Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజా తీర్మానాన్ని’త్వరగా ఆమోదించండి’… ‘యూఎన్‌’ను కోరిన అమెరికా, అరబ్‌దేశాలు!

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికను త్వరగా ఆమోదించాలని అమెరికా సహా టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియాతో పాటు అనేక అరబ్ దేశాలు యూఎన్‌ భద్రతా మండలిని అభ్యర్థించాయి. ఈమేరకు “యునైటెడ్ స్టేట్స్, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా , ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్, తుర్కియా ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడి మద్దతు ఇస్తున్నామని” నిన్న ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. గత వారం […]
Read more

సుడాన్‌లోని ‘అల్ ఫషర్‌’లో సామూహిక దురాగతాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన!

ఖార్తూమ్‌: ఒకప్పుడు ఆఫ్రికాలోని విభిన్న తెగలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలసి జీవించిన నేల సూడాన్. కానీ, నేడు ఆ దేశపు పేరు వింటే నెత్తుటి వాసన రావడం విషాదం. తాజాగా సుడాన్‌లోని అల్ ఫషర్‌లో సామూహిక దురాగతాలు, తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేశారు. కోర్డోఫాన్ ప్రాంతంలో కూడా హింస తీవ్రమవుతోందని అన్నారు. సుడానీస్ సాయుధ దళాలు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) పారామిలిటరీల మధ్య పోరాటం […]
Read more

శాశ్వత కాల్పుల విరమణ దిశగా హమాస్ “నిర్మాణాత్మక చర్యలు”… టర్కీ విదేశాంగ మంత్రి!

ఇస్తాంబుల్‌: గాజాలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా హమాస్ “నిర్మాణాత్మక చర్యలు” తీసుకుంటోందని టర్కీ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఇలాంటి సంకల్పాన్ని చూపించాలని ఆయన అభిలషించారు. ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేలట్టితో అంకారాలో జరిగిన సంయుక్త వార్తా సమావేశంలో ఫిడాన్ మాట్లాడుతూ… గాజా పాలస్తీనాలో విడదీయరాని భాగమని, స్పష్టమైన UN-మద్దతు గల చట్రంలో పాలస్తీనియన్లచే పాలన కొనసాగించాలని నొక్కి చెప్పారు. “గాజా పాలస్తీనాలో భాగం, అది అలాగే ఉండాలి.అలాగే పరిగణించాలి” […]
Read more

కాల్పుల విరమణ అమలవుతున్నా…ఇంకా చీకటిలోనే మగ్గుతున్న గాజా వాసులు!

గాజా: గత నెల ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ తర్వాత కూడా గాజాలో విద్యుత్ లేకపోవడంతో పాలస్తీనియన్లు ఇంకా చీకటిలోనే మగ్గాల్సి వస్తోంది. ఓ పాలస్తీనా తల్లి హనాన్ అల్-జౌజౌ, 31, చీకటిలో తన ముగ్గురు పిల్లలకు ఫ్లాష్‌లైట్‌తో ఆహారం పెట్టాల్సి వచ్చింది. వారు ఫ్లాష్‌లైట్ ఛార్జ్ చేయలేకపోతే, వారు ఆకలితో అలమటించాల్సిందే. “మేము చీకటిలోనే ఉంటాము”సూర్యుడు అస్తమించాక, అంటే మగ్రిబ్ తర్వాత మాకు అంతా చీకటే. “టార్చ్ వెలుగు అందుబాటులో ఉంటే, మేము దానిని వెలిగిస్తాము. లేకపోతే, […]
Read more

కాల్పుల విరమణ తర్వాత రోజుకు 8మంది పాలస్తీనియన్లు మరణించారు…హక్కుల సంఘం!

గాజా: ఇజ్రాయెల్ పాలస్తీనా పౌరులపై మారణహోమం కొనసాగిస్తోంది. గత నెలలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుండి రోజుకు సగటున ఎనిమిది మంది పాలస్తీనియన్లు చంపుతున్నారని జెనీవాకు చెందిన హక్కుల పరిశీలకుల బృందం తెలిపింది. అక్టోబర్ 10న ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కుదిరి నెల రోజులు గడిచినప్పటికీ, ఇజ్రాయెల్ పాలస్తీనా పౌరులను “ముందస్తుగా హత్య చేయడం” కొనసాగించిందని యూరో-మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. “గాజాపై కొనసాగుతున్న సమగ్ర దిగ్బంధనం, ఉద్దేశపూర్వక […]
Read more

అమెరికా షట్‌డౌన్‌ ముగింపుకు ఒప్పందం కుదుర్చుకున్న సెనేటర్లు!

