31 C
Hyderabad
Tuesday, October 1, 2024

కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్…కొనసాగుతున్న గాలింపు!

టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ,  విదేశాంగ మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంగా కారణంగా పర్వత ప్రాంతంలో కుప్పకూలిందని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్‌ వార్తాసంస్థకు తెలిపారు.  ఘటనా స్థలానికి చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు.

ఇరాన్  వాయువ్య ప్రాంతంలోని అజర్‌బైజాన్‌ సరిహద్దు సందర్శన నుండి తిరుగు ప్రయాణంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డోల్లాహియాన్‌ల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని అధికారి తెలిపారు.

అధ్యక్షుడు రైసీ సహా ఇతరులు క్షేమంగా ఉన్నారన్నదానిపై అనుమానాలున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. ఈ విషాద సమయంలో ప్రజలకు అండగా ఉంటానని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖొమేనీ భరోసా ఇచ్చారు. పరిపాలన పరంగా ఎలాంటి అటంకాలు రానివ్వబోనని మాట ఇచ్చారు.

ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని, సహాయక చర్యలను క్లిష్టతరంగా మారాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్మీ, ఎలైట్ రివల్యూషనరీ గార్డ్ తమకు ఉన్న అన్ని వనరులను గాలింపులో ఉపయోగిస్తున్నాయి.

ట్రాఫిజ్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు.  రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, భారీ వర్షాలు పడుతుండడం, దట్టమైన పొగమంచుతో ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా రైసీ కోసం ప్రార్థనలు జరుగుతున్నట్లు విషయాన్ని అధికారక టీవీలో లైవ్ ఇస్తూనే… మరోవైపు, పర్వత ప్రాంతంలో కాలినడకన మోహరించిన రెస్క్యూ బృందాల గాలింపు చర్యలను ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించారు.

విమాన ప్రమాదంపై వచ్చిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు సమాచారం అందించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. శోధనలో ఇరాన్‌కు సహాయం చేయడానికి యూరోపియన్ యూనియన్ అత్యవసర ఉపగ్రహ మ్యాపింగ్ సాంకేతికతను అందించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles