Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజా యుద్ధం…మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న 80వేలమంది ఇజ్రాయెల్ సైనికులు!

టెల్‌అవీవ్‌: రెండు సంవత్సరాల క్రితం గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య బాగా పెరిగిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. అక్టోబర్ 7, 2023 సాయంత్రం నాటికి మంత్రిత్వ శాఖ దాదాపు 62,000 మానసిక కేసులకు చికిత్స అందించిందని, ఈ సంఖ్య దాదాపు 85,000కి పెరిగిందని మంత్రిత్వ శాఖ పునరావాస విభాగం డిప్యూటీ హెడ్ తమర్ షిమోని అన్నారు. ఆమె ఆర్మీ రేడియోతో మాట్లాడుతూ…ఈ పెరుగుదలను […]
Read more

మమ్దానీ అరెస్టు చేస్తానన్నప్పటికీ న్యూయార్క్ సందర్శిస్తానంటున్న నెతన్యాహు!

న్యూయార్క్: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) వారెంట్ ప్రకారం నెతన్యాహును అరెస్టు చేస్తామని కాబోయే మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రకటించినా …ఇప్పటికీ న్యూయార్క్‌ను సందర్శించాలని యోచిస్తున్నానని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. “అవును, నేను న్యూయార్క్ వస్తాను” అని నెతన్యాహు బుధవారం న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ ఫోరమ్‌కు ఇచ్చిన వర్చువల్ ఇంటర్వ్యూలో అన్నారు. మమ్దానీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారా అని అడిగినప్పుడు, నెతన్యాహు “అతను తన మనసు మార్చుకుని ముందుకు వస్తే అది సంభాషణకు మంచి ప్రారంభం అవుతుంది” అని […]
Read more

ఈ ఏడాది పాలస్తీనియన్లకు అత్యంత ప్రాణాంతక సంవత్సరం…హక్కుల సంఘాలు!

టెల్‌అవీవ్‌: కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో యావత్‌ ప్రపంచం కొత్త ఏడాదిని స్వాగతిస్తుంది. కానీ గాజాలో మాత్రం ఈఏడాది భయానక అనుభవాలను మిగిల్చింది. ఇజ్రాయెల్‌ బాంబుదాడులు ఏకంగా వేలమందిని హతమార్చింది. లక్షల మందిని గాయపర్చింది. మరికొన్ని లక్షలమందిని నిరాయశ్రయులను చేసింది. ఈ సంవత్సరం గాజా ఓ శిధిల నగరంగా మారింది. మొత్తంగా 2025 పాలస్తీనియన్లకు “అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత విధ్వంసకర” ఏడాదిగా మార్చాయని ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. బిమ్కోమ్, గిషా, అసోసియేషన్ ఫర్ సివిల్ […]
Read more

బంగ్లాదేశ్ ఎన్నికల్లో జమాతే ఇస్లామి ‘బీఎన్‌పీ’ని ఓడిస్తుందా?

ఢాకా: ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన వెంటనే ఎన్నికలు జరిగితే… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు వరుసలో ఉందని భావించారు. అయితే ఇప్పుడు BNP ఆ ఆధిక్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు నిషేధంలో ఉన్న బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి నిశ్శబ్ద విజయానికి దగ్గరగా ఉంది. ఈ విషయమై అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 33% మంది […]
Read more

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్‌!

గాజా: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ పదేపదే తూట్లు పొడుస్తూనే ఉంది. ఇజ్రాయెల్ జరిపిన తాజా కాల్పుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు గాయపడ్డారు, తూర్పు గాజా నగరంలోని అల్ తుఫా పరిసరాల్లో డజన్ల కొద్దీ పాలస్తీనియన్ కుటుంబాలు ఇజ్రాయెల్ కాల్పుల్లో చిక్కుకున్నాయి. ఆ ప్రాంతం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తరువాత డ్రోన్లు, ట్యాంకులతో కాల్పులకు తెగపడ్డాయి. ఇజ్రాయెల్ క్వాడ్‌కాప్టర్ డ్రోన్ కాల్పులు జరిపిన తర్వాత ఒక పాలస్తీనియన్ మహిళను మధ్య గాజా నగరంలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ […]
Read more

అవినీతి కేసులో షేక్ హసీనా కుటుంబానికి కొత్త శిక్షలు విధించిన ఢాకా కోర్టు!