వాషింగ్టన్‌: అమెరికాలో 40 రోజులుగా కొనసాగుతున్న షట్‌డౌన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈమేరకు అమెరికా సెనేటర్లు నిన్న ఒక ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈమేరకు డెమోక్రటిక్ సెనేటర్లు జీన్ షాహీన్, మ్యాగీ హసన్.. రిపబ్లికన్ లీడర్ జాన్ థూన్, వైట్‌హౌస్ ప్రతినిధులతో కలిసి వారాంతంలో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ బిల్లు ప్రకారం చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జనవరి వరకు నిధులు అందుతాయి. షట్‌డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయిపడ్డ జీతాలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు. […]
Read more

గాజా మారణహోమం…ఇజ్రాయెల్‌కు ‘బ్లాంక్‌ చెక్’ ఇచ్చిన జో బిడెన్‌!

వాషింగ్టన్‌: గాజా విషయంలో మాజీ అధ్యక్షుడు జో బిడెన్ విధానాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ – పాలస్తీనా పట్ల అమెరికా విధానంలో పెద్ద మార్పు రావాలని పిలుపునిచ్చారు. వాషింగ్టన్ D.C.లో జరిగిన ఒక కార్యక్రమంలో US కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా మాట్లాడుతూ… “మనం సత్యంతో ప్రారంభించాలి. అధ్యక్షుడు బిడెన్ గాజాకు సంబంధించి సరిగ్గా వ్యవహరించలేదు. ఆయన తప్పు చేశారు. మనం ఎప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వకూడదని అన్నారు.” కాగా, […]
Read more

సుడాన్‌లో కాల్పుల విరమణకు అంగీకరించిన ఆర్‌ఎస్‌ఎఫ్‌!

ఖర్తోమ్‌: సుడాన్‌లో ప్రస్తుతం సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న ఘర్షణల కారణంగా తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొంది. ఈ సంఘర్షణ 2023లో ప్రారంభమై, ఇప్పటికీ కొనసాగుతోంది, దీని ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వస్తోంది. ఆహార కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు సూడాన్ పారామిలిటరీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF), US నేతృత్వంలోని మధ్యవర్తి బృందం ప్రతిపాదించిన మానవతావాద సంధికి అంగీకరించింది. 18 నెలలకు […]
Read more

ఫిలిప్పీన్స్‌లో కల్మేగి తుపాను బీభత్సం…114 మంది దుర్మరణం!

మనీలా: అత్యంత శక్తివంతమైన కల్మేగి తుఫాను ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విలయం దెబ్బకు114 మంది మరణించగా మరో 127గురు తప్పిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కల్మేగి తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న సెంట్రల్ ప్రావిన్స్ సెబులో చాలా మరణాలు సంభవించాయని, ఆకస్మిక వరదలతో నదులు, ఇతర జలమార్గాలు పొంగిపొర్లాయని పౌర రక్షణ కార్యాలయం డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ బెర్నార్డో రాఫెలిటో అలెజాండ్రో IV నేడు మీడియాకు తెలిపారు. మంగళవారం దక్షిణ ప్రావిన్స్ అగుసాన్ […]
Read more

విక్టరీ స్పీచ్‌లో నెహ్రూను ఉటంకించిన మమ్దానీ…ట్రంప్‌కు సవాల్‌!

న్యూయార్క్: నగర మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ వలసలపై కఠిన చర్యలు ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేశారు. న్యూయార్క్ వలసదారులచే శక్తిని పొందుతుందని, వలసదారుడి నాయకత్వంలో ఉంటుందని నొక్కి చెప్పారు. తన విజయం ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసిందని అన్నారు. అంతేకాదు నేరుగా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్‌.. ఇదంతా మీరు చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నా వద్ద నాలుగు మాటలు ఉన్నాయి. సౌండ్ పెంచండి. […]
Read more
1 14 15 16 17 18 42

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.