Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మణిపూర్‌లో దుండగులకు ఆయుధాలు సరఫరా చేసారని ఓ ఎమ్మెల్యేపై అభియోగం!

ఇంఫాల్: మణిపూర్‌లో దుండగులకు ఆయుధాలు సరఫరా చేసారని ఓ ఎమ్మెల్యేపై మైతీ వర్గానికి చెందిన అత్యున్నత కమిటీ అభియోగం మోపింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే నుండి తక్షణ స్పందన రాలేదు. ఈ అభియోగంపై అతన్ని సంప్రదించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. సదరు”ఎమ్మెల్యే అనేక సమావేశాలు నిర్వహించాడు… ఆర్థిక సహాయం, ఆయుధాలతో దుండగులకు మద్దతు ఇచ్చాడు. కానీ ముస్లింలు మెయిటీలతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నారు. కాబట్టి అతని ప్రణాళిక విఫలమైంది” […]
Read more

నాలుగు దశాబ్దాలుగా మసీదులో ఇఫ్తార్ విందు ఇస్తోన్న చెన్నైలోని సూఫీ ఆలయం!

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని సూఫీ ఆలయం 40 సంవత్సరాలకు పైగా రంజాన్ నెలలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇస్తోంది. తద్వారా సర్వమత సామరస్యానికి చిహ్నంగా నిలిచింది. 1947లో భారత విభజన తర్వాత సింధ్ నుండి చెన్నైకి తరలివచ్చిన వచ్చిన హిందూ శరణార్థి దాదా రతన్‌చంద్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. రంజాన్ నెలలో ప్రతి రాత్రి, సూఫీ ఆలయం నుండి వాలంటీర్లు ట్రిప్లికేన్‌లోని వల్లజా మసీదుకు వచ్చి ఇఫ్తార్‌ సమయంలో ఉపవాసీలకు శాఖాహార వంటకాలు అందిస్తారు. […]
Read more

ఔరంగజేబు సమాది వివాదం…నాగపూర్‌లో హింస!

ముంబయి: మహారాష్ట్ర శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత నాగ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం హింసాత్మక ఘర్షణలు జరిగాయి, 30 మందికి పైగా గాయపడ్డారు. హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆరోపించింది. నగరంలోని మహల్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన భారీ ఘర్షణ తర్వాత దాదాపు 60 నుండి 65 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. […]
Read more

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద భారీ నిరసన!

న్యూ ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) భారీ నిరసనను నిర్వహించింది. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విభిన్న నేపథ్యాల నుండి వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, AAP, AIMIM, CPI, CPI(ML), CPM, IUML, NCP, TMC, BJD, WPI వంటి వివిధ ముస్లిం సంస్థలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు […]
Read more

బెంగాల్‌లో కుల వివక్ష… ఆలయ ప్రవేశం కోసం పోరాటం చేస్తున్న ‘దాస్’ వర్గీయులు!

కోల్‌కత పశ్చిమ బెంగాల్‌లో ఓ భూస్వామి నిర్మించిన గిదేశ్వర్ శివాలయం, గ్రామ కుల సోపానక్రమానికి ప్రతిరూపం. శతాబ్దాల క్రితం ఆ జమీందార్‌ 60 బిఘాల భూమిని ఈ ఆలయం కోసం దానం చేసాడు. వివిధ వర్గాలకు భూమితో పాటు విధులను కేటాయించారు. జమీందారు స్థాపించిన గిదేశ్వర్ శివాలయంలో బ్రాహ్మణులు ఆచారాలను చూసుకుంటారు, ఘోష్ సమాజం పాలను, మలకర్ సమాజం పువ్వులు సరఫరా చేస్తుంది, బయాన్లు సంగీతానికి బాధ్యత వహిస్తారు. మరోవంక తరతరాలుగా ఆలయ భూమిలో నివసించే దాస్ […]
Read more

