33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాద వార్తపై స్పందించిన ప్రపంచ నేతలు!

దుబాయ్:  ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్టు పలువురు ప్రపంచ దేశాధినేతలు స్పందించారు.

టర్కీ అధ్యక్షుడు

“మా పొరుగు దేశం అధ్యక్షుడు రైసీ, అతని ప్రతినిధి బృందం క్షేమంగా తిరిగొస్తారనే శుభవార్త అందుకోవాలని ఆశిస్తున్నాను” అని ఎర్డోగాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్‌లో తెలిపారు.

నైట్ విజన్ సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్ కోసం ఇరాన్ అభ్యర్థించిందని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ

ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఎక్కడ ఉందో గుర్తించేందుకు శోధన, రెస్క్యూ ఆపరేషన్లలో సాధ్యమైన మేర సహాయాన్ని అందించడానికి UAE సిద్ధంగా ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది

యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్

“ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద వార్త విని మేమెంతో ఆందోళన చెందుతున్నారు. అధ్యక్షుడు, అతని బృందం క్షేమంగా తిరిగి వస్తారని ఆయన ఆశిస్తున్నారు” అని UN ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ

‘ఇరాన్ అధ్యక్షుడు, అతనితో పాటు ఉన్న ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు సంబంధించిన వార్తలను మేము ఆందోళనతో గమనిస్తున్నాము. ఈ క్లిష్ట పరిస్థితిలో వారి భద్రతకు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు కువైట్ తన మద్దతును తెలియజేస్తుందని”పేర్కొంది.

రష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ

“తప్పిపోయిన హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలో అవసరమైన  సహాయాన్ని అందించడానికి రష్యా సిద్ధంగా ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా రష్యా  RIA వార్తా సంస్థను ఉటంకిస్తూ తెలిపారు.

సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ

“ఈ క్లిష్ట పరిస్థితులలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు అండగా ఉంటామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్ సేవలకు అవసరమైన ఏదైనా సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రైసీ హెలికాప్టర్‌కు సంబంధించిన వార్తా నివేదికలను సౌదీ ప్రభుత్వం ‘చాలా ఆందోళనతో’ గమనిస్తోందని కూడా పేర్కొంది.

ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ

“ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ అయినందుకు ఖతార్  తీవ్ర ఆందోళనను  వ్యక్తం చేసింది. ఇరాన్ అధ్యక్షుడి విమానం కోసం అన్వేషణలో అన్ని రకాల సహాయాలు అందించడానికి ఖతార్  సిద్ధంగా ఉందని ప్రకటించింది.  ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి, వారి సహచరులు క్షేమంగా తిరిగొస్తామని ఆశిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

యురోపియన్ కమీషన్

సంక్షోభ సమయంలో యూరోపియన్ కమిషనర్, జానెజ్ లెనార్సిక్, ఇరాన్ నుండి సహాయం కోసం చేసిన అభ్యర్థనను అనుసరించి, కూలిపోయిన హెలికాప్టర్ గాలింపు ప్రయత్నాలకు సహాయం చేయడానికి కమిషన్ తన ఉపగ్రహ మ్యాపింగ్ సేవను అందిస్తామని చెప్పారు. కోపర్నికస్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీస్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా మ్యాపింగ్ సేవలు అందిస్తుంది.

US స్టేట్ డిపార్ట్‌మెంట్

“ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో కూడిన హెలికాప్టర్ ఇరాన్‌లో క్రాష్ ల్యాండింగ్ అయిందన్న వార్తలను మేము నిశితంగా పరిశీలిస్తున్నాము, విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్

అధ్యక్షుడు బిడెన్ ప్రతినిధి, కరీన్ జీన్-పియర్, ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్న విలేకరులతో మాట్లాడుతూ, పరిస్థితిపై అధ్యక్షుడికి వివరించామని తెలిపింది.

అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్

(రైసీ అజర్‌బైజాన్‌తో ఇరాన్ సరిహద్దు నుండి తిరిగి వస్తుండగా అతని హెలికాప్టర్ కూలిపోయింది).

“ఈరోజు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (సందర్శిస్తున్న) అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి స్నేహపూర్వక వీడ్కోలు పలికిన తర్వాత, ఇరాన్‌లో అగ్రశ్రేణి ప్రతినిధి బృందం క్రాష్ ల్యాండింగ్ అయిన హెలికాప్టర్ వార్తతో మేము తీవ్ర ఆందోళనకు గురయ్యాము”

” ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మరియు దానితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం క్షేమంగా తిరిగిరావాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను వేడుకుంటున్నామన్నారు.   ఒక పొరుగు దేశంగా, స్నేహితుడిగా, సోదర దేశంగా, రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్ అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని” ఓ ప్రకటనలో తెలిపారు.

ఇరాక్ ప్రభుత్వం

ప్రమాదానికి గురైన అధ్యక్షుడి హెలికాప్టర్ ఆచూకి  తెలుసుకునేందుకు పొరుగున ఉన్న ఇరాన్‌కు సహాయం అందించాలని ఇరాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ, రెడ్ క్రెసెంట్, ఇతర సంబంధిత సంస్థలను ఆదేశించినట్లు ఇరాక్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles