23.7 C
Hyderabad
Monday, September 30, 2024

 అమెరికా మద్దతుతో గాజాలో కాల్పుల విరమణను ఆమోదించిన భద్రతా మండలి!

న్యూయార్క్: గాజాలో  కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి భద్రతామండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రష్యా మినహా మిగతా 14 భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. దౌత్యవేత్తలు రష్యాను అడ్డుకోవద్దని ఒప్పించడంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.

ఈ తీర్మానాన్ని ఆమోదానికి ముందు.. ఐక్యరాజ్యసమితిలో మూడు కాల్పుల విరమణ తీర్మానాలను వీటో చేసిన వాషింగ్టన్‌కు కౌన్సిల్ దౌత్య విజయాన్ని అందించింది.

మే 31న ఇజ్రాయెల్ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు మేము శాంతి కోసం ఓటు వేశాం’ అని ఐరాసలో యూఎస్ అంబాసిడర్ లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ అన్నారు.

  • మొదటి దశ ప్రణాళికలో భాగంగా… ఇది తక్షణ కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లకు బదులుగా బందీలందరినీ విడుదల చేయడం, నిరాశ్రయులైన గాజా పౌరులను వారి ఇళ్లకు తిరిగి రప్పించడం, ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం.
  • రెండవ దశ రెండు పార్టీల ఒప్పందంతో శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది.
  • మూడవ దశలో గాజాలో పునర్నిర్మాణ ప్రణాళిక, మరణించిన బందీల అవశేషాలను తిరిగి పొందడం జరుగుతుంది.

మొదటి దశ కోసం చర్చలు ఆరు వారాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, చర్చలు కొనసాగుతున్నంత కాలం కాల్పుల విరమణ కొనసాగుతుందని ప్రతిపాదన చెబుతుంది” అని తీర్మానం పేర్కొంది.

అంతేకాదు ఈ తీర్మానంలో “గాజా భూభాగాన్ని తగ్గించే ఏవైనా చర్యలతో సహా గాజా స్ట్రిప్‌లో ఏదైనా ప్రయత్నాన్ని లేదా ప్రాదేశిక మార్పును” కూడా తిరస్కరించింది.

ఇక ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. హమాస్ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది. హమాస్, పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు వక్షాలు అంగీకరించనట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పదం కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశం అయిన అనంతరం ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఇక.. ఈ తీర్మానంపై రష్యా విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తిచూపింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles