Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఫిబ్రవరి ఒకటి నుండి పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం!

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్ విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఫిబ్రవరి ఒకటవ తేదీనుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. పొగాకు, పాన్ మసాలాపై విధించే ఈ కొత్త పన్నులు జీఎస్టీ రేటుకు అదనంగా ఉంటాయి. ప్రస్తుతం ఇటువంటి హానికరమైన వస్తువులపై విధిస్తున్న పరిహార సెస్ స్థానంలోకి వస్తాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఫిబ్రవరి 1 నుండి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు […]
Read more

ఉత్తరాఖండ్‌లో రెండు రైళ్లు ఢీ… 88 మందికి గాయాలు!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లాలోని విష్ణుగడ్-పిపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఒక లోకో రైలు మరో రైలును ఢీకొన్న ఘటనలో సుమారు 88 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మంగళవారం బాగా పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాద సమయంలో రైలులో కార్మికులు, అధికారులు సహా మొత్తం 109 మంది ఉన్నారని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ తెలిపారు. వీరిలో 70 మంది గాయపడిన కార్మికులు గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. రైలులోని వారిని […]
Read more

త్రిపుర విద్యార్థి హత్యపై ‘సిట్’ ఏర్పాటు!

అగర్తల: త్రిపుర విద్యార్థి అంజెల్ చక్మా ఉత్తరాఖండ్‌ రాజధానిలో హత్యకు గురికావడంపై దర్యాప్తు చేయడానికి డెహ్రాడూన్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో జాతి వివక్షకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు. ఒక మద్యం దుకాణానికి గుంపుగా వచ్చిన వారి మధ్య జరుగుతున్న ‘పరిహాసాలను’ ఆ యువకుడు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం చెలరేగిందని, ఆ తర్వాత అతనిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈమేరకు డెహ్రాడూన్ ఎస్ఎస్‌పి అజయ్ సింగ్ […]
Read more

మధ్యప్రదేశ్‌లో కలుషిత నీరు తాగి ముగ్గురి మృతి!

ఇండోర్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కలుషిత నీరు తాగడం వల్ల ముగ్గురు మరణించారని, 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారని నగర మేయర్ తెలిపారు. డ్రైనేజీ నీరు తాగునీటి సరఫరాలోకి కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిందని, నీటి నమూనాలను పరీక్షల కోసం పంపామని అధికారులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురై నలుగురు మహిళలతో సహా ఐదుగురు మరణించారని స్థానికులు పేర్కొన్నారు. లోకల్‌ కౌన్సిలర్ […]
Read more

గుజరాత్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా హక్కు అమలు అంతంతమాత్రమే!

ఛోటా ఉదయ్‌పూర్ : గుజరాత్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా హక్కు చట్టం (RTE) అమలులో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం, నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం, పిల్లలు బడికి వెళ్ళకపోవడం, టీచర్ల కొరత, ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రధాన సమస్యలు. దీనికి జాతీయ విద్యా విధానం (NEP) కూడా తోడైంది. ఈ విధానం కింద హేతుబద్ధీకరణ ఆదివాసీ ప్రాంతాల్లో విద్యాహక్కు అమలు ఆటంకమైంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని గమనిస్తే…తూర్పు గుజరాత్‌లోని ఆదివాసీ ప్రాంతాలలో […]
Read more

ఏఐ చిత్రాలతో మధ్యప్రదేశ్‌లో జల సంరక్షణ అవార్డు గెలుచుకున్నారని ఆరోపించిన కాంగ్రెస్!

ఇండోర్/ఖండ్వా: మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఖండ్వా జిల్లా యంత్రాంగం ఏఐ (కృత్రిమ మేధస్సు) ద్వారా రూపొందించిన చిత్రాలను ఉపయోగించి జాతీయ జల సంరక్షణ అవార్డును గెలుచుకుందని కాంగ్రెస్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణను అధికారులు తోసిపుచ్చారు. కేంద్రం ‘జల్ సంచయ్, జన్ భాగీదారి’ ప్రచారం కింద జల సంరక్షణలో విశిష్ట కృషికి ఖండ్వా జిల్లా దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని పొందింది. నవంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన ఆరవ జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లాకు […]
Read more

ఉత్తరప్రదేశ్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ…ఓటర్ల జాబితా నుంచి 2.89 కోట్ల పేర్లు తొలగింపు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా నుంచి దాదాపు 2.89 కోట్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు తెలిపారు. డిసెంబర్ 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని అధికారులు చెప్పారు. ఎస్ఐఆర్ ముందు ఓటర్ల జాబితాలో 15.44 కోట్ల పేర్లు ఉండగా…తొలగింపు తర్వాత 12.55 కోట్లమంది ఉండే అవకాశం ఉంది. పేర్లు తొలగించిన వ్యక్తులు వచ్చే ఏడాది జనవరి 30లోగా అభ్యంతరాలను […]
Read more

బీజేపీ నేత కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం!

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని శివపురిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడి కుమారుడిపై గతంలో అత్యాచారం ఆరోపణలు చేసిన ఒక మహిళ… నిద్రమాత్రలు,ఎలుకల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… బీజేపీ నేత, శివపురి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు గాయత్రి శర్మ కుమారుడు రజత్ శర్మపై ఏప్రిల్ 30న సదరు మహిళ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తన పరిస్థితి వేగంగా క్షీణించడంతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. […]
Read more

క్రైస్తవులపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న తీస్తా సెతల్వాద్!

ముంబై: భారతదేశం అంతటా మితవాద సంస్థలు క్రిస్మస్ సంబంధిత దాడులకు వ్యతిరేకంగా ముంబైలోని గోరేగావ్‌లో శుక్రవారం సాయంత్రం అనేక వందల మంది నిరసన చేపట్టారు. సంవిధాన్ జాగర్ యాత్ర సమితి (SJYS), బాంబే కాథలిక్ సభ (BCS) ఈ నిరసనను నిర్వహించాయి. ఇందులో కమ్యూనిటీ సభ్యులు, పౌర సమాజ ప్రతినిధులు మత హింసను ఖండిస్తూ ప్లకార్డులతో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆందోళన వ్యక్తం చేశారు. “ఇటువంటి దాడులు శాంతిభద్రతల సమస్యలు కావు. అవి మన రాజ్యాంగం గుండెపై, […]
Read more

“ఆరాధనా స్వేచ్ఛపై దాడి జరుగుతోంది”…క్రిస్మస్ విధ్వంసంపై శశి థరూర్!

న్యూఢిల్లీ: క్రిస్మస్‌కు ముందు రోజు క్రైస్తవులపై జరిగిన దాడులను కాంగ్రెస్ అసంతృప్త ఎంపీ శశి థరూర్ ప్రస్తావిస్తూ… “సంప్రదాయాలపై దాడి జరిగినప్పుడు, అది మనందరిపై జరిగినట్లే”నని వ్యాఖ్యానించారు. కేరళలోని పాలక్కాడ్‌లో క్రిస్మస్ గీతాలు పాడే బృందంపై దాడి జరిగిందని తిరువనంతపురం ఎంపీ పేర్కొంటూ… “మన క్రైస్తవ సోదరులతో సంఘీభావం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. “నా దృష్టిలో, ఈ సంఘీభావం చాలా ప్రాథమికమైనది. ఇప్పుడు ఒక క్లిష్టమైన సమయం నడుస్తోంది. దురదృష్టవశాత్తు, దేశంలోని వివిధ ప్రాంతాలలో […]
Read more
1 38 39 40 41 42 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.