Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సోనమ్ వాంగ్‌చుక్‌పై జాతీయ భద్రతా చట్టం…జోధ్‌పూర్‌ జైలుకు తరలింపు!

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను క్రూరమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి… వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్‌పూర్‌కు ప్రభుత్వం తరలించింది. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(NSA) కింద డిజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర పాలిత […]
Read more

బాబ్రీ మసీదు నిర్మాణం ఒక ‘అపవిత్ర చర్య’…మాజీ సీజేఐ చంద్రచూడ్!

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన అయోధ్య తీర్పుకు విరుద్ధంగా, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) D.Y. చంద్రచూడ్ న్యూస్‌లాండ్రీకి వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “బాబ్రీ మసీదు నిర్మాణం (16వ శతాబ్దంలో) ఒక ప్రాథమిక అపవిత్ర చర్య” అని పేర్కొనడం కొత్త వివాదానికి దారితీసింది. జస్టిస్ (రిటైర్డ్) చంద్రచూడ్ 2019 నవంబర్‌లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అప్పటి CJI రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో సభ్యుడు కూడా […]
Read more

ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ భద్రతపై అనుమానాలు!

న్యూఢిల్లీ: నకిలీ లాగిన్లు, ఫోన్‌నంబర్లను ఉపయోగించి ఓటరుజాబితాలోని ఓట్లను తొలిగించారని ఇటీవల లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ ప్రచురించిన ఓటరు జాబితాపై పలు అనుమానాలు తలెత్తాయి. సాఫ్ట్‌వేర్‌ సాయంతో కేంద్రీకృత పద్ధతిలో ఓట్ల చోరీకి అవకాశం ఉందా అంటూ సందేహాలు బయలుదేరాయి. రాహుల్‌ గాంధీ ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, ఎన్నికల కమిషన్ ఆసక్తికరంగా రెండు స్వరాలలో మాట్లాడింది. మొదట అది అతని ఆరోపణలను “తప్పు, నిరాధారమైనది” అని ఖండించినప్పటికీ, మరో రోజు […]
Read more

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల దోషికి ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే!

హైదరాబాద్: పుష్కరం క్రితం అంటే 2013 దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషి అసదుల్లా అక్తర్ ఉరిశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. 2016లో ప్రత్యేక NIA కోర్టు అక్తర్ కు మరణశిక్ష విధించగా, ఈ ఏడాది ఏప్రిల్ 8న తెలంగాణ హైకోర్టు అతడి శిక్షను ధ్రువీకరించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) […]
Read more

‘సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలు అల్లరి మూకలను రెచ్చగొట్టాయి’…లడఖ్ హింసపై కేంద్రం ఆరోపణ!

లేహ్/న్యూఢిల్లీ: లడఖ్‌లో జరిగిన ఘర్షణలకు సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలే కారణమని కేంద్రం ఆరోపించింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. 70 మంది గాయపడ్డారు. “నిరాహార దీక్షను విరమించాలని చాలా మంది నాయకులు కోరినప్పటికీ, వాంగ్‌చుక్‌ కొనసాగించాడు. “అరబ్ స్ప్రింగ్, నేపాల్ తరహా నిరసనలు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న ఉదయం 11:30 గంటల సమయంలో, వాంగ్‌చుక్ ప్రసంగాలతో ప్రేరేపితులైన ఆందోళనకారులు దీక్షా శిబిరం నుంచి […]
Read more

లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్వామీజీపై కేసు నమోదు…పరారీలో గాడ్‌మ్యాన్‌!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపు ఆరోపణలు కలకలం రేపాయి. ఇక్కడి ఓ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అనేక మంది మహిళా విద్యార్థులు ఈ మేరకు ఆశ్రమ స్వామీజీపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు స్వయం ప్రకటిత కీచక దేవుడిపై కేసు నమోదు చేశారు. అయితే సదరు స్వామీజీ మాత్రం నిఘా ఉన్నప్పటికీ పోలీసులు కళ్లుగప్పి చల్లగా జారుకున్నాడు. ఆగస్టు 4న వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో […]
Read more

ప్రజలు అసహనానికి గురైతే పరిస్థితులు అదుపు తప్పుతాయి…పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్!

శ్రీనగర్‌: లడఖ్‌ ప్రాంతానికి రాజ్యాంగ రక్షణలు కోరుతున్న అక్కడి పౌర సమాజ నాయకులు అక్టోబర్ 6న చర్చలకు తమను పిలవాలనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం “ఏకపక్షం” అని అన్నారు. లేహ్‌లో స్థానికులు చేస్తున్న నిరాహార దీక్ష 13వ రోజుకు చేరినందున మంత్రిత్వ శాఖ త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉండాలని వారు అన్నారు. వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు స్థానికులు కూడా లేహ్‌లో నిరాహార దీక్ష చేస్తున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, కేంద్ర […]
Read more

ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన హిందూ పూజారి…కేరళలో కేసు నమోదు!

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పతనంతిట్ట పండలంలో హిందూత్వ గ్రూపులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ రామదాస మిషన్ అధ్యక్షుడు శాంతానంద శబరిమల వావర్‌పై విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. వావర్‌ను దాదాపు 30 సంవత్సరాల క్రితం శబరిమలలోనే స్థాపించారని,ఆ దేవతను అయ్యప్ప స్వామితో ముడిపెట్టకూడదని పూజారి ఆరోపించారు. “వావర్ ఒక ముస్లిం ఆక్రమణదారుడు, అయ్యప్పపై దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాది” అని ఆయన అన్నారు. ఆ దేవతకు అయ్యప్ప స్వామితో సంబంధం ఉండకూడదని పూజారి ఆరోపించారు. అప్పుడు ఆయన […]
Read more

ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లు…ఉత్తరప్రదేశ్‌ ఓటర్‌లిస్ట్‌లో భారీ కుంభకోణం!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితాలో భారీ ఓట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మహోబా జిల్లా జైత్‌పూర్ గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒకే ఇంటి చిరునామా కింద ఏకంగా 4,271 మంది ఓటర్లు నమోదవ్వడం పెద్ద సంచలనంగా మారింది. ఈ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,069 కాగా, దాదాపు నాలుగో వంతు ఓటర్లు ఒకే ఇంటికి ట్యాగ్ కావడం స్థానికులను, ప్రజాప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. […]
Read more

దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టేందుకు సిద్ధమైన ఎన్నికల కమిషన్‌!

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 30 నాటికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం సిద్ధం కావాలని భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. అక్టోబర్‌లో నవంబర్ మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల (CEOలు) సమావేశంలో, ఎన్నికల కమిషన్‌లోని ఉన్నతాధికారులు సెప్టెంబర్ 30 లోపు SIR కోసం సిద్ధం కావాలని ఆదేశించారని అధికారులు ధృవీకరించారు. 2008లో ఢిల్లీలో, 2006లో ఉత్తరాఖండ్‌లో, […]
Read more
1 2 3 4 5 6 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.