Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ఖరారు!

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కీలక అడుగు పడింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 121 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో వార్డులు, చైర్‌పర్సన్లు/మేయర్ల పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), వెనుకబడిన తరగతులు (బీసీలు), మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించకుండా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు […]
Read more

చార్మినార్‌ జోన్‌లో ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించిన పోలీసులు!

హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ నగర పోలీసులు చార్మినార్ జోన్‌లో ‘ఆపరేషన్ కవచ్’ కింద భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజా భద్రత, నేరాల నివారణ , విజిబుల్ పోలీసింగ్‌పై ఈ ప్రత్యేక డ్రైవ్ దృష్టి సారించింది. చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే పర్యవేక్షణలో, దాదాపు 200 మంది పోలీసు సిబ్బందితో ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ల నుండి సైదాబాద్ ఎక్స్ రోడ్ల వరకు పెద్ద […]
Read more

వార్తా ఛానెళ్లపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన తెలంగాణ ఐఏఎస్‌ల సంఘం!

హైదరాబాద్: మహిళా ఐఏఎస్ అధికారులు, ఒక రాష్ట్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని “అపమానకరమైన, నిరాధారమైన కంటెంట్”ను ప్రసారం చేసిన అనేక ప్రైవేట్ న్యూస్ ఛానెళ్లపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు NTV, తెలుగు స్క్రైబ్, MR మీడియా తెలంగాణ, ప్రైమ్9 తెలంగాణ, PVNews, సిగ్నల్ టీవీ, వోల్గా టైమ్స్, మిర్రర్ టైఆఫీషియల్, Tnews తెలుగు ఛానల్‌లపై కేసులు నమోదు […]
Read more

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షకు కమిటీ ఏర్పాటు…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను అహేతుకంగా చేపట్టారని అన్నారు. “జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణపై మాకు వినతులు వస్తున్నాయి. రాజకీయ కారణాల ఆధారంగా (జిల్లాలపై) నిర్ణయాలు తీసుకుంటే న్యాయం […]
Read more

అధిక జనాభా ఉన్న పట్టణాల్లో అదనపు తహసీల్దార్ల నియమిస్తామన్న మంత్రి పొంగులేటి!

హైదరాబాద్‌: జనాభా అధికంగా ఉన్న పట్టణాల్లో ప్రభుత్వం అదనపు తహసీల్దార్లను నియమిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం 1.5 లక్షల నుంచి 2 లక్షల జనాభా ఉన్న అనేక పట్టణాల్లో కేవలం ఒకే తహసీల్దార్ ఉన్నారని, దీనివల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. ఒకే తహసీల్దార్ ఇంత పెద్ద జనాభాను సమర్థవంతంగా నిర్వహించలేరని అంగీకరించిన మంత్రి, ఈ విషయాన్ని తదుపరి క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత, […]
Read more

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు లేఖలు రాసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క!

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, తెలంగాణ విద్యుత్ డిస్కామ్‌లు… విద్యుత్ వినియోగదారులతో సంబంధాలు బలోపేతం చేయడానికి ఓ వినూత్నయత్నానికి నడుం బిగించాయి. ఇందులో భాగంగా… నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపే లేఖలు, ఉప ముఖ్యమంత్రి సందేశాన్ని 83 లక్షల మంది గృహ జ్యోతి పథకం లబ్ధిదారులు, వ్యవసాయ వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుల పేరు,సేవా కనెక్షన్ నంబర్‌ను కలిగి ఉన్న ఈ వ్యక్తిగత చిరునామా లేఖలను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ […]
Read more

త్వరలో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్న తెలంగాణ!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లోని ప్రీ-ప్రైమరీ పాఠశాల పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో (వైఐఐఆర్‌సి) ప్రవేశాల మొదటి దశలో బాలికా విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. ఒక సమీక్షా సమావేశంలో, పాఠశాల విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యప్రణాళికను మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులను […]
Read more

జాబ్‌ క్యాలెండర్‌ విడుల చేయాలంటూ హైదరాబాద్‌లో నిరసన చేపట్టిన యువత!

హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిటీలోని అశోక్ నగర్ లో మరోసారి భారీగా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగింది. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత వారిలో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సుమారు 10 మందిని అరెస్టు చేసి ప్రస్తుతం కస్టడీలో ఉంచినట్లు చిక్కడపల్లి […]
Read more

మహిళా ఐఏఎస్ అధికారిని వేధిస్తున్న మంత్రి… బీఆర్ఎస్ ఆరోపణ!

హైదరాబాద్: తెలంగాణలో ఒక మంత్రి ప్రేమ పేరుతో ఒక మహిళా ఐఏఎస్ అధికారిణిని వేధిస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఘటన అత్యంత దారుణమని ఆయన అభివర్ణించారు. “పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఉంది? పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోంది? పలువురు క్యాబినెట్ మంత్రులు మహిళా అధికారులను వేధిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయవద్దా? ఐఏఎస్ మహిళా అధికారులకే రక్షణ లేకపోతే, సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?” అని ప్రవీణ్ కుమార్ […]
Read more

సంక్రాంతికి ఆరువేలకు పైగా ప్రత్యేక బస్సులను నడపనున్న తెలంగాణ ఆర్టీసీ!

హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) జనవరి 9 నుండి 13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సమయంలో రద్దీని ఎదుర్కొనేందుక, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల నడపడానికి ప్రణాళిక వేసింది. సాధారణంగా తిరుగు ప్రయాణ రద్దీ పెరిగే జనవరి 18,19 తేదీలలో కూడా ఈ సేవలను పొడిగించనున్నారు. ఈ బస్సులు హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టాప్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), […]
Read more
1 15 16 17 18 19 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.