Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కర్ణాటకలో మైనారిటీ హక్కుల సాధనకు ఉమ్మడి వేదిక!

బెంగళూరు: మైనారిటీ హక్కుల సాధనకు కర్ణాటక ముస్లిం, క్రైస్తవ నాయకులు సంయుక్త వేదికను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈమేరకు మైనారిటీ వర్గాలకు సంబంధించిన సమస్యలపై కలిసి పనిచేయడానికి, రాజ్యాంగ హక్కులు, మత సామరస్యం కోసం వాదించడానికి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించడానికి కర్ణాటకలోని ముస్లిం, క్రైస్తవ నాయకులు అంగీకరించారు. బెంగళూరులోని ఆర్చ్‌బిషప్ హౌస్‌లో, కర్ణాటక రీజియన్ ముస్లిం ఒక్కుట (KRMO) కార్యనిర్వాహకులు, బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచాడో, ఇతర క్రైస్తవ ప్రతినిధుల మధ్య […]
Read more

జర్నలిస్టుల నోరుమూయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది… అఖిలేష్‌ యాదవ్‌!

లక్నో: ఓ పత్రికా సమావేశంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించడానికి ప్రయత్నించినందుకు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఒక “నిజాయితీగల మహిళా జర్నలిస్టు”ను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. జర్నలిస్టులు ‘మౌన శ్రోతలుగా’ (Silent Listeners) ఉండాలని బీజేపీ కోరుకుంటోందని అఖిలేష్ తీవ్రంగా విమర్శించారు. “‘నారీ వందనం’, ‘స్వతంత్ర జర్నలిజం’ రెండింటికీ సవాలుగా నిలుస్తున్న ఉత్తర ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం, యంత్రాంగం, కేవలం ముఖ్యమంత్రిని ఒక ప్రశ్న అడగాలనుకున్నందుకే […]
Read more

భారత విద్యా వ్యవస్థ యువతరాన్ని నిరాశపరుస్తోంది… రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: భారత విద్యా వ్యవస్థ యువత ఆశలను వమ్ము చేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీక్‌లు, విపరీతంగా పెరుగుతున్న ఫీజులు, శిథిలావస్థకు చేరుతున్న మౌలిక వసతుల కారణంగా విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని ఆయన పేర్కొన్నారు. భారత విద్యా వ్యవస్థ ఏ తరాన్ని అయితే ఉన్నత స్థాయికి తీసుకురావాలో అనుకుంటుందో, అదే తరాన్ని విఫలం చేస్తోంది. అయితే, ప్రతిరోజూ దాని వైఫల్యాలను అనుభవిస్తున్న వారి మాటలు వినడం […]
Read more

హింస, అహంకారం ఫ్యాషన్‌గా మారుతున్నాయి… రాహుల్‌గాంధీ!

న్యూఢిల్లీ: మణిపురి సంగీతకారుడు చోంగ్థమ్ విక్రమ్ సింగ్‌కు లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా “తరచుగా” జరుగుతున్న హింస, వివక్షలో భాగంగానే ఆయన హత్య జరిగిందని ఆరోపించారు. “కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు హత్యతో ముగియదు, మరికొన్ని సార్లు అవమానాలు, బెదిరింపులు, హింసతో ముగుస్తుంది. మన దేశంలో ఇది చాలా తరచుగా జరుగుతోందని” చోంగ్థమ్ సింగ్‌ స్మారక సభలో రాహుల్‌ గాంధీ […]
Read more

‘SIR’ ఓ ‘రక్తపాతరహిత మారణహోమం’… ప్రకాష్ రాజ్‌!

హైదరాబాద్: భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ ‘రక్తపాతరహిత మారణహోమం’ (Bloodless Genocide) గా అభివర్ణించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల వ్యవస్థలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న హైదరాబాద్‌లోని లమాకాన్‌లో పాలస్తీనా రచయిత్రి ఇబ్తిసామ్ అజెమ్ రాసిన “ది బుక్ ఆఫ్ డిసప్పియరెన్స్” నవల తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించాక… ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “రక్తపాతం లేకుండా ఒక మారణహోమం జరుగుతోంది. వారు దాదాపు 12 […]
Read more

‘వీసీ గో బ్యాక్‌’… ఢిల్లీ వర్సిటీ విద్యార్థుల నినాదాలు!

