24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గాల్వన్ వ్యాలీ సైనికుడికి వింటర్ ఒలింపిక్స్ ‘టార్చ్ బేరర్‘గా చైనా గౌరవం… ఆగ్రహించిన భారత్!

బీజింగ్: బుధవారం వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను‌ నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. ఇతను గల్వాన్‌ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన చైనా సీపీఏల్ఏ కమాండర్‌. ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షిన్‌జియాంగ్‌ మిలటరీ కమాండర్, గల్వాన్‌ లోయలో చైనా వీరుడు క్వీ ఫబోవో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాంగ్ మింగ్‌తో కలిసి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
దీనిపై మన దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను అమెరికా కూడా తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది సిగ్గుమాలిన పని. గల్వాన్‌ లోయ దాడిలో పాల్గొన్న వ్యక్తిని.. అదీ ఉయిగర్ల ఊచకోతకు కారణమైన వ్యక్తి టార్చ్‌ బేరర్‌గా ఎంచుకోవడం వెనుక ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపింది. భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుంది’’ అని యూఎస్‌ సెనేట్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ కమిటీ ర్యాంకింగ్‌ మెంబర్‌ ఈ ఉదయం ఒక ట్వీట్‌ చేశారు.
ఇదిలావుండగా వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభమవుతాయి, కోవిడ్-19 ప్రోటోకాల్‌ల ప్రకారం ప్రేక్షకులు పరిమితం చేయబడిన వింటర్ గేమ్స్‌లో భారతదేశం తరఫున ఒకే ఒక్క ఆటగాడు కాశ్మీర్‌కు చెందిన స్కీయర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పాల్గొంటున్నాడు.
జిన్‌జియాంగ్ ఉయ్‌ఘర్ అటానమస్ రీజియన్‌లో ఉయ్‌ఘర్‌ల దుర్వినియోగానికి సంబంధించిన మానవ హక్కుల ఆందోళనలపై యునైటెడ్ స్టేట్స్ మరియు అనేక ఇతర దేశాలు వింటర్ ఒలింపిక్స్ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నాయి.
మరోవంక 2020 ఘర్షణ తర్వాత రెండు దేశాలు గాల్వాన్ లోయ మరియు చుట్టుపక్కల పదివేల మంది అదనపు దళాలను మొహరించాయు. గత ఏడాది చివర్లో జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు గాల్వన్ లోయలో ఉద్రిక్తతలను తగ్గించడంలో విఫలమయ్యాయి.
‘క్విఫబావో‘ డిసెంబర్‌లో చైనీస్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTVలో కనిపించాడు, అతను “యుద్ధభూమికి తిరిగి వచ్చి మళ్లీ పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని” చెప్పాడు. మొత్తంగా డ్రాగన్ చేపట్టిన చర్యలు మన దౌత్యవేత్తల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles