Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హైదరాబాద్‌లో 6.25 కోట్ల జీఎస్‌టీ స్కామ్‌!

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ GST స్కామ్‌ బయటపడింది, బాలా కార్పొరేషన్ యజమాని నాసరి వినోద్ కుమార్ మోసపూరిత GST రిజిస్ట్రేషన్ చేసి, దానిద్వారా రూ.6.25 కోట్ల నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) పొందారని అధికారులు ఆరోపించారు. పంజాగుట్ట డివిజన్ పరిధిలోని ఖైరతాబాద్, సోమాజిగూడ సర్కిల్ 1 పరిథిలో ఉనికిలో లేని చిరునామాకు సంబంధించిన నకిలీ విద్యుత్ బిల్లులతో కంపెనీ GST రిజిస్ట్రేషన్‌ను పొందిందని అధికారులు చెబుతున్నారు. బొమ్మలు, వీడియో గేమ్‌లను వర్తకం చేయడానికి నమోదు చేసుకున్నప్పటికీ, […]
Read more

సెమీకండక్టర్ ప్రాజెక్టును ఆమోదించండి…కొత్త రైల్వే లైన్‌ ఇవ్వండి!

హైదరాబాద్: తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ మంత్రికి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సీఎం మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అలాగే కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి పరిశోధనలు, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ టెక్నాలజీస్‌ (ఏఎస్‌ఐపీ) ప్రాజెక్టు, మైక్రో […]
Read more

సాగునీటి వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు!

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను గుర్తించి ముందుకు సాగడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీనియర్ అధికారులు, ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో మరిన్ని అంశాలపై చర్చిస్తామని ఆయన అన్నారు. కొత్త నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు, కొనసాగుతున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపు, పూర్తయిన ప్రాజెక్టులు వంటి అంశాలు నిపుణుల కమిటీ చర్చల్లో భాగంగా ఉంటాయని ఆయన […]
Read more

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ‘ఫ్రీ పాలస్తీనా’ నినాదాలు!

హైదరాబాద్: క్యాంపస్‌లలో ‘ఫ్రీ పాలస్తీనా’కు మద్దతు పెరుగుతోంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, విద్యార్థుల మెదళ్లను ఉత్తేజపరిచేందుకు ఒక విద్యార్థి సంస్థ ఒక వినూత్న మార్గాన్ని రూపొందించింది. నిన్న ఉస్మానియా క్యాంపస్ లోపల వివిధ ప్రదేశాలలో ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, గాజా మానవతా సంక్షోభం, నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ గురించి సమాచారాన్ని అందించే పోస్టర్లు కనిపించాయి. “స్పార్క్ జూలై 2025” అనే శీర్షికతో ఉన్న ఈ పోస్టర్లలో, ట్రంప్ తన నోటితో పక్షిని పట్టుకుని, […]
Read more

నదీ జలాల వివాదాలపై తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశానికి కేంద్రం పిలుపు!

హైదరాబాద్: నదీ జలాల పంపిణీ వివాదాలపై కేంద్రం రేపు అంటే జూలై 16న ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో సమావేశం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను కేంద్రం ఆహ్వానించింది. సమావేశానికి వస్తారో లేదో తెలియజేయాలని కేంద్ర మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులను కోరారు. కాగా, ఏపీ సీఎం జూలై 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటిస్తున్నారు. […]
Read more

తుంగతుర్తిలో నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి!

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేదలకు శుభవార్త వినిపించింది. ఓ దశాబ్దం తర్వాత తెలంగాణలో తొలిసారిగా రేషన్‌ కార్డుల పండుగ జరగనుంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం లబ్ధిదారులకు కార్డులను అందించి, అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. సీఎం కార్డులు పంపిణీ చేసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు లబ్ధిదారులకు అందనున్నాయి. […]
Read more

దేశంలో భక్తి వరదలై పారుతోంది!

ఈమధ్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా భక్తి వరదలై పారుతూ కనిపిస్తోంది..రోజు రోజుకూ కొత్త కొత్త పండుగలు పుట్టుకొస్తున్నాయి. గతంలో కేవలం ఉత్తర భారతంలోనే ఎక్కువగా జరుపుకునే గణపతి నవరాత్రులు ఇప్పుడు గల్లీ గల్లీకి విస్తరించాయి. అలాగే అయ్యప్పమాల వేసేవారు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. భక్తి పేరిట వేలు లక్షలు ఖర్చుపెట్టడం అతి సాధారణం అయిపోయింది. పోనీ ఆ తర్వాత జీవితంలో విలువలకు కట్టుబడి ఉంటున్నారా అంటే అదీలేదు. దేనిదారి దానిదే. అత్యంత క్రైమ్ రేట్ […]
Read more

కేసీఆర్‌ ఫాంహౌస్‌లో చర్చకు రెడీ…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేతకు బహిరంగ ఆహ్వానం పంపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి రావడంలేదని, తమనే ఎర్రవల్లి ఫాంంహౌ‌స్‌కు రమ్మంటే వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై ప్రజాప్రతినిధులకు ప్రజాభవన్‌లో నీటిపారుదల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్ […]
Read more

ఓవైపు ఆనకట్ట భద్రతా సమస్యలు…మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదల!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం నిండింది. దీంతో ఆ ప్రాజెక్టు వద్ద జలహారతి నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను గేట్ల ద్వారా దిగువకు వదిలారు. ఈ సంవత్సరం, షెడ్యూల్ చేసిన తేదీకి మూడు వారాల ముందుగానే నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా ఇన్‌ఫ్లోలు రావడంతో మంగళవారం నాటికి ప్రస్తుత నిల్వ సామర్థ్యం 196.56 టిఎంసిలకు చేరుకుంది. గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టిఎంసిలే. నీటి మట్టం 881.60 […]
Read more

తెలంగాణలోని 64 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్లు…దాదాపు 3 లక్షల సీట్లు ఖాళీ!

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు చేపట్టిన దోస్‌ కౌన్సెలింగ్‌ ముగిసింది. అయితే ఆశించిన స్థాయిలో సీట్లు నిండలేదు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, 60 కి పైగా డిగ్రీ కళాశాలలు సున్నా అడ్మిషన్లను నమోదు చేశాయి. జూలై 5న కళాశాలల కన్ఫర్మేషన్‌ ఎంపికతో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) వెల్లడించిన DOST 2025 అడ్మిషన్ల […]
Read more
1 7 8 9 10 11 25

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.