ఢాకా: షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై ఉన్న అవినీతి కేసుల కొనసాగింపులో భాగంగా…అక్కడి కోర్టు మరిన్ని శిక్షలు విధించింది. ఢాకాలోని పుర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ కింద ప్లాట్ల కేటాయింపుకు సంబంధించిన కేసులో పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానా, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్ లకు బంగ్లాదేశ్ కోర్టు శిక్ష విధించింది. ఈ భూకేటాయింపులో కేసులో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, […]
Read more

పాలస్తీనా ఏర్పాటయితేనే ఇజ్రాయెల్‌తో సంబంధాలు సరళీకరిస్తాం…సౌదీ క్రౌన్ ప్రిన్స్!

రియాద్: పది రోజుల క్రితం వైట్ హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, అబ్రహం ఒప్పందంలో చేరాలని ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించాలని అమెరికా చేసిన ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించారు, స్వతంత్ర పాలస్తీనా రాజ్యానికి విశ్వసనీయమైన, కాలపరిమితి గల మార్గాన్ని నొక్కి చెప్పారు. ఆక్సియోస్, ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం… ఒప్పందాలపై వెంటనే సంతకం చేయాలని ట్రంప్ రియాద్‌ను ఒత్తిడి చేశారు, కానీ క్రౌన్ ప్రిన్స్ తన […]
Read more

వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు సైనికులపై కాల్పులు!

వాషింగ్టన్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. అధ్యక్షభవనం వైట్‌హౌస్‌ సమీపంలో ఇద్దరు నేషనల్‌ గార్డ్స్‌పై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఇద్దరు సైనికులు మరణించారని విశ్వసనీయ సమాచరం. కాల్పుల తర్వాత వైట్ హౌస్ లాక్ చేశారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిగినప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. 500 మంది నేషనల్ గార్డ్స్‌ను వైట్ హౌస్ ప్రాంతానికి పంపాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు. […]
Read more

హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం… 44 మంది మృతి!

చైనా: హాంకాంగ్‌లో పెను విషాదం జరిగింది. అక్కడి తాయ్ పో ప్రాంతంలో ఉన్న వాంగ్ ఫుక్ కోర్ట్ అపార్ట్‌మెంట్లలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 44 మంది సజీవదహనమయ్యారు. వందలాది మంది ఆచూకీ తెలియలేదు. అగ్నికీలలో ఇంకా మండుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండువేల అపార్ట్‌మెంట్ యూనిట్లతో కూడిన ఎనిమిది భవనాల సముదాయంలో బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన అగ్నిప్రమాదం ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన, ఎత్తైన నివాస […]
Read more

చలికాలంలో పాలస్తీనియన్ల గుడారాలను ముంచెత్తిన వరదలు!

గాజా: అసలే చలికాలం…ఆపై వరదలు ముంచెత్తడంతో గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. మంగళవారం గాజా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా వరదలు వచ్చాయితో. దీంతో వేలాది మంది నిరాశ్రయులైన పాలస్తీనియన్ల గుడారాలు మునిగిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే గాజా ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ మారణహోమంతో గాజాలోని 2 మిలియన్ల మందితమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది, ఇప్పుడు చాలామంది టెంట్లు, ఇతర ప్రాథమిక ఆశ్రయాలలో నివసిస్తున్నారు. అక్టోబర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా… యుద్ధం గాజాను ఓ శిథిల […]
Read more
1 21 22 23 24 25 51

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.