Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘ఆపరేషన్ సిందూర్‌’ను ఆపానన్న ట్రంప్…అయినా ప్రధాని మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ఎద్దేవా!

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌ను “ఆకస్మికంగా నిలిపివేయడానికి” సుంకాలను ఉపయోగించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “51వ సారి” చెప్పారని, అయినా మా ప్రధాన మంత్రి మౌనంగా ఉన్నారని” కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్, కమ్యూనికేషన్స్, జైరామ్ రమేష్, Xలో ఒక వీడియో లింక్‌ను షేర్‌ చేసారు. దీనిలో ట్రంప్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశం,పాకిస్తాన్ మధ్య జరిగిన వివాదంతో సహా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించడం గురించి తన వాదనను పునరావృతం చేశారు. “ఈసారి — […]
Read more

రాజకీయ దుమారం రేపుతున్న హర్యానా దళిత ఐపీఎస్ అధికారి మరణం!

చండీగఢ్: ఉన్నతాధికారుల కుల వివక్షకు తాళలేక సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం హర్యానాలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ తుఫానుకు దారితీశాయి. ఈ సంఘటన ప్రభావం వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న బీహార్‌కు చేరుకుంది. ఒక సీనియర్ పోలీసు అధికారి మరణం వ్యవస్థను కుదిపేసింది. ఉన్నత స్థాయి అధికార వర్గాలలో కూడా కుల వివక్ష కొనసాగడంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. కానీ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హర్యానాలోని భారతీయ జనతా పార్టీ […]
Read more

ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించండి…సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసిన ప్రియాంక్ ఖర్గే!

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రాంగణాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. ఇటువంటి చర్యలు భారతదేశ ఐక్యతకు మరియు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 4న ముఖ్యమంత్రికి రాసిన లేఖలో…రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన శాఖలను ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక పాఠశాలలతో పాటు బహిరంగ ప్రదేశాలలో నడుపుతోందని ఆరోపించారు. అక్కడ “పిల్లలు, యువత మనస్సులలో ప్రతికూల ఆలోచనలు నాటుతున్నారని” కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే […]
Read more

దేశంలో లక్షకు పైగా సింగిల్‌ టీచర్‌ స్కూళ్లే…ఓ సర్వేలో వెల్లడి!

న్యూఢిల్లీ: నేటి బాలలే రేపటి పౌరులు. పాఠశాలలు విద్యార్థుల అభివృద్ధికి మొదటి మెట్టు… వంటి నినాదాలు మన చెవులకు ఇంపుగా అనిపిస్తాయి. అయితే పేద పిల్లలు ఎక్కుగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వారికి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతో ఉంది. తగు సంఖ్యలో పాఠశాలలు ఏర్పాటు చేయడం, టీచర్లు, సిబ్బందిని నియమించడం, సౌకర్యాలు, వసతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో విద్యావ్యవస్థ ఎలా ఉందనే విషయంపై చేసిన సర్వేలో […]
Read more

ఐపీఎస్ అధికారి ఆత్మహత్య…హర్యానా పోలీస్ ఉన్నతాధికారులపై అభియోగాలు!

చండీగడ్‌: హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్ మరణానికి సంబంధించి పోలీస్‌ ఉన్నతాధికారులు శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్‌తక్‌ ఎస్‌పీ నరేంద్ర బిజార్నియాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అంతేకాదు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసారు. కాగా, 2001 బ్యాచ్ అధికారి పూరన్‌ కుమార్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనిమిది పేజీల సూసైడ్ నోట్‌లో, సీనియర్ అధికారులు తనను “మానసిక వేధింపులకు” గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆ అధికారి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారని, […]
Read more

బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌…ఆధార్‌పై BLOల సందేహాలను నివృత్తి చేసిన ఈసీ!

కోల్‌కతా: ఓటరు జాబితా వెరిఫికేషన్‌ సందర్భంగా ఓటరు గుర్తింపు కోసం ప్రస్తుతం పరిశీలిస్తున్న 11 ధ్రువపత్రాలతోపాటు ఆధార్‌ను కూడా చేర్చాలంటూ ఈ నెల 8న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో SIR సంసిద్ధతను సమీక్షించడానికి ఆ రాష్ట్రానికి వచ్చిన ఈసీ బృందం సవరణ ప్రక్రియలో ఆధార్ కార్డుల చెల్లుబాటుకు సంబంధించి బూత్-స్థాయి అధికారులు (BLOలు) లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ భారతి నేతృత్వంలోని కేంద్ర ECI […]
Read more

భూగర్భ జలాల రీఛార్జ్…JNTUHను సందర్శించిన మధ్యప్రదేశ్ ప్రతినిధి బృందం!

హైదరాబాద్: భూగర్భ జలాల రీఛార్జ్ పద్ధతులు, నిర్వహణపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న  33 మంది సభ్యుల మధ్యప్రదేశ్ బృందం, భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలను అధ్యయనం నిమిత్తం JNTUH క్యాంపస్‌ను సందర్శించింది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు చెందిన జల వనరుల అభివృద్ధి విభాగం నిర్వహించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ మిషన్ ఫర్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ స్పాన్సర్ చేసింది. పర్యావరణ […]
Read more

సీజేఐపై దాడి చేసిన వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత!

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి ప్రయత్నించిన సస్పెండ్ అయిన న్యాయవాది రాకేష్ కిషోర్‌ను బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, BJP నేత భాస్కర్ రావు రాజకీయంగా కలకలం సృష్టించారు. కోర్టు కార్యకలాపాల సమయంలో CJI పై షూ విసిరేందుకు ప్రయత్నించిన వ్యక్తి రాకేష్ కిషోర్‌ను వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) వెంటనే సస్పెండ్ చేసింది. రాజకీయ వర్గాలలో విస్తృతంగా ఖండనలు ఎదుర్కొన్నప్పటికీ, కిషోర్ […]
Read more

హిమాచల్‌లో ఘోర ప్రమాదం…టూరిస్ట్‌ బస్‌పై విరిగిపడ్డ కొండచరియలు!

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఓ టూరిస్టు బస్సు ధ్వంసమై ఏకంగా 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో డ్రైవర్‌,కండక్టర్‌ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. విరిగిపడ్డ కొండచరియలు బస్సును పూర్తిగా కప్పేశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, బాలాఘాట్‌ […]
Read more

విషాదంగా మారిన విహారయాత్ర!

బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. సెలవుల్లో సరదాగా గడపాల్సిన విహారయాత్ర కాస్తా విషాదకరమైంది. మార్కోనహళ్లి ఆనకట్ట దిగువన పిక్నిక్‌కు వెళ్లిన ఏడుగురు వ్యక్తులు నీటి ప్రభావం ధాటికి కొట్టుకుపోయారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీసారు. ఒక్కరిని రక్షించారు. తుమకూరు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ వెల్లడించిన సమాచారం ప్రకారం…తుముకూరు నుండి దాదాపు 15 మంది పిక్నిక్ కోసం ఆనకట్ట దగ్గరికి వెళ్లారు. సైఫన్ వ్యవస్థ అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో మహిళలు, పిల్లలు సహా ఏడుగురు శక్తివంతమైన […]
Read more
1 20 21 22 23 24 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.