Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్న మరాఠా కోటా నిరసన…ప్రభుత్వ జోక్యం కోరుతున్న వ్యాపారులు!

ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా ఆందోళనపై అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ ముంబైలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి, దీర్ఘకాలిక నష్టం నుండి వ్యాపారాలను రక్షించడానికి ప్రభుత్వం లేదా హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఆజాద్ మైదాన్‌లో జరుగుతున్న భారీ రిజర్వేషన్‌ ఉద్యమం దక్షిణ ముంబైని పూర్తిగా గందరగోళంలోకి నెట్టిందని, దుకాణాలు, మార్కెట్లలో వారాంతపు అమ్మకాలను ప్రభావితం చేసిందని రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (FRTWA) అధ్యక్షుడు వీరేన్ షా అన్నారు. “ముంబై హైజాక్ అయినట్లు […]
Read more

దేశంలో ఏకపక్ష కూల్చివేతలు…న్యాయాన్ని అణిచివేయడమే!

లక్నో: భారతదేశంలో కూల్చివేతలు వివాదాస్పదమైన పాలనా సాధనంగా మారాయి. గత రెండు సంవత్సరాలుగా, డజన్ల కొద్దీ మదర్సాలు, ఇళ్ళు, మసీదులు చట్టబద్ధమైన ప్రక్రియను కాదని కూల్చివేసారు. భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ అధికారులు ఈ చర్యలను సమర్థిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిని లేదా అణగారిన వర్గాలకు చెందిన వారిని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆధారాలు లేదా ముందస్తు నోటీసు లేకుండా నిర్వహించిన […]
Read more

మరాఠా కోటా కోసం ఆమరణ దీక్ష చేపట్టిన మనోజ్ జరంగే-పాటిల్!

ముంబై: మహారాష్ట్రలో నాలుగు దశాబ్దాలుగా మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ సారి ఎలాగైన తమ డిమాండ్‌ సాధించుకునేందుకు మరాఠా కోటా వీరుడు పట్టుబిగించాడు. గత రెండు సంవత్సరాలుగా ఆందోళనకు నాయకత్వం వహించిన మనోజ్ జరంగే-పాటిల్ శుక్రవారం ముంబైలోని చారిత్రాత్మక ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. డిమాండ్ నెరవేరే వరకు తాను తిరిగి రానని ప్రకటించాడు. ఏక్ మరాఠా, లాఖ్ మరాఠా’, ‘చలో ముంబై’, ‘మనోజ్ దాదా….ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై’ […]
Read more

ఎన్నికలకు ముందు బీహార్‌లో ఉగ్రవాద హెచ్చరిక: భద్రతా ఆందోళనలా లేక రాజకీయ వ్యూహమా?

న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి ప్రవేశించిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి బీహార్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. బీహార్ నిఘా పోలీసు విభాగం కూడా దీనిని ధృవీకరించింది. పోలీసులు అనుమానిత ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేసి వారి పేర్లను గుర్తించారు. వారిలో ఒకరు రావల్పిండికి చెందిన హస్నైన్ అలీగా, మరొకరు ఉమర్‌కోట్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్‌గా, మూడవ వ్యక్తి బహవల్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్‌గా గుర్తించారు. హిందీ,ఇంగ్లీష్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ వార్తాపత్రికల ఆన్‌లైన్ […]
Read more

సెప్టెంబర్ 1న ముగియనున్న ‘ఓటరు అధికార్ యాత్ర’…పాట్నాలో భారీ ఊరేగింపు!

పాట్నా: బీహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటరు అధికార్ యాత్ర’ సెప్టెంబర్ 1న రాష్ట్ర రాజధానిలో “భారీ ఊరేగింపు”తో ముగుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా వెల్లడించారు. పార్టీ మీడియా, ప్రచార విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఖేరా తూర్పు చంపారన్ జిల్లాలోని ఢాకాలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. “ఈ యాత్ర అన్ని మతాల ప్రజలు పాల్గొనే మతపరమైన యాత్ర లాంటిది. సెప్టెంబర్ 1న, మా నాయకులు పాట్నాలోని గాంధీ మైదాన్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు […]
Read more

దేశ విభజనను గుర్తుచేస్తూ ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసిన NCERT…ఖండించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్!

న్యూఢిల్లీ: భారతదేశ విభజనను గుర్తుచేస్తూ… ఆగస్ట్‌ 14న’విభజన గాయాల స్మారక దినం’ సందర్భంగా NCERT ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. విభజనకు మహ్మద్ అలీ జిన్నాతో పాటు కాంగ్రెస్‌పార్టీని బాధ్యులుగా పేర్కొంది. కాగా, ఈ వాదనను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (IHC) తీవ్రంగా ఖండించింది. ఇది మతపరమైన ఉద్దేశ్యంతో కూడిన అబద్ధాలు” అని పేర్కొంది. ఈ పాఠ్యాంశాలను “వక్రీకరించారని ఆగస్టు 25 నాటి తీర్మానంలో IHC పేర్కొంది, దీనిని “పాఠశాలకు వెళ్లే లేత మనస్సులోకి జొప్పిస్తున్నారని విమర్శించింది. […]
Read more

ధర్మస్థల ఫైల్స్‌..కొత్తగా ‘సిట్’కు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి!

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉన్న పుణ్య క్షేత్రం ధర్మస్థల. కాగా ఈ పట్ణంలోని 13 ప్రదేశాలలో వందలాది మంది మహిళలు, బాలికల మృతదేహాలను తాను ఖననం చేశానని గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు పేర్కొన్న తర్వాత ఇది దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, దశాబ్దం క్రితం తన కూతురి సౌజన్యని అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆ […]
Read more

అస్సాంలో మతాంతర భూ బదిలీకి కొత్త విధానం!

డిస్పూర్: అస్సాంలో మతాంతర భూ బదిలీకి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP)ని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయం గురించి వివరిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ…అలాంటి బదిలీలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. “అస్సాం వంటి సున్నితమైన రాష్ట్రంలో, భూ బదిలీని జాగ్రత్తగా అప్పగించాలి. అలాంటి బదిలీలన్నీ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనుంది. కొనుగోలు చేస్తున్న వ్యక్తికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మేము తనిఖీ చేస్తాం. అంతేకాదు ఆ భూమి అమ్మకం ఆ […]
Read more

వాణిజ్యం ఇప్పుడు ఆయుధంగా మారింది…ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్!

న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు తీవ్ర బాధాకరమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రఘురామ్ రాజన్ అన్నారు. అయితే భారత్ కు ఇదో పెద్ద మేల్కొలుపు అని అభివర్ణించారు. తమ వాణిజ్యాన్ని మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. భారత వస్తువులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు నిన్నటినుండి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రఘురామ్ రాజన్ మాట్లాడుతూ… నేటి ప్రపంచ క్రమంలో వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థికం […]
Read more

ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలు… 50 మందికి పైగా దౌత్యవేత్తలు హాజరు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలకు దాదాపు రెండు డజన్ల రాయబార కార్యాలయాలు, హై కమిషన్ల నుండి 50 మందికి పైగా దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెండవ రోజు హాజరైన ప్రముఖులలో అమెరికా మొదటి కార్యదర్శి గ్యారీ యాపిల్‌గార్త్, అమెరికా మంత్రి-కౌన్సెలర్ రాజకీయ వ్యవహారాల ఆరోన్ కోప్, చైనా మంత్రి-కౌన్సెలర్ జౌ గువోహుయ్, రష్యా మొదటి కార్యదర్శి మిఖాయిల్ జైట్సేవ్, శ్రీలంక హై కమిషనర్ ప్రదీప్ మొహ్సిని, మలేషియా […]
Read more
1 7 8 9 10 11 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.