Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బడ్జెట్‌ పత్రాల్లో రూపాయి చిహ్నం తొలగింపు…’వేర్పాటువాద భావన’ను ప్రోత్సహిస్తుందన్న నిర్మలా సీతారామన్‌!

న్యూఢిల్లీ: తమిళనాడు బడ్జెట్ పత్రంలో అధికారిక రూపాయి చిహ్నం స్థానంలో… తమిళ అక్షరాన్ని ఏర్పాటు చేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం స్టాలిన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇది “ప్రాంతీయ దురభిమానం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రూపాయి గుర్తుతో సమస్య ఉంటే.. అధికారికంగా 2010లో కేంద్రం ఆమోదించిన సమయంలో […]
Read more

బీజేపీ గెలిచాక ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెళ్లగొడతాం…బెంగాల్‌ విపక్ష నేత సువేందు అధికారి!

కోలకత: పశ్చిమ బెంగాల్‌లో విపక్ష నేత సువేందు అధికారి ముస్లిం ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఎమ్మెల్యే ఒకరు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడానికి పార్టీని వీడిన ఒక రోజు తర్వాత ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. “మరో పది నెలల్లో(2026) బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత, టీఎంసీ పార్టీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు పంపేస్తాం’ అని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, ఆ పార్టీని “ముస్లిం లీగ్”తో పోల్చారు. […]
Read more

పోలీసు రైడ్‌లో శిశువు మృతి…చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన జమాతే-ఇస్లామీ హింద్ బృందం!

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రఘునాథ్‌గఢ్ గ్రామంలోని ఓ ఇంటిపై జరిగిన పోలీస్‌ రైడ్‌లో.. అధికారి నిర్లక్ష్యంతో మరణించిన 22 రోజుల పసికందు కుటుంబాన్ని జమాతే-ఇ-ఇస్లామీ హింద్ (JIH) ప్రతినిధి బృందం పరామర్శించింది. మార్చి 2న నౌగావ్ పోలీస్ స్టేషన్ బృందం నిర్వహించిన సైబర్ క్రైమ్ దాడిలో జరిగిన దారుణమైన సంఘటనలో శిశువు మరణం సంభవించింది. నివేదికల ప్రకారం, పోలీసు బృందం తెల్లవారుజామున దాడి నిర్వహించింది. ఆపరేషన్ సమయంలో, ఒక అధికారి అనుకోకుండా శిశువు పడుకున్న మంచంపై […]
Read more

అమిత్‌షా కొడుకునంటూ మణిపూర్‌ ఎమ్మెల్యేలకు ఫోన్లు…ముగ్గురి అరెస్ట్‌!

గౌహతి/న్యూఢిల్లీ:. మణిపూర్‌లో ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని జరిగిన నకిలీ కాల్ స్కామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముగ్గురు నిందితులను ఈ ఉదయం ఢిల్లీ నుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు తీసుకువచ్చినట్లు తెలిపాయి. ఈ మోసగాళ్ళు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ తోక్‌చోమ్ సత్యబ్రత సింగ్ సహా పలు నాయకులకు ఫోన్ చేసి మంత్రి పదవికి 4 కోట్లు డిమాండ్ చేశారని వర్గాలు తెలిపాయి. వీరిపై […]
Read more

హిందీపై కేంద్రం-తమినాడు మధ్య మాటల మంటలు!

న్యూఢిల్లీ : హిందీ భాషా వివాదం కేంద్రం-తమిళనాడు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం పేరుతో కేంద్రం బలవంతంగా హిందీని రుద్దుతోందని డీఎంకే ఆరోపించగా, తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని కేంద్రం ప్రత్యారోపణ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నోరును అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తనను […]
Read more

కుంభ్ నీళ్లు ‘స్నానానికి అనువు’గానే ఉన్నాయన్న కేంద్రం…నివేదికపై వెనక్కి తగ్గిన కాలుష్య నియంత్రణ బోర్డు!