న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ఫ్యాకల్టీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వైస్-ఛాన్సలర్ యోగేష్ సింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్ధులు నిరసన వ్యక్తం చేసారు, ‘వీసీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు కూడా చేశారు. సత్య నికేతన్‌లో విద్యార్థులు నివసిస్తున్న పీజీ హాస్టల్‌ భవనం కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థులు మరణించిన ఘటనపై, అధికారికంగా సంతాప దినాలు ప్రకటించనందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పాలక కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. DU విద్యార్థులకు ప్రైవేట్ పీజీ వసతి కల్పిస్తున్న ఆ […]
Read more

మహారాష్ట్రలో గొడవ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా పండ్ల వ్యాపారి మృతి!

ముంబయి: మహారాష్ట్రలోని థానే జిల్లాలో, ఒక మహిళ వద్ద తీసుకున్న అప్పు విషయంలో జరిగిన గొడవ అనంతరం… ఒక పండ్ల వ్యాపారి ఫిర్యాదు చేయడానికి ఆటోలో పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేసి, ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. మరణించిన వ్యక్తి భివాండీకి చెందిన యాకూబ్ సిద్ధిఖీ; అతను మూడు, నాలుగేళ్ల క్రితం ఆ మహిళ వద్ద డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు […]
Read more

ఆరుగురు నాగా యువకుల అపహరణ కేసులో కుకీ కానిస్టేబుల్ సస్పెన్షన్!

ఇంఫాల్‌: మణిపూర్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఆరుగురు నాగా యువకుల అపహరించి హత్యచేసారన్న ఆరోపణలపై విధుల్లో ఉన్న కుకీ వర్గానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. కాగా, సస్పెండ్‌ అయిన కానిస్టేబుల్‌ లోయలోని బిష్ణుపూర్ పోలీసులతో ఉండేవాడు, కానీ ఘర్షణల కారణంగా కొండ ప్రాంతంలోని కాంగ్‌పోక్పి హిల్ జిల్లాకు బదిలీ అయ్యాడు. ఈ కేసులో కానిస్టేబుల్ ప్రమేయం ఉందనే ఆరోపణలపై పోలీసులు జూలై 6 నుంచే దర్యాప్తు చేస్తున్నారు. ఈ […]
Read more

ఇస్రో మిషన్ డైరెక్టర్‌గా బీహారి బిడ్డ ఇంతియాజ్ అహ్మద్!

ముహమ్మద్ ముజాహిద్…✍️ సాధారణ కుటుంబం నుంచి వచ్చి, చిన్నతనంలో ఆకాశంలో ఎగిరే రాకెట్లను చూసి అబ్బురపడిన ఆ బాలుడి కల నేడు నిజమైంది. కఠిన శ్రమ, పట్టుదల ఉంటే ఏ సామాన్యుడైనా సరే… దేశం గర్వించదగ్గ ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన మరోసారి నిరూపించారు. ఆయనే భారతదేశపు ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇంతియాజ్ అహ్మద్. బీహార్‌లోని దర్భంగా జిల్లా, రేవధా అనే మారుమూల గ్రామానికి చెందిన ఇంతియాజ్ అహ్మద్… […]
Read more

మణిపురి సంగీతకారుడి మృతిపై దర్యాప్తును వేగవంతం చేయండి…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీతకారుడు, గిటారిస్ట్ చోంగ్తామ్ విక్రమ్ సింగ్ ఢిల్లీలో దారుణ హత్యకు గురికావడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు, ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈశాన్య ప్రాంత ప్రజలకు సంబంధించి పెరుగుతున్న అరాచక పరిస్థితులపై ఆయన కేంద్ర హోం శాఖ, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. ‘ఎక్స్’ (X) వేదికగా స్పందించిన రాహుల్ […]
Read more
1 2 3 4 5 107

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.