23.7 C
Hyderabad
Monday, September 30, 2024

పాలస్తీనాను గుర్తించడానికి మరో నాలుగు ‘ఈయూ’ దేశాలు సిద్ధం!

బ్రసెల్స్:  ‘పరిస్థితులు అనుకూలించినప్పుడు’ పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి మరో నాలుగు ఈయూ (EU) దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అవి ఐర్లాండ్, మాల్టా, స్లోవేనియా, స్పెయిన్ దేశాలు.

“పాలస్తీనాను గుర్తించడానికి మా సంసిద్ధతను తెలిపేందుకు మేము కలిసి చర్చించాము.  సానుకూల  పరిస్థితులు ఏర్పడితే మేము అలా చేస్తామని చెప్పామని”  బ్రస్సెల్స్‌లో జరిగిన EU శిఖరాగ్ర సమావేశం తర్వాత నాలుగు దేశాల ప్రతినిధులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

“సానుకూ పరిస్థితులు” అంటే ఏంటో పేర్కొనలేదు.

ఏ షరతులు పాటించాలి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ఇలా అన్నారు: “దీనిని ఎప్పుడు చేయాలో, మేము పరిష్కారానికి ఎప్పుడు తోడ్పడతామో మనం నిర్ణయించుకోవాలి, అందువల్ల ఇది రాజకీయ అంచనాకు సంబంధించినది”.

“ఈ గుర్తింపు శాంతి ప్రక్రియకు, హింసకు ముగింపు పలకడానికి, ఇజ్రాయెల్ దేశం పట్ల అరబ్ సమాజం, పాలస్తీనా పట్ల మిగిలిన పశ్చిమ దేశాలు పరస్పర గుర్తింపుతో పాటుగా శాశ్వత శాంతి స్థాపనకు సహాయపడే సమయం ఇది” అని పేర్కొన్నారు.

“పాలస్తీనాను  ఇప్పటికే న ప్రపంచంలో 130 కంటే ఎక్కువ దేశాలు గుర్తించాయన్న సంగతి మనం ఎప్పటికీ మరచిపోము.  అందువల్ల, మేము యూరోపియన్ యూనియన్‌లోని మిగతా దేశాల గురించి మాట్లాడుతున్నాము” అని సాంచెజ్ చెప్పారు.

తూర్పు ఐరోపా రాష్ట్రాలు బల్గేరియా, చెక్ రిపబ్లిక్, రొమేనియా, స్లోవేకియాలతో పాటు 1988లో పాలస్తీనాను ఒక దేశంగా మాల్టా గుర్తించింది, అయితే నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయలేదు.

27 EU సభ్య దేశాలలో కేవలం పది మాత్రమే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి.

దీని గురించి అడిగినప్పుడు, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ “ఒక ప్రక్రియను ప్రారంభించాలనే ఆలోచన ఉంది, రెండు వైపులా చేయగలిగే పనులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది” అని అన్నారు.

EU నాయకులు , గాజాలో మానవతా సాయానికి వీలుగా ” తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చిన ఒక రోజు తర్వాత … నాలుగు ఈయూ దేశాల నుండి తాము పాలస్తీనాను గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన వచ్చింది.  అంతేకాదు ఇజ్రాయెల్ దక్షిణాన ఉన్న నగరమైన రఫాలో పెద్ద భూదాడిని ప్రారంభించవద్దని వారు కోరారు.

మరోవంక ఐక్యరాజ్యసమితి, మానవతా సంస్థలు గాజాలో కరువు ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాయి. ఇదే సమయంలో ఈయూ నాయకులు గాజాలోకి “మానవతా సాయానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించ వద్దని”  పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి “ఒక సమగ్రమైన పరిష్కారం” కోసం ఈయూ ఒక ప్రణాళికను రూపొందించడమే కాదు మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియ వైపు ప్రయత్నాలను కూడా వారు పునరుద్ధరించారు.

“ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని సాధించడానికి ఏకైక మార్గం రెండు-దేశాలు ఒప్పందాలను సరిగ్గా అమలు చేయడమేనని” అని నలుగురు EU నాయకులు చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles