Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వదంతులతో హైదరాబాద్ పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ!

హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే పుకార్లతో హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ నెలకొంది. పొడవైన క్యూలలో వాహనదారులు పెట్రోల్‌ కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొనుగోళ్లు ఎక్కువగా జరగడంతో పలు బంకుల వద్ద ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు ప్రదర్శించారు. మరోంక సిఎన్‌జి అవుట్‌లెట్ల వద్ద, ఇంధనం నింపుకోవడానికి ఆటోరిక్షాలు పొడవైన క్యూలలో వేచి ఉండటం కనిపించింది. ఇది […]
Read more

ఎల్‌బీ నగర్, హయత్‌నగర్ మధ్య 941 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్‌!

హైదరాబాద్: నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటైన ఎల్‌బీ నగర్, హయత్‌నగర్ మధ్య తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు, రూ. 941 కోట్ల వ్యయంతో ఒక డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నట్లు తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. 5.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ మార్గం, 70 కాలనీలలో నివసించే సుమారు 1.2 మిలియన్ల (12 లక్షల) మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. నిధులుఈ […]
Read more

విద్వేషపూరిత ప్రసంగాల ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం!

హైదరాబాద్: మత సామరస్యాన్ని దెబ్బతీసి, హింస, ఘర్షణలను ప్రేరేపించే విద్వేషపూరిత ప్రసంగాలను, సోషల్ మీడియా పోస్టులను అరికట్టడానికి ఉద్దేశించిన ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాలు- విద్వేష నేరాల నివారణ బిల్లు, 2026’కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లును కాంగ్రెస్ పాలనలోని కర్ణాటక గత ఏడాది డిసెంబర్ 18న ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లు […]
Read more

‘రైతుల కోసం ప్రతి నెలా 5,500 కోట్లు ఖర్చు’…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: ఆరుగాలం కష్టించే రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం, అక్కడ జరిగిన ‘రైతు ఉత్సవాల’లో రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రబీ సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల సంక్షేమం పట్ల తన ప్రభుత్వానికి […]
Read more

బాహుబలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విక్రమార్క!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను మూడు లక్షల కోట్లతో బాహుబలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …. అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తూ పాలన చేస్తున్నామన్నారు. పాలకుల్లా కాకుండా సేవకుల్లా పని చేస్తున్నామన్నారు. గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని.. దేశంలో తెలంగాణను నెంబర్‌ ఒన్‌ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని […]
Read more

రైతులను రాజులుగా తీర్చిదిద్దుతాం…ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్!

హైదరాబాద్: తెలంగాణలోని సమస్త రైతు సమాజం సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఒక లాభదాయక వృత్తిగా ప్రోత్సహించడం ద్వారా రైతులను ‘రాజులుగా’ తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘శ్రీ పరాభవ నామ ఉగాది’ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి, భూ లావాదేవీలకు సంబంధించిన ‘సాదా బైనామా’ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు. రైతులకు సమస్యలను సృష్టించిన ‘ధరణి’ పోర్టల్‌ను తొలగించి, భూ యాజమాన్య […]
Read more

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ ప్రవేశపెడతాం…మంత్రి పొంగులేటి!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తన “డిజిటల్ మీడియా విధానాన్ని” (Digital Media Policy) మరో రెండు నెలల్లో ఖరారు చేయనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఈమేరకు శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ‘తీన్మార్ మల్లన్న’ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ విధానం ఇప్పటికే ఒక రూపు సంతరించుకుందని, రెండు నుంచి మూడు నెలల్లో దీనిని ప్రవేశపెట్టనున్నట్లు పొంగులేటి తెలిపారు. మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి, ఆ కార్డుల […]
Read more

మూసీ నదిపై కేసీఆర్, కేటీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను వినిపించిన తెలంగాణ సీఎం!

హైదరాబాద్: మూసీ నదీతీర అభివృద్ధి ప్రాజెక్టుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్), దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్)ల వైఖరి పట్ల వారి నిజాయితీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం వందన సమర్పణ సందర్భంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్‌లు అధికారంలో ఉన్నప్పటి వీడియోలను ప్రదర్శించారు. ఆ వీడియోలలో వారు మూసీ నదిపై ఉన్న అక్రమ నిర్మాణాల సంఖ్యను […]
Read more

తెలంగాణలో దళితులు, ఆదివాసులపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోండి!

హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, 1989 కింద ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని కోరుతూ ఏడుగురు సభ్యుల ప్రజాభిప్రాయ సేకరణ కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి, న్యాయవాదులు, విద్యావేత్తలతో కూడిన ఈ కమిటీ… ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, రాష్ట్రంలో దళితులు, ఆదివాసులపై వ్యవస్థాగతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని […]
Read more

మొయినాబాద్ డ్రగ్స్ కేసు…టీడీపీ ఎంపీకి స్టేషన్‌ బెయిల్!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్‌కు… ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా స్టేషన్ బెయిల్ లభించింది. అయితే, ఈ ఘటన వల్ల “టీడీపీ ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లింది” అని పేర్కొంటూ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎంపీకి’షో-కాజ్ నోటీసు’ జారీ చేశారు. ఈ విషయంపై పూర్తి నివేదిక అందే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎంపీని ఆదేశించారు. తనపై […]
Read more
1 9 10 11 12 13 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.