Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మణిపూర్ ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం

ఇంఫాల్‌: మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఖేమ్‌చంద్‌ సింగ్‌ నిన్నప్రమాణ స్వీకారం చేశారు. 62 ఏండ్ల బీజేపీ శాసనసభ్యుడైన ఖేమ్‌చంద్‌ చేత గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లా పదవీ ప్రమాణం చేయించారు. కాగా, కుకీ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్‌జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసనసభ్యుడు ఎల్ డిఖో మణిపూర్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన గోవిందాస్ కొంతౌజం, ఎన్‌పీపీకి చెందిన కె లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణ […]
Read more

ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడొద్దన్నారని యూపీలో ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య!

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి భారత్‌సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ముగ్గురు అక్కా చెల్లెళ్లు తమను ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడొద్దన్నారని 9వ అంతస్తునుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొరియన్‌ లవ్‌గేమ్‌ అనే మొబైల్‌ గేమ్‌కు బాగా అలవాటు పడ్డారని విచారణలో తేలింది. కాగా, ఘజియాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున తొమ్మిదో అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుండి దూకి ముగ్గురు మైనర్ సోదరీమణులు మరణించారని, ఆన్‌లైన్ కొరియన్ గేమ్‌కు బానిసలవడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు […]
Read more

ఛత్తీస్‌గఢ్‌లో ఘర్షణలు… ముస్లింల ఇళ్లు ధ్వంసం!

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా… దుట్కైయా గ్రామంలో ఘర్షణలు చెలరేగిన తరువాత పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఫలితంగా ముస్లింల ఇళ్లను దహనం చేయడంతో సహా అనేక మంది గాయపడ్డారు. పోలీసు సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. కనీసం 10 ఇళ్లకు నిప్పంటించారు, మూడు నుండి నాలుగు వాహనాలను తగలబెట్టారు. కాగా, పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పోలీసు నివేదికల ప్రకారం…రెండేళ్ల క్రితం ఒక గ్రామంలోని ఆలయాన్ని ధ్వంసం చేశాడని […]
Read more

నమాజ్ చేశారనే ఆరోపణలపై యూపీలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్!

లక్నో: మధురలోని నౌజీల్ బ్లాక్‌లో కొత్త వివాదం చెలరేగింది, పాఠశాల సమయంలో విద్యార్థులను నమాజ్ చేయించారని ఆరోపిస్తూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్ మొహమ్మద్‌ను సస్పెండ్ చేశారు. స్థానిక భారతీయ జనతా పార్టీ (బిజెపి) మండల అధ్యక్షుడు దుర్గేష్ ప్రధాన్ చేసిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (బిఇఓ) రతన్ కీర్తి జనవరి 31న సస్పెన్షన్ ఉత్తర్వు జారీ చేశారు. అధికారుల ప్రకారం…పాఠశాల ఆవరణలో పిల్లలను నమాజ్ చేయిస్తున్నారని ఆరోపణలపై ప్రభుత్వం […]
Read more

‘నా పేరు మహమ్మద్ దీపక్’…ముస్లిం దుకాణదారుడిని భజరంగ్‌దళ్ మూక నుండి కాపాడిన హిందూ వ్యక్తి!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ హిందూ జిమ్ యజమాని, హిందూ అతివాద సంస్థ బజరంగ్ దళ్ సభ్యులతో కూడిన ఓ గుంపు నుండి … ముస్లిం దుకాణదారుడిని రక్షించినందుకు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన వీడియోలో రికార్డ్ అయింది. అప్పటి నుండి ఇంటర్‌నెట్‌లో బాగా వైరల్ అయింది. “నేను హిందువును కాదు, ముస్లింను కాదు, సిక్కును కాదు, క్రైస్తవుడిని కాదు. అన్నింటికన్నా ముందు నేను ఒక మనిషిని. చనిపోయిన తర్వాత నేను జవాబు చెప్పాల్సింది దేవుడికి, […]
Read more

సీఈసీ అబద్ధాలకోరు, అహంకారి అని ఘాటుగా విమర్శించిన మమతా బెనర్జీ!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఘాటు విమర్శలు చేశారు. ‘అహంకారి, అబద్ధాలకోరు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ఆదేశాల మేరకే ఈసీఐ పనిచేస్తోందని ఆరోపించారు. న్యూఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ (ప్రధాన కార్యాలయంలో సీఈసీతో గంటసేపు జరిగిన సమావేశం తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ… తాను ఏడు పర్యాయాలు ఎంపీగా, నాలుగు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశానని, కానీ CEC నుండి అలాంటి ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. […]
Read more

బడ్జెట్ రోజున స్టాక్‌మార్కెట్ పతనాన్ని కొట్టిపారేసిన ప్రధాని ఆర్థిక సలహాదారు!

న్యూఢిల్లీ: లోక్‌సభ నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై స్టాక్‌ మార్కెట్ ప్రతికూల స్పందన, బడ్జెట్ ఫలితానికి సూచిక కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఎన్‌డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తన తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ఆదివారం మార్కెట్లు పడిపోయాయి — ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అనడానికి స్పష్టమైన ఉదాహరణగా ప్రతిపక్షాలు ఈ పరిస్థితిపై వ్యాఖ్యానించాయి. దాదాపు రూ. 10 లక్షల […]
Read more

జమ్మూ కాశ్మీర్‌లో 4.7 తీవ్రతతో భూకంపం!

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు ఉదయం 5.35 గంటలకు సంభవించాయని, పటాన్ ప్రాంతం దీని కేంద్ర బిందువు అని వారు చెప్పారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. కానీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప ప్రభావం కేవలం బారాముల్లాకే పరిమితం కాకుండా, గుల్బార్గ్, శ్రీనగర్ పశ్చిమ ప్రాంతాల్లో […]
Read more

షర్జీల్ ఇమామ్ సహా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్!

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి షర్జీల్ ఇమామ్ అరెస్టు అయిన ఆరేళ్ల తర్వాత… ఆయన విడుదల కోసం కార్యకర్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థులు, పార్లమెంటేరియన్లు పిలుపునిచ్చారు. మైనారిటీ రాజకీయ స్వరాలను లక్ష్యంగా చేసుకోవడంలో షర్జీల్‌ జైలు శిక్ష భాగమని పేర్కొన్నారు .రాజకీయ అసమ్మతివాదులను దీర్ఘకాలం నిర్బంధించడం, భారతదేశంలో ప్రజాస్వామ్య నిరసనలకు స్థలం తగ్గిపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హర్ష్ మందర్ మాట్లాడుతూ… 2020 ఢిల్లీ అల్లర్లను ఒక వ్యవస్థీకృత […]
Read more

ఎన్‌సిపి విలీనం తథ్యమా?…శరద్, సుప్రియా సూలేతో చర్చలు!

బారామతి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)ని శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయా? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు దాదాపు 40 ఏళ్లుగా సన్నిహితుడు, సహాయకుడిగా ఉన్న కిరణ్ గుజార్ మాటలు నమ్మితే, ఇది త్వరలోనే జరగబోతోందని తెలుస్తోంది. 1980వ దశకం మధ్యలో పవార్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందే ఆయనతో అనుబంధం ఉన్న గుజార్, తనను బలిగొన్న విమాన ప్రమాదానికి కేవలం ఐదు రోజుల ముందు పవార్ ఈ విషయం గురించి […]
Read more
1 21 22 23 24 25 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.