Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

జనవరి 19న దావోస్‌కు సీఎం…భారీ పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ!

హైదరాబాద్: తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశానికి హాజరయ్యేందుకు దావోస్‌లో పర్యటించనున్నారు. ఆరు రోజుల పర్యటనలో సీఎం…రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అలాగే ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్ -2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రదర్శించనున్నారు. ఈమేరకు “ఐటీ, పరిశ్రమల విభాగాలు దావోస్‌లో ఉండే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ […]
Read more

తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం…రెవెన్యూ మంత్రి పొంగులేటి!

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణను సరిచేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ… ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మండలాలు నాలుగు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయని, ఇది గందరగోళానికి, అసౌకర్యానికి కారణమవుతోందని ఆయన ఎత్తి చూపారు. అంతేకాదు మండలాలు, జిల్లాలను ఏకపక్షంగా విభజించారని, ఇది పరిపాలనాపరమైన అవకతవకలకు దారితీసిందని మంత్రి అన్నారు. కొన్ని సందర్భాల్లో, జిల్లాల […]
Read more

భారీ ఎత్తున నిధుల సమీకరణకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాలలో… పెండింగ్‌లో ఉన్న, కొత్త సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 50,000 కోట్లను సమీకరించేందుకు ముంబైకి చెందిన ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థతో చర్చలు జరుపుతోంది. మొన్నటి ముంబై పర్యటన సందర్భంగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఆర్థిక సంస్థ ప్రతినిధులతో ఒక ‘రహస్య’ సమావేశం నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఆ సంస్థ నుండి కనీసం రూ. […]
Read more

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్…హరీష్ రావు విమర్శలు!

హైదరాబాద్: నదీ జలాల కేటాయింపులో కాంగ్రెస్ చేసిన ‘ద్రోహాలపై’ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పీఆర్ఎల్ఐఎస్), కాళేశ్వరం ప్రాజెక్టులను అధికార పార్టీ రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో “నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై ప్రజెంటేషన్ ఇస్తూ… ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ […]
Read more

హైదరాబాద్‌లో పోలీస్‌ కమిషనరేట్‌ల పునర్వ్యవస్థీకరణ!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలను పునర్వ్యవస్థీకరించి… హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 27 మునిసిపల్ పట్టణ సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో విలీనం చేసిన తర్వాత ఈ కొత్త పరిణామం చోటుచేసుకుంది. దీని ప్రకారం… గ్రేటర్ హైదరాబాద్ పరిధి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ), చందానగర్, చార్మినార్ […]
Read more

హైదరాబాద్‌లో 50వేల మంది గిగ్ కార్మికుల సమ్మె!

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిన్న సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో 50వేల మంది గిగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్డులకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. మెరుగైన వేతనాలు, పని పరిస్థితులు కల్పించాలని, ప్రమాదాలు, ఒత్తిడికి కారణమవుతున్న 10 నిమిషాల డెలివరీ రద్దు చేయాలని, పాత పే-అవుట్ సిస్టమ్ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసారు. దీంతో కొత్త సంవత్సరం వేళ […]
Read more

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం!

హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న దుర్గం చెరువు అక్రమ ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝళిపించింది. మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ వైపు ఉన్న దాదాపు 5 ఎకరాల చెరువు భూమిని కబ్జాల నుండి విడిపించి స్వాధీనం చేసుకుంది. ఆక్రమణదారులు చెరువు గర్భంలో కొంత భాగాన్ని మట్టితో నింపి, ఆ ప్రాంతాన్ని వాణిజ్య పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తున్నారని, దీని ద్వారా నెలకు ₹50 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో ప్రచురితమైన ఒక ఫిర్యాదుపై […]
Read more

హైదరాబాద్‌ను ప్లాస్టిక్ రహితంగా మారుద్దాం…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: రాజధాని నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…హైదరాబాద్‌ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి, డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీలో కొత్తగా […]
Read more

ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి పేరుతో కొత్త పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు!

హైదరాబాద్: నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్లు – హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండను నాలుగు కొత్త కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాత రాచకొండ పోలీస్ సర్కిల్‌ను ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించారు. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించిన నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. కొత్త పోలీస్ పరిధుల ప్రకారం… అసెంబ్లీ, సచివాలయం, బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయం, బుద్వేల్ హైకోర్టు వంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిన్న […]
Read more

పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చిన సీఎం…ఆరోపించిన కేటీఆర్!

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరును తిరిగి వలసల జిల్లాగా మార్చారని, కాంగ్రెస్ పార్టీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం చేసి, ఈ ప్రాంతాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణకు సంబంధించి నీటి హక్కులను పరిరక్షించడానికి తమ పార్టీ అధినేత కేసీఆర్‌ కొత్త పోరాటానికి సిద్ధమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అన్నారు. నాగర్ కర్నూల్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచుల సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నీటిపారుదల, అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైందని, బీఆర్ఎస్ […]
Read more
1 16 17 18 19 20 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.