్గాలకు సామాజిక వెనుకబాటుతనం, ప్రాధాన్యత ఆధారంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ జరుగుతోందని వైద్యశాఖా మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్గీకరణ అంతిమ పరిష్కారం కాదని, వెనుకబడిన ఎస్సీ వర్గాల అభ్యున్నతికి ఒక సాధనమని అన్నారు. “ఎస్సీ వర్గాల సామాజిక-ఆర్థిక […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు… ఇజ్రాయెల్‌ను “ఉగ్రవాద దేశం”గా అభివర్ణించిన టర్కీ అధ్యక్షుడు!

గాజా : హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులకు పాల్పడుతోంది. ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ పరిణామాలపై ఖిన్నుడైన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్‌ను “ఉగ్రవాద దేశం”గా అభివర్ణించారు. “నిన్న రాత్రి గాజాపై జరిగిన క్రూరమైన దాడులతో జియోనిస్ట్ పాలకులు… అమాయకుల రక్తం, జీవితాలను కబళించే ఉగ్రవాద రాజ్యమని మరోసారి నిరూపించుకుంది” అని ఎర్డోగన్ రంజాన్ ఉపవాస విందులో […]
Read more

మార్చి 21నుంచి పదోతరగతి పరీక్షలు… ఐదు లక్షలమంది విద్యార్థులు హాజరు!

హైదరాబాద్‌: తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి, రాష్ట్రవ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాల్లో 5.09 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్‌ రాయనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు (ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:50 వరకు) సైన్స్ (భౌతిక, జీవ శాస్త్రంగా విభజించారు. ఇది ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు జరుగుతుంది) మిగతా సబ్జెక్టులు […]
Read more

ఉత్కంఠతకు తెర…సునీతా విలియమ్స్ సేఫ్ ల్యాండింగ్!

ఫ్లోరిడా : యావత్‌ ప్రపంచాన్ని ఉత్కంఠతకు గురిచేసిన సునీతా విలియమ్స్‌ అంతరిక్షయానం విజయవంతంగా ముగిసింది. 286రోజులు అంతర్జాతీయ అంతరిక్షంలో చిక్కుకుపోయిన బారత సంతతి వ్యోమగామి భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుఝామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం 8 రోజుల పాటు ఉండేందుకు వెళ్లిన ఆమెతో పాటు బుచ్ విల్మోర్ అనే మరో అస్ట్రోనాట్ …తిరిగి తీసుకు వచ్చే వ్యోమనౌక లో సమస్యలు ఏర్పడటంతో అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు నాసా […]
Read more

ఔరంగజేబు సమాది వివాదం…నాగపూర్‌లో హింస!

ముంబయి: మహారాష్ట్ర శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత నాగ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం హింసాత్మక ఘర్షణలు జరిగాయి, 30 మందికి పైగా గాయపడ్డారు. హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆరోపించింది. నగరంలోని మహల్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన భారీ ఘర్షణ తర్వాత దాదాపు 60 నుండి 65 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. […]
Read more

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద భారీ నిరసన!

న్యూ ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) భారీ నిరసనను నిర్వహించింది. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విభిన్న నేపథ్యాల నుండి వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, AAP, AIMIM, CPI, CPI(ML), CPM, IUML, NCP, TMC, BJD, WPI వంటి వివిధ ముస్లిం సంస్థలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు […]
Read more
1 81 82 83 84 85 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.