హోలీ రంగులను నిరాకరించిన ముస్లిం వ్యక్తిపై దాడి…హత్య!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా తనపై రంగుజల్లడాన్ని నిరాకరించిన ముస్లిం వ్యక్తిపై అక్కడి గుంపు దారుణంగా దాడి చేశారు. కొత్వాలి సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో 55 ఏళ్ల మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తిని హోలీ వేడుకలు జరుపుతున్న వ్యక్తులు అడ్డగించారు. అతనిపై బలవంతంగా రంగులు వేయడానికి ప్రయత్నించారు. అతను ప్రతిఘటించగా ఆ బృందం అతనిపై దాడులకు పాల్పడింది. చేసింది. షరీఫ్ అక్కడి నుండి తప్పించుకోగలిగినప్పటికీ, అతనికి […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ముస్లి పర్సనల్ లా ఆధ్వర్యంలో ధర్నా!

హైదరాబాద్‌: కొంతకాలంగా వక్స్ ఆస్తులకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముస్లిం సంస్థలు, పౌర సంఘాలు, విపక్ష సభ్యులు వక్స్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇదేమీ పట్టకుండా ప్రస్తుత లోకసభ సమావేశాలలోనే బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ ముస్లిం పర్సనల్ లా బోర్డు’ ధర్నాకు పిలుపునిచ్చింది. ప్రతిపాదిత చట్టం వక్ఫ్ ఆస్తులను “ఆక్రమణ” చేయడానికి […]
Read more

హోలీ- రంజాన్ పండుగలపై బాపూజీ మాటలను గుర్తుంచుకోవాల్సిన సమయం ఇది!

హైదరాబాద్‌: జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితపు చివరి శ్వాస వరకు హిందూ-ముస్లిం ఐక్యతను సమర్థించారు. అంతేకాదు అహింసను ఒక శక్తివంతమైన మార్గంగా, సత్యం, న్యాయం కోసం పోరాడే సాధనంగా భావించారు, దీనిని ఆయన తన స్వతంత్రోద్యమంలో విజయవంతంగా ఉపయోగించారు. నిరంతర ప్రాతిపదికన అహింస ఆదర్శాన్ని ఆచరించడాన్ని ఒక ముఖ్యమైన షరతుగా భావించారు. అహింస ధర్మం స్పూర్తితో, వివిధ మతాల ప్రజలు తమ తమ పండుగలను జరుపుకోకుండా ఎప్పుడూ నిరోధించకూడదని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ […]
Read more

మణిపూర్‌లో నిరవధిక బంద్‌ను విరమించిన కుకి-జో కౌన్సిల్!

ఇంఫాల్ : మణిపూర్‌లోని కొండ ప్రాంతాలలో మార్చి 9 అర్ధరాత్రి నుండి కొనసాగుతున్న నిరవధిక బంద్‌ను కుకి-జో కౌన్సిల్ ఎత్తివేసింది, అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన స్వేచ్ఛా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నామని కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎందుకంటే ఇది న్యాయ ప్రక్రియను బలహీనపరుస్తుందని ప్రకటనలో పేర్కొంది. కాగా మణిపూర్‌లో ప్రజా రవాణా పునరుద్ధరణను వ్యతిరేకిస్తూ… కుకీ వర్గం నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మార్చి 1న, మార్చి 8 నుండి మణిపూర్‌లోని […]
Read more

ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్‌ సమావేశానికి వెళ్తానన్న కేటీఆర్‌!

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌…ఈనెల 22న తమిళనాడు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. డీలిమిటేషన్ వ్యతిరేక ఉద్యమం దక్షిణాది రాష్ట్రాలలో ఆదరణ పొందుతున్నట్లు కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో డిఎంకె ప్రతినిధి బృందాన్ని కలిసిన తర్వాత కెటిఆర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. డిఎంకె ప్రతినిధి బృందానికి తమిళనాడు మంత్రి కెఎన్ నెహ్రూ, రాజ్యసభ ఎంపి ఎన్ఆర్ ఎలాంగో నాయకత్వం వహించారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాల్సిందిగా వారు బిఆర్ఎస్‌ను ఆహ్వానించారు. ఈ […]
Read more
1 37 38 39 40 41 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.