న్యూఢిల్లీ: కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని గంగానది నీరు స్నానానికి అనువుగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్ధించుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ఇచ్చిన కొత్త నివేదికను ఉటంకిస్తూ…నీటి నాణ్యత విషయంలో ఢోకాలేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ పార్లమెంటుకు తెలిపారు. గతంలో, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు – నీటి నాణ్యత పరీక్షలను ఉటంకిస్తూ – ప్రయాగ్‌రాజ్‌తో సహా అనేక ప్రదేశాలలో గంగా నదిలోని నీరు స్నానానికి పనికిరాదని పేర్కొంది. NGTకి కూడా […]
Read more

హోలీ వేడుకల కారణంగా లక్నో, సంభాల్‌లో శుక్రవారం నమాజ్ టైమింగ్స్‌లో మార్పు!

లక్నో-ఉత్తరప్రదేశ్: రానున్న శుక్రవారం హోలీ కావడంతో, ఈద్గాతో సహా లక్నోలో ప్రార్థన సమయాలను మధ్యాహ్నం 12 గంటలకు బదులుగా 2 గంటలకు మార్చారు. ఈమేరకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలి ఈ నోటీసును విడుదల చేశారు, హోలీ వేడుకలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి కాబట్టి,… ముస్లింలు 12:45 గంటలకు బదులుగా 2 గంటల తర్వాత […]
Read more

వాడీ, వేడిగా సాగనున్న రెండవ దశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు!

న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండవ దశలోనూ వాడీ, వేడిగా కొనసాగే అవకాశం ఉంది. ఓటర్ల కార్డులకు ‘EPIC’ నంబర్ కేటాయింపు, సరిహద్దుల విభజన, త్రిభాషా అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టనున్నాయి. మరోవంక వివాదాస్పద వక్ఫ్ బిల్లును ఆమోదింప జేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఏప్రిల్ 4వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భారత అక్రమ వలసదారుల బహిష్కరణ విషయంలో అమెరికా అవలంభించిన విధానం, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు విధిస్తానని ప్రకటించడం […]
Read more

మణిపూర్‌లో గవర్నర్‌ డెడ్‌లైన్‌ తరువాత 196 ఆయుధాల అప్పగింత…మిగతా వాటికోసం ఆపరేషన్!

ఇంఫాల్: మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విజ్ఞప్తికి స్పందిస్తూ, దోచుకున్న, అక్రమంగా కలిగి ఉన్న 196 ఆయుధాలు పోలీసులకు తిరిగి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా మార్చి 6లోపు ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్‌ డెడ్‌లైన్‌ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాలు – చురాచంద్‌పూర్, బిష్ణుపూర్, తౌబాల్, ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, కాక్చింగ్, జిరిబామ్, ఫెర్జాల్‌లలో 196 ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు […]
Read more

బంగ్లాదేశ్ మీదుగా బెంగాల్- ఈశాన్య రాష్ట్రాల మధ్య కొత్త ఆర్థిక కారిడార్ నిర్మించాలన్న మేఘాలయ!

గువహతి: బంగ్లాదేశ్ మీదుగా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య ప్రాంతం కనెక్టివిటీని పెంచాలని మేఘాలయ ప్రభుత్వం డిమాండ్ చేసింది. హిలి-మహేంద్రగంజ్ ట్రాన్స్‌నేషనల్ ఎకనామిక్ కారిడార్‌తో ఇది సాధ్యమవుతుందని తెలిపింది. కాగా హిలి పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు పట్టణం కాగా, మహేంద్రగంజ్ మేఘాలయ గారో హిల్స్ ప్రాంతంలో సరిహద్దు పట్టణం. ఈ రెండు ప్రాంతాలు బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటాయి. ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా కోల్‌కతా నుండి తురా, బాగ్మారా, డాలు, డాకి వంటి వృద్ధి కేంద్రాలకు 100 కి.మీ […]
Read more
1 38 39 40 41 42 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.