23.7 C
Hyderabad
Monday, September 30, 2024

టెల్ అవీవ్‌పై మళ్లీ మిస్సైళ్లు ప్రయోగించిన హమాస్!

టెల్ అవీవ్‌: హమాస్ సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్, ఆదివారం నాడు ఇజ్రాయెల్  వాణిజ్య కేంద్రమైన టెల్ టెల్ అవీవ్‌పై దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫా ప్రాంతం నుండి “బడా క్షిపణులతో” దాడిని ప్రారంభించినట్లు తెలిపింది.

జనవరి 2024 తర్వాత టెల్ అవీవ్‌లో రాకెట్ సైరన్‌లు వినిపించడం ఇదే తొలిసారి.

తమ పౌరులపై జియోనిస్ట్ (ఇజ్రాయెల్‌) మారణకాండకు ప్రతిస్పందనగా పెద్ద రాకెట్‌లను ప్రయోగించినట్లు టెలిగ్రామ్ ఛానెల్‌ ద్వారా వెల్లడించింది. గాజా స్ట్రిప్ నుంచే భారీ క్షిపణులను లాంచ్‌ చేసినట్లు హమాస్‌కు చెందిన అల్-అక్సా టీవీ పేర్కొంది.

అయితే ఈ ప్రకటనలో క్షిపణి దాడి కారణంగా వాటిల్లిన నష్టం లేదా ప్రాణనష్టం గురించి అదనపు సమాచారాన్ని అందించలేదు.

అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) టెల్ అవీవ్‌కు ఉత్తరాన ఉన్న Kfar Saba, Herzliya మరియు Raanana లలో సైరన్‌లు మోగించిన ఫోటోను Xలో షేర్ చేసింది.

మరొక పోస్ట్‌లో, IDF ఇలా పేర్కొంది, “క్షణాల క్రితం రఫా నుండి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు రాకెట్ల దూసుకొచ్చాయని రాసింది. “ఈ ఉదయం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా మానవతా సహాయం గాజాలోకి వెళుతోంది, ఇప్పుడు సెంట్రల్ ఇజ్రాయెల్‌పై రాకెట్ల” దాడి జరుగుతోందని అని అది Xలో రాసింది.

అంతేకాదు “ఎయిర్ డిఫెన్స్ ఫైటర్స్ రఫా ప్రాంతం నుండి  తమ దేశం భూభాగంలోకి ప్రవేశించిన అనేక క్షిపణులను అడ్డగించాయి” అని ఇజ్రాయెల్ వైమానిక దళం X లో రాసింది.

కాగా, దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్లను ప్రయోగించినట్లు బీబీసీ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ ఈ రాకెట్లను అడ్డుకున్నదని పేర్కొంది. ఇజ్రాయెల్ సెంట్రల్ సిటీ టెల్ అవీవ్‌, హెర్జ్లియా, పెటా టిక్వాతో సహా పలు నగరాలు, పట్టణాలలో ప్రజలను హెచ్చరించే సైరన్‌లు మోగాయని వెల్లడించింది.

ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా 35,900 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.

అక్టోబరు 7, 2023న దాదాపు 1,200 మందిని చంపిన హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై మారణహోమాన్ని కొనసాగిస్తోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles