23.7 C
Hyderabad
Monday, September 30, 2024

గాజాలో ఆగని రక్తచరిత్ర… గత 24 గంటల్లో 63 మంది పాలస్తీనియన్ల మృతి!

అంకారా: ముట్టడిలో ఉన్న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ తన దాడిని కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా గత 24 గంటల్లో కనీసం 63 మంది పాలస్తీనియన్లు మరణించారని, 112 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ  తెలిపింది.

“ఇజ్రాయెల్ ఆక్రమణ గాజా స్ట్రిప్‌లోని కుటుంబాలపై మారణకాండలకు పాల్పడడం ఇది ఏడోసారి. గత 24 గంటల్లో 63 మంది అమరులయ్యారు. 112 మంది గాయపడ్డారు” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

“రెస్క్యూ టీమ్ వారిని చేరుకోలేక పోవడంతో చాలా మంది ఇప్పటికీ శిథిలాల కింద  ఉన్నారని”  ప్రకటన పేర్కొంది.

అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తాత్కాలిక తీర్పును ఉల్లంఘిస్తూ, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై తన దాడిని కొనసాగిస్తోంది, ఇక్కడ అక్టోబర్ 7 నుండి ఇప్పటిదాకా 31,553 మంది పాలస్తీనియన్లు మరణించారు. వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే. 73,546 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.

గత ఏడాది అక్టోబర్ 7 న  హమాస్ దాడిలో దాదాపు 1,200 మందిని హతమయ్యారని టెల్ అవీవ్ చెప్పింది. దీనికి ప్రతీకారంగా  ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై దాడులు ఆరంభించింది.

ఐక్యరాజ్యసమితి ప్రకారం, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఆహారం, స్వచ్ఛమైన నీరు, ఔషధాలకు  తీవ్రమైన కొరత ఏర్పడింది మధ్య భూభాగంలోని జనాభాలో 85% మందిని నిరాశ్రయుల్ని చేసింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజా నగరంలో 60%  మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

ఇజ్రాయెల్‌ చేస్తున్న మారణహోమంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో  ఆరోపణలు వచ్చాయి.  టెల్ అవీవ్ మారణహోమ చర్యలను నిలిపివేయాలని జనవరిలో మధ్యంతర తీర్పు ఇచ్చింది.  గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించడానికి వీలుగా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అయినా ఇజ్రాయెల్ దాడులు  నిరాటంకంగా కొనసాగాయి. ఫలితంగా మానవతా సాయం అందించడం క్లిష్టంగా మారింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles