Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శనపై CBFC అభ్యంతరం!

న్యూఢిల్లీ: జైలులో ఉన్న సామాజిక కార్యకర్త ఉమర్ ఖాలిద్‌పై రూపొందించిన డాక్యుమెంటరీని IIIT-హైదరాబాద్‌లో ప్రదర్శించాలన్న ప్రతిపాదనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిన్న అభ్యంతరం తెలిపింది. ప్రత్యేక మినహాయింపు పొందితే తప్ప, ధృవీకరణ లేని చిత్రాన్ని బహిరంగంగా ప్రదర్శించడం సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని CBFC పేర్కొంది. చిత్రనిర్మాత లలిత్ వచాని దర్శకత్వం వహించిన “”Prisoner No. 626710 is Present” అనే ఈ డాక్యుమెంటరీని, సెప్టెంబర్ 18, శుక్రవారం రాత్రి 8 గంటలకు […]
Read more

బ్రిక్స్ సదస్సు…భారత ఆశయాలపై బీజేపీ పరిమితులు!

పుష్పరాజ్‌ దేశ్‌పాండే…✍️ న్యూఢిల్లీ: బ్రిక్స్ ఒక నూతన ప్రపంచ వ్యవస్థను కలలు కంటుండవచ్చు, కానీ ఆ వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై ఏకాభిప్రాయానికి రావడం ఎంత కష్టమో దాని తాజా శిఖరాగ్ర సమావేశం స్పష్టం చేసింది. ఒకవైపు, 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సరిహద్దు ఉగ్రవాదంపై ఏకాభిప్రాయాన్ని సాధించింది, పశ్చిమ ఆసియా సంక్షోభంపై 11 సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని కుదర్చింది, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ప్రాథమిక చర్చలకు మార్గం సుగమం చేసింది. ఈ […]
Read more

ఉమర్ ఖాలిద్ అంటే భయమెందుకు?’ విచారణ జరపాలని మోదీ, షాలను కోరిన ప్రియాంక్ ఖర్గే!

న్యూఢిల్లీ: జైలులో ఉన్న విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖాలిద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నారని, ధైర్యం ఉంటే విచారణను ముందుకు తీసుకెళ్లాలని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే సవాల్ విసిరారు రు. ఖాలిద్‌పై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను వ్యతిరేస్తున్న అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)ను కూడా ఖర్గే విమర్శించారు. ఆ మితవాద విద్యార్థి సంస్థ విద్యా సంస్కరణల వంటి నిర్మాణాత్మక అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. “ఉమర్ […]
Read more

యూపీఐ ఛార్జీలు.. ట్రంప్ ముందు మోడీ ‘సాగిలపడ్డారని’ రాహుల్ ఎద్దేవా!

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ‘సాగిలపడ్డారని’ ఆరోపించారు. కొన్ని యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం, అమెరికాకు ‘భారీ మొత్తంలో డబ్బు’ ఇవ్వడమేనని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ఆయన X అనే వెబ్సైట్లో ఒక వీడియో పోస్ట్ చేసారు, ‘అమెరికా ముందు సాగిలపడటం ఆపండి, నిటారుగా నిలబడండి’ అని రాహుల్ గాంధీ మోదీని కోరారు. […]
Read more

ప్రైవేటీకరణపై నిరసనను ముమ్మరం చేసిన ఇస్రో సిబ్బంది!

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణ వార్తలపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో రాకెట్లు (లాంచ్ వెహికల్స్), శాటిలైట్ల తయారీ బాధ్యతలను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUs) అప్పగించి, ఇస్రో కేవలం అధునాతన పరిశోధనలకే పరిమితం అవుతుందనే వార్తలు వచ్చాయి. ఈ మార్పుల వల్ల ఇస్రోలోని ప్రస్తుత ఉద్యోగుల భవిష్యత్తు, ప్రమోషన్లు, కొత్త రిక్రూట్‌మెంట్లు తగ్గిపోతాయేమోనని సిబ్బంది ఆందోళన చెందారు. యాజమాన్యం నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో, […]
Read more

మణిపూర్‌లో మళ్లీ హింస… ఇద్దరు కుకీ మహిళల కాల్చివేత, ఫామ్‌హౌస్‌లు దగ్ధం

ఇంఫాల్‌: మణిపూర్‌లోని తమంగ్‌లాంగ్ జిల్లాలో జరిగిన తాజా హింసాత్మక ఘటనలో, అనుమానిత మిలిటెంట్లు ఇద్దరు మహిళలను కాల్చి చంపారు. ఒక గ్రామం వెలుపల ఉన్న కొన్ని ఫామ్‌హౌస్‌లను తగులబెట్టారని అధికారులు తెలిపారు. తమంగ్‌లాంగ్, నోనీ జిల్లాల్లో ఇద్దరు మహిళలతో సహా నలుగురు వ్యక్తులు కాల్చి చంపిన రెండు రోజుల తర్వాత ఈ హత్యలు జరిగాయి. తాజా దాడి వివరాలులేసాంగ్‌ఫై అనే మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు కుకీ మహిళలు కట్టెల కోసం పొలానికి వెళ్లినప్పుడు, ఆయుధాలు ధరించిన […]
Read more

రెండు వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై వడ్డింపు!

న్యూఢిల్లీ: అనుకున్నదే అయింది… యూపీఐ ద్వారా రెండు వేలు దాటిన లావాదేవీలపై ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించనుంది. ఒక్కో లావాదేవీకి గరిష్ట పరిమితి రూ. 300గా విధంచనున్నారు. దీంతో దాదాపు ఆరేళ్లుగా పూర్తిగా ఉచితంగా ఉన్న UPI చెల్లింపులకు కేంద్రం ముగింపు పలికినట్లైంది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ద్వారా డిజిటల్ చెల్లింపుల ఎకోసిస్టమ్ వార్షికంగా రూ. 16,000 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించే […]
Read more

ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఎన్డీఏలో చీలిక… చర్చలకు జేడీ(యూ), ఎల్‌జేపీ డిమాండ్!

న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుపై ఎన్డీయే (NDA) కూటమిలో బేధాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్డీయే అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో, బీహార్‌కు చెందిన కీలక మిత్రపక్షాలైన జేడీయూ (JD-U), ఎల్‌జేపీ (LJP-RV) పార్టీలు దీనిపై విస్తృత చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో యూసీసీకి మద్దతు ఇచ్చినప్పటికీ, బీహార్‌లో దీనిని అమలు చేయడానికి వీల్లేదని జేడీయూ స్పష్టం […]
Read more

దిశా సాలియన్ మృతికేసు… సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉద్ధవ్, ఆదిత్య థాకరే, రియా!

న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో, సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఇందులో శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే, ఆదిత్య అంగరక్షకులు, నటులు రోహన్ రాయ్, డైనో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ […]
Read more

పార్టీ మారితే నిషేధం… కపిల్ సిబల్ ప్రతిపాదనకు CJP మద్దతు!

న్యూఢిల్లీ: రాజకీయ ప్రయోజనాల కోసం మధ్యలో పార్టీలు మారే ప్రజాప్రతినిధులపై కఠినమైన నిషేధం విధించాలంటూ సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ చేసిన ప్రతిపాదనకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతు తెలిపింది. అయితే, కపిల్ సిబల్ 10 ఏళ్ల నిషేధాన్ని కోరగా, CJP మాత్రం ఫిరాయింపుదారులపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా,ప్రభుత్వ పదవులు చేపట్టకుండా పూర్తి నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల ఫిరాయింపుల ఆరోపణలు, ఫిరాయింపుల నిరోధక […]
Read more
1 2 3 4 107

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.